Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
7 వేళ ఏళ్ళ నాటి రోడ్డు, మధ్యదరా సముద్రం అడుగున గుర్తింపు
పురావస్తు శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగించే ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకటీ, రెండూ కాదు ఏకంగా 7 వేల సంవత్సరాల నాటి ఓ రోడ్డు మార్గాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. మధ్యదరా సముద్ర అడుగున ఈ అతి పురాతన రోడ్డు మార్గాన్ని గుర్తించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ రహదారి మార్గం క్రొయేషియన్ ద్వీపంలోని కోర్కులా తీరాన్ని కలుపుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పురాతన రహదారి మార్గం హ్వార్ సంస్కృతికి చెందినదిగా భావిస్తున్నారు. ఈ రహదారి నాలుగు మీటర్ల వెడల్పుతో ఉంది. రాళ్లను ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఈ రహదారిని నిర్మించినట్లు తెలుస్తోంది.

ఎంతో నైపుణ్యంతో నిర్మించిన రోడ్డు
పురావస్తు పరిశోధనల్లో దొరికిన ఓ చెక్కను శాస్త్రవేత్తలు పరిశోధించారు. దానిని రేడియో కార్బన్ అనాలిసిస్ ద్వారా పరిశీలించగా అది దాదాపు 7 వేల సంవత్సరాల నాటిదని తేలింది. ఈ వివరాలు క్రొయేషియా వర్సిటీ ఆఫ్ జదర్ పరిశోధకులు ఫేస్ బుక్ పోస్టు ద్వారా ప్రపంచంతో పంచుకున్నారు. 7000 ఏళ్ల క్రితం ఈ రోడ్డుపై ప్రజలు నడిచేవారని పరిశోధనల్లో వెల్లడైంది.
నియోలిథిక్ సెటిల్మెంట్‌లో ఈ రహదారి ఓ భాగమని పరిశోధకులు భావిస్తున్నారు. హ్వార్ సంస్కృతిలో నివసించే నైపుణ్యమున్న ఇంజినీర్లు ఈ రహదారిని నిర్మించినట్లు అనుకుంటున్నారు. సముద్ర తీరం వెంబడి, సమీపంలోని ద్వీపాల్లో చిన్న చిన్న సమూహాలుగా అప్పటి ప్రజలు జీవించే వారు. వ్యవసాయం, పశుపోషణ చేస్తూ జీవనం సాగించే వారు.
హ్వార్ సంస్కృతి గురించి ఇంకా ఎంతో ఉంది:
కొర్కులా ద్వీపంలోని వెలా లుక సమీపంలో ఉన్న గ్రాండినా బే వద్ద జరిగిన భూ పరిశోధనల్లో భాగంగా సముద్రం అడుగు భాగంలో ఈ అతి పురాతన రోడ్డు మార్గాన్ని పరిశోధకులు కనుగొన్నారు. సోలిన్ సైట్ వద్ద డైవింగ్ చేస్తున్న సమయంలో సోలిన్ వద్ద ఒక కట్టడాన్ని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ప్రాంతంలో చెకుముకి బ్లేడ్లు, రాతి గొడ్డళ్లు వంటి నియోలిథిక్ వస్తువులు కూడా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ సోలిన్ సైట్ ను ఇంకా పూర్తిగా తవ్వలేదని, హ్వార్ సంస్కృతి మరియు దాని జీవన విధానం గురించి తెలియాల్సిన నిజాలు ఇంకా చాలా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
