Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఆశీర్వాదం 2.0..చొక్కాపై QR కోడ్ తో పెళ్లిలో చదివింపులు స్వీకరించిన తండ్రి!..వీడియో చూడండి
ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మనదేశంలొ పెళ్లిళ్లు జరుగుతాయి. చాలాదేశాల్లో తూతూ మంత్రంగా పెళ్లిళ్లు జరిగితే.. భారతీయ పెళ్లిళ్లు మాత్రం అంగరంగ వైభవం, సంప్రదాయాలు, బంధుమిత్రుల సందడికి మారుపేరు.
ముఖ్యంగా పెళ్లికి వచ్చిన గెస్టులు,బంధువులు నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ప్రేమగా చదివింపుల రూపంలో డబ్బులు లేదా కవర్స్ వారికి ఇస్తుండటం మన సంప్రదాయంలో ఒక భాగం. అయితే టెక్నాలజీ పెరిగేకొద్దీ, మన సంప్రదాయాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.

డిజిటల్ ఇండియా నినాదం ఇప్పుడు పెళ్లి పందిళ్లలోకి కూడా పాకింది. కేరళలో ఓ తండ్రి తన కుమార్తె వివాహంలో చేసిన ఒక వినూత్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
డిజిటల్ చదివింపులకు స్వాగతం
కేరళలో జరిగిన వివాహ వేడుకలో వధువు తండ్రి తన చొక్కా జేబుపై ఏకంగా ఓ పేటీఎం క్యూఆర్ కోడ్ ను అతికించుకుని మరీ అతిథులకు స్వాగతం పలికారు.
పెళ్లికి వచ్చిన వారు చదివింపుల కోసం కవర్లలో డబ్బులు పెట్టే పనిలేకుండా తమ స్మార్ట్ ఫోన్ లతో ఆ కోడ్‌ను స్కాన్ చేసి, క్షణాల్లో డిజిటల్ రూపంలో తమ బహుమతిని అందించారు. ఈ ఆధునిక ఆలోచన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి.
చాలామంది ఈ కొత్త పద్ధతిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇది కదా అసలైన డిజిటల్ ఇండియా వెడ్డింగ్ ఎడిషన్ అని కొందరంటే..ఇక నగదుకు స్వస్తి కేవలం స్కాన్లు, శుభాకాంక్షలు మాత్రమే అంటూ మరికొందరు సరదాగా వ్యాఖ్యానించారు. ఈ విధానం ఎంతో ఆచరణాత్మకమైనది, పర్యావరణహితమైనది అని పలువురు అభిప్రాయపడ్డారు.
దీనివల్ల చిల్లర సమస్య ఉండదని, కాగితపు కవర్ల వాడకాన్ని తగ్గించి, జీరో పేపర్ వేస్ట్ కు ఇదొక అద్భుతమైన ఉదాహరణ అని కొనియాడారు. 100శాతం అక్షరాస్యత కలిగిన కేరళలో ఇలాంటి ప్రగతిశీల ఆలోచన రావడం సహజమేనని మరికొందరు అభిప్రాయపడ్డారు.
విమర్శలు..వివాదాలు
అయితే పెళ్లి లాంటి పవిత్రమైన వేడుకలో ఈ డిజిటల్ లావాదేవీలు ఏంటి? మన సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ఇందులో చోటెక్కడ? ఇది కాస్త వింతగా, ఇబ్బందికరంగా ఉంది అని మరికొందరు నెటిజన్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది అడుక్కోవడంలో కొత్త పద్ధతిలా ఉంది అని ఘాటుగా విమర్శించారు.
సంప్రదాయబద్ధంగా చేతికి కవరు అందించి ఆశీర్వదించడంలో ఉండే ఆత్మీయత, ఈ డిజిటల్ స్కాన్ లలో లోపిస్తుందని వారు వాదించారు. ఈ సంఘటన ఒకవైపు నవ్వులు పూయిస్తుంటే, మరోవైపు భవిష్యత్తులో వివాహాల స్వరూపం ఎలా ఉండబోతోందనే చర్చకు దారితీసింది.



Click it and Unblock the Notifications