Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Mothers Day 2023: అమ్మ అంత ప్రత్యేకంగా ఉండడానికి కారణాలేంటో తెలుసా?
దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మలను సృష్టించాడని అంటారు. అది నిజమే అనిపిస్తుంది కూడా. ఎందుకంటే బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి ఆమె చనిపోయే వరకు పిల్లల కోసమే ప్రతీ క్షణం పరితపిస్తుంటుంది. వారి ఆకలితో ఉన్నా సమస్యల్లో ఉన్నా వెంటనే స్పందిస్తుంది. వారి కోసం వారి జీవితాల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తుంటుంది. పిల్లలు ఏదైనా ఆపదలో ఉంటే ప్రాణాలకు తెగించి అయినా సరే వారిని కాపాడుకుంటుంది.
వారు కష్టపడకుండా, సంతోషంగా ఉండాలని పూజలు, పునస్కారాలతో పాటు ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకూ కష్టపడుతుంది. అమ్మ ప్రేమను, మాతృత్వాన్ని ఏడాదికి ఒకసారి అయినా గుర్తు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతీ సంవత్సరం మే 2వ ఆదివారం రోజున మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే ఈ ఏడాది మే 14వ తేదీన మాతృదినోత్సవం వస్తోంది. అసలు అమ్మ, ఆమె ప్రేమ అంత ప్రత్యేకంగా ఉండడానికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. మీ గురించి ఆమెకు పూర్తిగా తెలుసు..!
ప్రతీ తల్లి తమ పిల్లల మొహాలను చూసే ఏం జరిగిందో పసిగట్టగలదు. ఎంత తెలియదు కూడదని ప్రయత్నంచినా అమ్మలు ఇట్టే కనిపెట్టేస్తారు. పిల్లల ఇష్టాలతో పాటు వారి కష్టాలను కూడా కచ్చితంగా తెలుసుకునేది ఒక అమ్మ మాత్రమే.
2. విశ్వమంత ప్రేమను ఇస్తుంది..!
దాదాపుగా ప్రతీ అమ్మ తమ పిల్లను విపరీతంగా ప్రేమిస్తుంది. తల్లి ప్రేమకు అవధులు లేవు. పిల్లలు పెద్ద వాళ్లు అయినా ఆ తల్లి కంటికి చిన్న పిల్లల్లాగే కనిపిస్తుంటారు. ఎన్ని తప్పులు చేసినా, కష్టపెట్టినా ఆమె మీ సుఖమే కోరుకుంటుంది. ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలనుకోదు.
3. అమ్మే మన మొదటి గురువు
ప్రతీ మనిషికి తన తల్లే మొదటి గురువు. పదాల నుంచి జీవిత పాఛాల వరకు అన్నీ నేర్పుతుంది. ఆమెను మించిన మరో ఉపాధ్యాయురాలు ఉండదు. ఇతరులతో ఎలా ఉండాలి, ఎలా మెలగాలనేది తల్లే నేర్పిస్తుంది. సమస్యలను ఎలా అధిగమించాలో కూడా చెబుతుంది. మనలో దాగి ఉన్న టాలెంట్ ను మనకు అమ్మే పరిచయం చేస్తుంది.
4. ఎప్పుడూ మన వెన్నంటే ఉంటుంది..!
బిడ్డకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తల్లి వెన్నంటే ఉంటుంది. సమస్యను ధైర్యంగా ఎదుర్కునేలా చేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఏది పోయినా తిరిగి సంపాధించుకోవచ్చనే భరోసాను కల్పిస్తుంది.
5. మనపై ఎప్పటికీ ఆమెకు నమ్మకం ఉంటుంది!
ప్రపంచం అంతా మనకు వ్యతిరేకంగా ఉన్నా తల్లి మాత్రం మన వెనకాలే ఉంటుంది. మనలోని తప్పుల్ని కడుపులో దాచుకొని మంచిని ప్రపంచానికి చూపిస్తుంది. ఏదైనా తప్పు చేసినా అర్థమయ్యేలా చెబుతుంది. మరోసారి అలా జరగకుండా చూసుకుంటుంది. మనల్ని ఎవరు నమ్మకపోయినా ఆమె నమ్మి మన వెనకాలే నడుస్తుంది.
6. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపుతుంది..!
మన జీవితంలో మనకు ఎదురయ్యే ఎలాంటి సమస్యలకు అయినా తల్లి పరిష్కారం చూపుతుంది. బిడ్డ ఒంటరిగా ఉండడం, బాధ పడడాన్ని ఏ తల్లీ భరించలేదు. అందుకే ఆమెకు సాధ్యమైనంత వరకు మనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తూనే ఉంటుంది.
7. మనలోని మంచి బయటకు తీస్తుంది..!
మనం ఏ విషయం గురించి అయినా తీవ్రంగా భయపడుతున్నా, నేను ఇది చేయలేను అని ఫీలువుతున్నా ఆమె మనకు భరోసాను కల్పిస్తుంది. మనలోని టాలెంట్ ను బయటకు తీస్తుంది. సుగుణాలను గుర్తించి వివరిస్తుంది.
తల్లులకు పిల్లలపై ప్రేమను వర్ణించడం చాలా కష్టం. తల్లి ఉన్న పిల్లలు ఎంత సంతోషమైన జీవితాల్లో గడుపుతారో తల్లిలేని పిల్లలు అంత నరకాన్ని చూస్తారు. ఒక్కసారి వాళ్లని అడిగితే తెలుస్తుంది అమ్మ ప్రేమ అంటే ఏంటో. తల్లులు లేకుండా పిల్లలు జీవితాలను ఊహించడమే చాలా కష్టం. అమ్మ విలువ తెలుసుకొని మెలగండి. కాస్టీ బహుమతులు ఇవ్వకపోయినా, కార్లలో తిప్పకపోయినా.. బుక్కెడు బువ్వ పెట్టి రోజూ మాట్లాడండి చాలు.



Click it and Unblock the Notifications