Latest Updates
-
పంజాబీ జీరా ఆలూ ఫ్రై.. అన్నం, పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే సైడ్ డిష్! -
బీహారీ స్పెషల్ దాల్ పిఠీ..ఇది తింటే పిజ్జా, బర్గర్లు కూడా మర్చిపోతారు! -
షుగర్ పేషెంట్లు తినాల్సిన బెస్ట్ హెల్తీ స్నాక్స్ ఇవే.. -
బెండకాయ ఫ్రై ఇలా చేస్తే..కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ..పప్పుచారు, రసంలో నంజుకుంటే కేక -
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే.. -
ఎనకటి తరం హెల్తీ బ్రేక్ ఫాస్ట్..పోషకాలు నిండిన రాగి మునగాకు రొట్టె..చేయడం చాలా ఈజీ -
మా కంపెనీలో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు? అభ్యర్థి ఆన్సర్ తో నెట్టింట రచ్చ.. -
గొంతు గరగరను తగ్గించే,రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి కొత్తిమీర సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
రైస్ vs చపాతీ..రాత్రి డిన్నర్ లోకి ఏది తినాలి?..డాక్టర్ దీప్తి చెప్పిన కీలక విషయం.. -
రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
ప్రేమించిన పాపానికి ఇంత ఘోరమా? తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించిన యువతి కుటుంబం!
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలకు విషయం తెలిసింది. ఆ అబ్బాయితో రిలేషన్ షిప్ ని అమ్మాయి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అయినా ఆ ప్రేమికులు ఆగలేదు. చివరకు నడిరోడ్డు మీద నగ్నంగా నడవాల్సి వచ్చింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షాలని నెటిజన్లు కోరుతున్నారు.
కోల్ కతాలో నివసించే ఒక యువతి,యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ నెల 25న అంటే ఆదివారం యువతీ, యువకుడు కలిసి ఉండగా అమ్మాయి కుటుంబసభ్యులు గమనించారు. దీంతో అమ్మాయి తండ్రి, మేనమామ కలిసి ఆ యువకుడిని తమ ఇంట్లోనే నిర్భందించి దారుణంగా కొట్టారు. ఆ తర్వాత యువకుడి తండ్రికి ఫోన్ చేశారు. విషయం తెలియడంతో కంగారుగా అక్కడికి చేరుకున్నాడు యువకుడి తండ్రి. తన కొడుకు పరిస్థితి చూసి కన్నీరుపెట్టుకున్నాడు. అయితే అదే సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం..అమ్మాయి తండ్రి, మేనమామ కలిసి యువకుడి తండ్రి చేతికి ఒక గన్ ఇచ్చి అతడికి రెండు ఆప్షన్స్ ఇచ్చారు. నీ కొడుకుని కాల్చి చంపెయ్ లేదా నగ్నంగా రోడ్ల మీద నగ్నంగా నడవాలని భయపెట్టారు. తాను కోడుకుని కాల్చి చంపను అని చెప్పడంతో తండ్రి, కొడుకుల బట్టలను విప్పేశారు. సాయంత్రం సమయంలో కోల్ కతాలోని సర్సునా బెహాలా ఏరియాలో రోడ్డు మీద అందరూ చూస్తుండగా వారిని నగ్నంగా నడిపించారు. వారిద్దరినే కాకుండా ఆ యువకుడి ఫ్రెండ్ ని కూడా ఇదే విధంగా చేసినట్లు సమాచారం.

ఇక తండ్రి, కొడుకు రోడ్డు మీద నగ్నంగా బట్టల్లేకుండా నడుస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఆ తర్వాత స్థానికలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేయండంతో స్థానికంగా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. కొందరు వ్యక్తులు అయితే యువతి ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి అమ్మాయి తండ్రి, మేనమామ, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆ యువకుడు చేసిన తప్పు ఏంటీ, కేవలం ప్రేమించడమే అతడు చేసిన తప్పా, అతని తండ్రి ఏం చేశాడని..వాళ్ల ప్రేమ నచ్చకపోతే అర్థమయ్యేలా తమ కూతురికి చెప్పుకోవాలి లేదా ఆమెకు నచ్చిన వ్యక్తితో బతికే స్వేఛ్చను కల్పించాలి తప్ప ఆ అబ్బాయి అంత దారుణంగా దాడి చేసి, నడిరోడ్డు మీద బట్టేలకుండా నడిపించి, అతని తండ్రిని కూడా ఆ విధంగా చేయడం చాలా దరుణం అని.. నిందితులకు కఠిన శిక్ష పడాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
