అయ్యయ్యో పాపం తాత..75 ఏళ్ల వ్యక్తితో 30 ఏళ్ల యువతి పెళ్లి వ్యవహారంలో భారీ ట్విస్ట్..వీడియో చూడండి

ఒక పది రోజుల క్రితం 30 ఏళ్ల అమ్మాయి 75 ఏళ్ల వృద్ధుడిని ప్రేమించి, పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ అమ్మాయి, వృద్ధుడికి ఎంగేజ్మెంట్ అయిన ఫొటోలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి.

అయితే ఈ ప్రేమ కథలో ఇప్పుడు పెద్ద ట్విస్ట్ బయటకొచ్చింది. పెళ్లి కోసం తాత తహతహలాడుతున్న టైంలో ఊహించని షాక్ తగిలింది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Shocking Twist 30 Year Old Reena Cancels Wedding With 75 Year Old Ram Sughar Real Truth Exposed

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔరైయాకి చెందిన 30 ఏళ్ల రీనా రాజ్ పుత్, 75 ఏళ్ల రామ్ సుగర్ అనే వ్యక్తితో ప్రేమలో పడిందని..రామ్ సుగర్ భార్య ఏడేళ్ల క్రితం చనిపోగా కూతురు ఇంట్లోనే రామ్ సుగర్ ఉండేవాడని, ఆ సమయంలో రామ్ సుగర్ కూతురు ఇంటికి రీల్స్ చేయడానికి రీనా వెళ్లేదని, ఆ క్రమంలో రామ్ సుగర్, రీనా ఒకరినొకరు ఇష్టపడ్డారు, తర్వాత అది ప్రేమగా మారి్ది, భార్యను కోల్పోయిన రామ్ సుగర్ ని పెళ్లి చేసుకోవాలని రాణి రాజ్ పుత్ నిర్ణయించుకుంది..కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అంటూ దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఉంగరాలు మార్చుకోవడం, హల్దీ వేడుక జరుపుకోవడం వంటి వీడియోలు వైరల్ అయ్యాయి. త్వరలోనే పెళ్లి జరుగుతుందని రామ్ సుగర్ కూతురు రాధా ప్రకటించింది.

ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే..ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే..

అయితే తాజాగా రీనా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రామ్ సుగర్ తో తన ఎంగ్ మెంట్ వీడియో చూసిన తర్వాత గొడవల కారణంగా పిల్లలతో కలిసి తనను వదిలేసి పోయిన భర్త మళ్లీ తిరిగొచ్చాడని, తమకు అధికారికంగా విడాకులు జరగలేదని, తన భర్తతోనే తాను మళ్లీ కలిసి ఉండాలనుకుంటున్నట్లు, తన కుటుంబసభ్యులు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదని తెలిపింది. రామ్ సుగర్ తో పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా తన భర్తని మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇద్దరూ దండలు మార్చుకుంటున్నట్లు కూడా తాజా వీడియోలో కనబడుతుంది. తన ఇద్దరు కొడుకులు, భర్తతో కలిసి తాను సంతోషంగా ఉంటానని రాణి తాజా వీడియోలో చెప్పింది.

రామ్ సుగర్ తో ఎంగేజ్మెంట్ వ్యవహారం అంతా ఆయన కూతురు రాధా ప్రోత్సాహంతో వ్యూస్ కోసం ఆడిన డ్రామా అని పరోక్షంగా అంగీకరించింది. రామ్ సుగర్ కూడా ఇదంతా ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్, పాపులారిటీ కోసం చేసిన తతంగమే అని అంగీకరించినట్లు సమాచారం.

Desktop Bottom Promotion