Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సింహరాశిలో కుజుడు, శుక్రుడు కలయిక.. ఈ రాశుల వారికి ధనలాభం, లక్ష్మీ కటాక్షం
జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం చాలా ముఖ్యమైంది. గ్రహాల కదలిక మనుషుల జీవితాలపై ప్రభావం చూపిస్తాయి. గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి కలిసొస్తే.. మరికొందరికి అశుభ పలితాలను ఇస్తుంది. గ్రహాల మార్పు అనుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. గ్రహాల్లో శుక్ర గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. కదలికలో మార్పు వచ్చినప్పుడు అది కచ్చితంగా ఒకరి విలాసవంతమైన జీవితాన్ని, ప్రేమ జీవితాన్ని, సంపదను ప్రభావితం చేస్తుంది. సంపదకు, కీర్తికి కారకుడు శుక్రుడు.
జులై 1వ తేదీన అంగారకుడు(కుజుడు) సింహ రాశిలోకి ప్రవేశించాడు. జులై 7వ తేదీన శుక్రుడు కూడా సింహరాశిలోకి సంచారం చేయనున్నాడు. సింహ రాశిలో ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల కొన్ని రాశుల వారిపై అనుకూలంగా, మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉండనుంది. సింహ రాశిలో కుజ శుక్ర గ్రహాల సంయోగం మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. ఈ కలయిక శుభ ఫలితాలను అందిస్తుంది. ఆ రాశులు ఏవో, ఆ రాశుల్లో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
మేష రాశి వారికి ఐదవ ఇంట్లో సింహ రాశి వస్తుంది. ఈ రాశిలో కుజుడు ఐదో స్థానంలో సంచరిస్తాడు. కాగా ఈ ఇంట్లో శుక్రుడు కూడా అప్పటికే ఉండనున్నాడు. ప్రేమ జీవితానికి ఈ సమయం అనుకూలంగా ఉండనుంది. దంపతుల మధ్య కోపతాపాలు తొలగిపోయి, సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమానురాగులు మెరుగుపడతాయి. ఒంటరిగా ఉన్న వారికి పెళ్లి అవకాశాలు పెరుగుతాయి. శుక్రుడు-అంగారకుడు కలయిక కారణంగా మేష రాశి వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ రంగాల్లో ఉన్న వారికి లాభాలు వస్తాయి.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి యొక్క మొదటి మరియు 6వ ఇంటికి అంగారకుడు అధిపతి. శుక్రుడు 7వ మరియు 12వ ఇంట్లో ఉంటాడు. ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశి వారి 10వ ఇంట్లో కలయిక చెందుతారు. దీంతో వృశ్చిక రాశి వారి కెరీర్ పురోగమిస్తుంది. మంచి అవకాశాలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలతో వృద్ధి లభిస్తుంది.
మకర రాశి:
శుక్రుడు- అంగారక గ్రహాల కలియక మరక రాశి వారి 8వ ఇంట్లో జరుగుతుంది. మకరరాశి వారి 5వ ఇంటికి శుక్రుడు అధిపతి. 4వ ఇంటికి అంగారకుడు అధిపతి. శుక్రుడు-అంగారకుడు సింహ రాశిలో కలయిక చెందడం వల్ల మకర రాశి వారికి రాజయోగం ఏర్పడనుంది. ఈ రాశి యొక్క 11వ ఇంటికి అంగారకుడు అధిపతి కావడం వల్ల మకర రాశి వారికి ధనలాభం చేకూరుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. వ్యాపారంలో పురోగతి, మంచి లాభాలు చూస్తారు. ఉద్యోగులకు పని వాతావరణం అనుకూలిస్తుంది. ఖర్చులను నియంత్రించుకుంటే అన్నీ సక్రమంగా సాగుతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications