Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
అస్తమించనున్న శుక్రుడు, ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు, మీ రాశి ఉందా?
వేదజ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్ర గ్రహాన్ని సంపద, శ్రేయస్సు, భౌతిక ఆనందానికి, ప్రేమకు, అందానికి అధిపతిగా పరిగణిస్తారు. భౌతిక సుఖాల అధిపతిగా పరిగణించే శుక్రుడు ప్రస్తుతం సింహ రాశిలో ఉన్నాడు. ఆగస్టు 3వ తేదీ గురువారం రోజు రాత్రి 7.37 గంటలకు సింహరాశిలోనే అస్తమించనున్నాడు. ఆగస్టు 3వ తేదీ నుంచి ఆగస్టు 19 వరకు శుక్రుడు తిరోగమనంలో ఉంటాడు. ఆ తర్వాత ఆగస్టు 19వ తేదీ శనివారం రోజు శుక్రుడు తిరిగి కన్యా రాశిలో ఉదయిస్తాడు.
జ్యోతిష్య ప్రకారం ఏదైనా గ్రహం అస్తమించినప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది. దుష్ప్రభావం పెరుగుతుంది. ఆగస్టు 3న శుక్రుడు అస్తమిస్తున్నందున, 3వ రాశి వ్యక్తులు 16 రోజుల పాటు అశుభ ఫలితాలను ఎదుర్కొంటారు. ఆర్థికంగా, వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. శుక్ర అస్తమించడం వల్ల కష్టాలు ఎదుర్కొనే ఆ రాశులు ఏవో, ఏయే రాశుల వారు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారో ఇప్పుడు చూద్దాం.

మిథునరాశి:
శుక్రుడు అస్తమించడం వల్ల మిథున రాశి వారు కష్టాలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో మిథునరాశి వారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. దాని వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. లెక్కలోకి రాని ఖర్చులు పెరగడం వల్ల బడ్జెట్ తలకిందులు అవుతుంది. దీని వల్ల అవసరమైన వాటికి డబ్బు ఉండకుండా పోతుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. శుక్రుడు అస్తమించిన 16 రోజుల పాటు మిథున రాశి వారు ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమయంలో ఎవరికీ అప్పుగా డబ్బు ఇవ్వకూడదు. అలా ఇచ్చిన డబ్బు తిరిగిరావడం కష్టంగా ఉంటుంది. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు పదాల ఎంపిక బాగుండేలా చూసుకోవాలి.
వివాదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నారు. ఉద్యోగాల్లో ఉన్న వారు సహోద్యోగులకు, ఉన్నతోద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గాసిప్స్ జోలికి వెళ్లవద్దు. పై అధికారులతో వీలైనంత మేరకు సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించాలి. లేకపోతే చిన్న చిన్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో మనశ్శాంతి దూరం అవుతుంది.
ధనుస్సు రాశి:
శుక్రుడు అస్తమించడం వల్ల ధనుస్సు రాశి వారికి ఆరోగ్య సమస్యలు రావొచ్చు. చిన్న పాటి అనారోగ్యాన్ని కూడా అశ్రద్ధ చేయవద్దు. వీలైనంత త్వరగా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారు ఆచితూచి వ్యవహరించాలి. చిన్నపాటి పెట్టుబడి అయినా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. నష్టభయం ఎక్కువగా ఉన్న వాటికి దూరంగా ఉండాలి. స్టాక్ మార్కెట్, జూదం లాంటి వాటిలో డబ్బు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. కార్మికులు తమ పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. పని ప్రాంతంలో ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒత్తిడి పెరుగుతుంది. సంయమనంతో వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి. శుక్రుడి అస్తమయం ద్వారా శత్రువులు మీపై పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయి.
తులా రాశి:
శుక్రుడు అస్తమించడం వల్ల తులారాశి వారు కష్టాలు పడతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన విషయంలోనూ నియంత్రణ అవసరం. ఈ సమయంలో పని లేదా వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎదుటివారు చెప్పేది వినడం నేర్చుకోవాలి. తొందరపడి మాటలు మాట్లాడవద్దు. తొందరపాటు పనులు చేయవద్దు. ఆర్థిక సమస్యలు రావొచ్చు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications