Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
బ్రెయిన్ ఇంప్లాంట్ ద్వారా మూర్ఛ వ్యాధికి చెక్.. ప్రపంచంలోనే మొదటి సర్జరీ సక్సస్..!
ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కొన్ని రోగాలు ఇంకా నయం కాకుండా అలాగే వుంటాయ్. మూర్ఛ వ్యాధి వచ్చిన వారికి తగ్గాలంటే చాలా కష్టం. వారికి ఎప్పుడు ఫిట్స్ వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కొంత మందికి రోజకు 3, 4 సార్లు ఫిట్స్ వస్తుంది. ఈ మూర్ఛ వ్యాధికి మెదడుకు చాలా దగ్గరి సంబంధం వుంది. అయితే ఇంగ్లాండ్‌లోని ఒక టీనేజర్ ఈ మూర్చవ్యధి నుంచి పూర్తిగా కోలుకుంటున్నాడు. మెదడులో ఇంప్లాంట్ చేయడం ద్వారా ఇది సాధ్యపడింది.
మెదడులో బ్లడ్ క్లాట్ కావడం వల్ల కూడా మూర్చ వ్యాధి వస్తూవుంటుంది. ఇంగ్లాండ్‌కు చెందిన ఒరన్ నోల్సన్‌కు తీవ్రమైన ఎపిలెప్సీ వ్యాధితో బాధపడేవాడు. తన తల్లి జస్టిన్ ఎంతో మంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తల్లి చాలా మంది సర్జన్లను సంప్రదించి ఎట్టకేలకు లండన్ లోని మార్టిన్ టిస్డల్ అనే పిల్లల వైద్యుడిని, న్యూరోసర్జన్ అయిన అతన్ని సంప్రదించింది. తన కొడుకు ఒరన్‌ను అతనికి చూపించింది.

డాక్టర్ ఒక డివైస్‌ను పిల్లాడి బ్రెయిన్‌లో అమర్చి సర్జరీ చేశాడు. అప్పటి నుంచి మూర్చలు 80 శాతం తగ్గినట్టు స్వయం తల్లి తెలిపింది. డివైస్ ను ఎప్పుడంటే అప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దాన్ని ఆన్ చేయడం ద్వారా మెదడుకు కావాల్సిన విద్యుత్తు తరంగాలను చేరవేస్తుంది. దీని వల్ల ఫిట్స్ రాకుండా వుంటయ్. ఈ డివైస్ ప్రయోగం 13 ఏళ్ల ఓరన్‌లో విజయవంతం కావడంతో వైద్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొడుకు ఇక ఫిట్స్‌కు గురికాకుండా సంతోషంగా ఆడుకుంటుండంతో తల్లి కూడా చాలా ఆనందపడుతోంది.
ఎపిలెప్సీ లేదా మూర్చ వ్యాది చాలా తీవ్రంగా వుంటుంది. ఈ వ్యాధి వున్నవారిలో మెదడులో చిన్న గాయం, లేదా పురుగు చేరడం వల్ల ఈ మూర్చ వ్యాధి వస్తుంది. దీని నుంచి సులభంగా బయటపడలేరు. మూర్చ వ్యాధి వున్నవారు ఎప్పుడు, ఎక్కడ మూర్చపడిపోతారో తెలియదు. ఫిట్స్ వచ్చినప్పుడు వారి చేతిలో ఇనుముకు సంబంధించినది ఏదైనా పెట్టడం వల్ల వారికి అప్పటికప్పుడు ఫిట్స్ తగ్గుతాయ్. లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా వుంది.

ప్రపంచంలో ఇప్పటి వరకు మొత్తం సుమారుగా 5 కోట్ల మంది మూర్చ వ్యధి బారినపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఎక్కువ కేసులు వుండడం గమనించాల్సిన విషయం. మెదడులో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినవాళ్లు ఈ మూర్చ వ్యాధితో బాధపడుతుంటారు. ఎప్పుడైనా తలకు దెబ్బ తగిలి, మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల కూడా ఈ మూర్చ వ్యాధి వస్తుంది.



Click it and Unblock the Notifications