Latest Updates
-
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.?
సింహరాశిలోకి శుక్రగ్రహ తిరోగమనం.. ఈ 3 రాశుల వారిపై ప్రతికూల ప్రభావం.. ధన నష్టం, సమస్యలు తప్పవు
వేదజ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు.. ప్రేమ, భౌతిక ఆనందానికి అధిపతిగా పరిగణిస్తారు. అలాగే శ్రేయస్సు, వైభవం, కీర్తి, లగ్జరీ, శృంగారంపై శుక్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే.. వారి జీవితంలో ఆనందం, ప్రేమ, కీర్తి, దాంపత్యబంధంలో సుఖం ఉంటుంది. శుక్ర గ్రహ స్థానం బలహీనంగా ఉంటే.. ఆ రాశి వారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారు.
జులై 23వ తేదీన శుక్ర గ్రహం సింహరాశిలోకి తిరోగమనం చెందాడు. ఈ సంచారం వల్ల పలు రాశుల వారు అనుకూల ఫలితాలను, మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను అందుకుంటారు. సింహరాశిలో శుక్ర గ్రహ తిరోగమనం వల్ల ఈ 3 రాశుల వారు సమస్యలు ఎదుర్కోనున్నారు.

ధన నష్టం, సమస్యలు బాధిస్తాయి. ఆయా రాశుల వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిషశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ 3 రాశులు ఏవి, అందులో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి
సింహరాశిలో శుక్రుని తిరోగమనం వల్ల మేషరాశి వారు సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మేష రాశి వారు ఆర్థిక సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్న దృష్ట్యా డబ్బు సంబంధిత వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే వీలైనంత మేరకు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. అప్పులు తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోవడం, అప్పులు చెల్లించడంలో సమస్యలు రావడం వల్ల కొంత కీర్తి పోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దంపతుల మధ్య సాన్నిహిత్యం దెబ్బతింటుంది. దంపతుల మధ్య సమన్వయం లోపం వస్తుంది. దీని వల్ల శృంగార జీవితంలో కూడా సుఖం ఉండదు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు శుక్రుని తిరోగమనం వల్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. దంపతుల మధ్య సాన్నిహిత్యం తగ్గిపోతుంది. కలహాలు పెరుగుతాయి. వ్యాపారంలో నష్టం ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది. ఉద్యోగులు ఎంత శ్రమించినా.. శ్రమకు తగ్గ ప్రశంసలు దక్కకపోవచ్చు. ఉన్నతోద్యోగులకు మాటలు పడాల్సి రావొచ్చు. దీని వల్ల కొంత మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఒత్తిడి కూడా అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీలైనంత మేరకు సానుకూలంగా ఉండేలా మనసును ట్యూన్ చేసుకోవాలి.
కన్యరాశి
శుక్రుని తిరోగమనం వల్ల కన్య రాశి వారు సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఆరోగ్యం గురించి చేసే చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే చిన్నపాటి ఆరోగ్య సమస్యనైనా నిర్లక్ష్యం చేయవద్దు. పెట్టిన పెట్టుబడి ద్వారా నష్టాలు రావొచ్చు. ఈ సమయంలో కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. అలాగే వివాదాల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఆఫీస్ గాసిప్స్ కు కూడా దూరంగా ఉండాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications