Latest Updates
-
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది? -
జూన్ 7 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి హెచ్చరిక.. నేటి గ్రహాల ప్రభావం ఇదే! -
మిథునం, సింహం, ధనస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 07 నుండి 13 జూన్ 2026 వరకు -
సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి అదృష్ట యోగం.. ఆదివారం మీ జాతకం ఎలా ఉంది? - ఆదివారం, 07 జూన్ 2026
Good Friday: గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?.. అసలైన చరిత్ర ఏంటో తెలుసా?
క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండగల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. ఇది వారికి చాలా ముఖ్యమైన రోజుగా పరిగణించడంతో పాటు.. అత్యంత పవిత్రమైన దినంగా భావిస్తారు. అయితే ప్రతి ఏడాది ఈస్టర్‌కు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ గుడ్ ఫ్రైడేని నిర్వహించుకుంటారు. బైబిల్ ప్రకారం.. ఈరోజు జీసస్‌ను శిలువ చేసిన రోజుగా పరిగణించబడుతుంది. అందుకే ఈ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూనే.. యేసును స్మరించుకుంటూ ఈరోజును నిర్వహిస్తారు. కానీ దీని అసలు చరిత్ర వేరే ఉంది. చాలా మందికి అసలు ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు నిర్వహించుకుంటారో కూడా తెలియదు. అందుకే ఈ స్టోరీలో అసలు గుడ్ ఫ్రైడే ఎందుకు నిర్వహించుకుంటారు? దానికి గల ప్రాముఖ్యత ఏంటి? గుడ్ ఫ్రైడే రోజున ఏం చేస్తారు అనేది వివరించాము. పూర్తిగా చదివి మీరు కూడా తెలుసుకోండి..
గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత
ఈసు క్రీస్తు త్యాగానికి గుర్తుగా:
క్రైస్తవుల విశ్వాసం ప్రకారం.. ఏసు క్రీస్తు మనిషి పాపాలను మొత్తం మాఫీ చేసేందుకు, వారికి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించేందుకు అతను శిలువపై మరణించాడని నమ్ముతారు. ఆయన ప్రేమ, దయ, క్షమ గుణాలకు ఇది సంకేతం అని, ఆయన త్యాగానికి గుర్తుగా ఇది జరుపుకుంటారని చెబుతారు.

త్యాగానికి మారుపేరు:
ఏసు శిలువపై మరణించిన తరువాత.. మూడు రోజులకు బయటికి వచ్చి.. తనను హింసించిన వారికీ క్షమించిన వ్యక్తిగా ఏసు నిలిచాడు. "తండ్రి! వీరిని క్షమించు, వీరు ఏమి చేస్తున్నారు అనే విషయాన్ని వారికే తెలియదు" అని ఆయన శిలువపై అన్న మాటలు లోతైన సందేశాన్ని ఇస్తాయి.
మనవత్వానికి గుణపాఠం:
ద్వేషానికి బదులుగా ప్రేమతో స్పందించాలి అనే సందేశం ఈ రోజు మరింత బలంగా వ్యక్తమవుతుంది. ప్రతి మనిషిని ప్రేమించాలని, మనకు హాని కలిగించిన వ్యక్తిని కూడా గొప్పగా చూడాలని ఈరోజు భావిస్తారు.
ఎందుకు జరుపుకుంటారు?
నిజానికి ఈ గుడ్ ఫ్రైడే ఉత్సవంగా జరుపుకునే రోజు కాదు. ధ్యానం, ప్రార్థన, పశ్చాత్తాపంకి అంకితమైన రోజు. ఈరోజు ఎక్కువగా ధ్యానం, దేవుడికి ప్రార్థనలు నిర్వహిస్తూ.. దేవుడిని స్మృతించుకుంటారు. అలాగే పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, ధ్యాన సభలు జరుగుతాయి. మరి కొన్ని క్రైస్తవ సంఘాలు ఉపవాసం, మాంసాహారం వర్జించటం, తపస్సు వంటి ఆచారాలను పాటిస్తారు.
"Good" Friday ఎందుకు అంటారు?
ఒకరు చనిపోయిన రోజున "గుడ్" (మంచి) అని ఎందుకు అంటారు అనే ప్రశ్న వస్తుంది.
క్రైస్తవులు విశ్వసించేది ఏమిటంటే.. ఏసు మరణం వల్లే మనకు రక్షణ లభించిందని. కాబట్టి ఇది బాధాకరమైన రోజు అయినప్పటికీ, ఆధ్యాత్మికంగా మంచిదైందని భావించి "గుడ్ ఫ్రైడే" అని పిలుస్తారు.
అంతిమంగా చెప్పాలంటే, గుడ్ ఫ్రైడే ఒక శోకదినం అయినప్పటికీ, ఇది ఆత్మీయ బోధన, త్యాగం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసే రోజు. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాకుండా, మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికి విలువైన సందేశాన్ని అందిస్తుంది. ఈరోజు నుంచి చాలా నేర్చుకోవడంతో పాటు మనిషితో ఎలా మెలగాలి అనేది మనకు సందేశాన్ని ఇస్తుంది.



Click it and Unblock the Notifications