Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సాయంత్రం షాపింగ్ కి వెళ్తున్నారా? దాదాపు రూ. 5వేలు తగ్గిన బంగారం ధర!
కొన్నాళ్లుగా రాకెట్ మాదిరి దూసుకెళ్లిన బంగారం ధర ఈ వారం తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే సామాన్యుడు అందుకోలేనంత దూరం వెళ్లిపోయిన బంగారం ధర ఇప్పుడు శ్రీమంతులకు కూడా కొనేందుకు వెనకాడేలా చేస్తోంది. రోజు రోజుకి పెరగడమే తప్ప తరుగుదల ఏ మాత్రం కనబట్లేదు అనుకున్న టైంలో ఈ వారం కొంచెం తగ్గి సామాన్యులకు ఉపశమనం కలిపించింది. గత శుక్రవారం నుంచి వరుసగా బంగారం ధరలు కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు రోజుల్లో 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద రూ. 4900 వరకు తగ్గింది.
ధరలు తగ్గుతున్నప్పటికీ పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకునేటోళ్లు కూడా బంగారం కొనాలంటే బాగా ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది. చాలామంది తమ కొనుగోలు ప్రణాళికలను పెరుగుతున్న ధరలతో వాయిదా వేసుకుంటున్నారు. ఇక గుర్రంలా పరుగులు పెట్టిన వెండి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లలో ఒడిదుకులే బంగారం,వెండి ధరల పెరుగుదలకు,తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్,ప్రతీకార సుంకాల నిర్ణయాల కారణంగా అమెరిక ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు నడుస్తుందా అనే ఆందోళనలో పెట్టుబడిదారులందరూ తమ డబ్బులను బంగారం వంటి విలువైన మెటల్స్ వైపు తరలిస్తున్నారు. దీనికి సాక్ష్యం కొద్దిరోజులుగా అమెరికా మార్కెట్లు భారీగా పతనం కావడమే. ఎక్కువ మంది పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా భావించే బంగారంలోకి తమ డబ్బును తరలిస్తుండటంతో డిమాండ్ పెరిగిపోయి బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా మండిపోతున్నాయి. అయితే ట్రంప్ తన దూకుడిని కొంచెం తగ్గినట్లుగా కనబడుతున్న ఈ సమయంలో గత రెండు రోజుల నుంచి బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది.
హైదరాబాద్,విజయవాడలో ఇవాళ మంగళవారం 25 మార్చి ,2025 బంగారం ధరల వివరాలు
హైదరాబాద్ లో మంగళరం 22 క్యారెట్ల బంగారం ధర తులం(10 గ్రాములు) బంగారం ధర రూ. 81,850 గా ఉంది. సోమవారంతో పోల్చితే తులం మీద రూ.30 తగ్గింది.
హైదరాబాద్ లో మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.89,290గా ఉంది. అంటే నిన్నటితో పోల్చితే 33 రూపాయలు పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ. రూ. 81,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.89,290గా ఉంది.
వెండి ధరలు
విజయవాడలో ఇవాళ 1 కేజీ వెండి ధర రూ.1,10,000గా ఉంది. నిన్నటితో పోల్చితే ఎలాంటి పెరుగుదల,తగ్గుదల నమోదు కాలేదు. ధరలు స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్ ఇవాళ 1 కేజీ వెండి ధర రూ.1,10,000గా ఉంది. నిన్నటితో పోల్చితే ఎలాంటి పెరుగుదల,తగ్గుదల నమోదు కాలేదు. ధరలు స్థిరంగా ఉన్నాయి.
వ్యాపారుల ఆందోళన
బంగారం ధరలు తగ్గినా ఎవరిలో సంతోషం కనబడట్లేదు. రెండు రోజులు కొద్దిగా తగ్గి తర్వాత భారీగా పెరుగుతుండటంతో ఎలాంటి ఫలితం లేకుండా పోతుందని సామాన్యులు వాపోతున్నారు. వివిధ దేశాలలో కొనసాగేతున్న అనిశ్చితి వాతావరణం, పలు చోట్ల యుద్ధ వాతావరణం, పలు దేశాల్లో అంతర్యుద్దం వంటి పరిణామాలన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అధిక ధరల ప్రభావంతో సమాన్యులు బంగారపు షాపుల వైపుకి చూడకపోవడం వ్యాపారులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. రేట్లు పెరిగియాని సంతోషపడేలోగా వాటిని కొనేవాళ్లు భారీగా తగ్గుముఖం పట్టడంతో షాపుల నిర్వహణ కూడా కష్టంగా మారుతోందంటూ చాలామంది వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా బంగారం ముట్టుకుంటే షాక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోందని సమాన్యులు అంటున్నారు.



Click it and Unblock the Notifications