Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇంట్లో చెత్తబుట్ట వాసన వస్తుందా? ఈ చిట్కాలు పాటిస్తే తలతల మెరిసిపోతుంది
ఎవరైనా సరే తమ ఇంటిని ప్రేమగా, శుభ్రంగా ఉంచుకుంటారు. బయట గేటు దగ్గర నుంచి ఇంట్లోని ప్రతి మూల మెరిసిపోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ఇదే సమయంలో మనం తరచుగా మరచిపోయే ఒక ముఖ్యమైన వస్తువు ఉంటది..అదే చెత్తబుట్ట. ఇంటిలోని చెత్తనంతా తనలో వేసుకుని, ఇంటిని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడే ఈ చెత్తబుట్ట.. చివరికి తానే అత్యంత మురికిగా, దుర్వాసనకు నిలయంగా మారిపోతుంది. ఈ సమస్య మీ ఇంట్లో కూడా ఉందా? చెత్తబుట్టను సులభంగా శుభ్రం చేసి, అది మళ్ళీ త్వరగా మురికి కాకుండా చూసుకునేందుకు ఇక్కడ కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.
చెత్తబుట్టను శుభ్రం చేయడానికి మన వంటింటి చిట్కాలు
రసాయనాలతో కూడిన ఖరీదైన క్లీనర్స్ అవసరం లేకుండా మన వంటింట్లో ఉండే సహజమైన వస్తువులతోనే చెత్తబుట్టను కొత్తదానిలా మెరిపించవచ్చు.

వెనిగర్
ఒక కప్పులో గోరువెచ్చని నీరు తీసుకుని దానికి సమానంగా వెనిగర్ కలపండి. ఈ మిశ్రమంలో కొద్దిగా డిటర్జెంట్ కూడా జోడించి, బాగా కలపాలి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని చెత్తబుట్ట లోపల, వెలుపల స్ప్రే చేసి లేదా ఒక గుడ్డతో రాసి ఐదు నిమిషాల పాటు వదిలేయండి. ఆ తర్వాత చేతులకు గ్లౌవ్స్ ధరించి, ఒక బ్రష్‌తో రుద్దితే చాలు. మొండి మరకలు, జిడ్డు వదిలిపోయి చెత్తబుట్ట శుభ్రంగా మారుతుంది.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా కేవలం శుభ్రపరచడమే కాదు, చెడు వాసనలను పీల్చుకోవడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. చెత్తబుట్ట లోపల కొద్దిగా బేకింగ్ సోడా చల్లి, దానిపై డిటర్జెంట్ వేసి బ్రష్ తో బాగా రుద్దండి. ఆ తర్వాత వేడి నీటితో కడిగితే మురికితో పాటు దుర్వాసన కూడా మాయమవుతుంది.
నిమ్మరసం
నిమ్మలో ఉండే సిట్రిక్ ఆమ్లం సహజమైన క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో రెండు, మూడు నిమ్మకాయల రసం, కొద్దిగా డిటర్జెంట్ కలిపి ఒక ద్రావణాన్ని సిద్ధం చేసుకోండి. ఈ నీటితో చెత్తబుట్టను శుభ్రంగా కడిగితే అది శుభ్రపడటమే కాకుండా, తాజా నిమ్మ సువాసనతో పరిమళభరితంగా ఉంటుంది.

ఈ స్మార్ట్ టిప్స్ పాటించండి
చెత్తబుట్టను శుభ్రం చేయడం ఒక ఎత్తైతే.. అది మళ్ళీ త్వరగా మురికి కాకుండా చూసుకోవడం మరో ఎత్తు. దీనికోసం ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోండి.
-చెత్త వేయడానికి ముందు, డబ్బా అడుగున ఒక పాత న్యూస్ పేపర్ లేదా ఏదైనా మందపాటి కాగితాన్ని పరవండి. ఇది చెత్త నుండి వచ్చే ద్రవాలను పీల్చుకుని, డబ్బా అడుగుభాగం పాడవకుండా కాపాడుతుంది.
- ఎల్లప్పుడూ చెత్తబుట్ట లోపల ఒక పెద్ద చెత్త కవర్ (గార్బేజ్ బ్యాగ్)ను ఉంచండి. ఇది అత్యంత ముఖ్యమైన నియమం. దీనివల్ల చెత్త నేరుగా డబ్బాకు అంటుకోదు.
-కూరగాయల వ్యర్థాలు, పండ్ల తొక్కలు వంటి తడి చెత్తను నేరుగా వేయకండి. వాటిని ఒక చిన్న పాలిథిన్ కవర్‌లో కట్టి, ఆ తర్వాత చెత్తబుట్టలో వేయండి. దీనివల్ల దుర్వాసన రాదు, డబ్బా జిగటగా మారదు.
-చెత్త కవర్ నిండిన వెంటనే దాన్ని తీసివేసి, కొత్త కవర్ ను అమర్చండి. చెత్తను ఎక్కువ రోజులు నిల్వ ఉంచవద్దు.



Click it and Unblock the Notifications