Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
రోడ్ల వెంట ఉండే ఈ చెట్టు పూలు కనిపిస్తే వెంటనే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి.. ఎందుకంటే?
సదాబహార్ చెట్లు రోడ్ల పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని బిళ్ల గన్నేరు చెట్లు అని కూడా పిలుస్తుంటారు. ఈ చెట్లు మరీ ముఖ్యంగా హైవేల వెంబడి కనిపిస్తుంటాయి. ఇవి కనివిందుగా ఉండడంతో పాటు.. ప్రదేశాన్ని చాలా అందంగా చూపిస్తాయి. వీటిని ఇంట్లో నీడ కోసం, డెకరేషన్ కోసం ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఈ చెట్లు ఔషధ మూలికలుగా పని చేస్తాయని చెబుతున్నారు. వీటి ఆకులు, పూలు, కాండం కూడా చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయట.
ఈ చెట్టు ఆకులను సతతహరిత ఆకులు అని పిలుస్తుంటారు. ఆయుర్వేదంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆకులు మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలకు కూడా పరిష్కారం చూపగలుగుతాయి. ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఈ చెట్లతో ముడిపడి ఉంది. అయితే ఈ చెట్టుతో ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? ఈ చెట్టును ఎలా వినియోగించుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చర్మ ఆరోగ్యానికి..
ఈ చెట్లలోని ఔషధ గుణాలు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి నుంచి వచ్చే పూలతో ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది, అందంగా నిగనిగలాడే చర్మం తయారవుతుందని చెబుతున్నారు. ఈ ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలంటే?
ఈ సతతహరిత పూలతో ఫేస్ ప్యాక్ చేసుకోవడానికి.. ముందుగా ఎనిమిది పూలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కుంటే వాటిపై ఎలాంటి పురుగులు ఉన్న అవి నాశనమైపోతాయి. ఇప్పుడు ఆ పూలను మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌లో ఒక స్పూన్ బాదం ఆయిల్, రెండు స్పూన్ల పచ్చిపాలు, అయిదు స్పూన్ల రోజ్ వాటర్ కలుపుకొని ముఖానికి అంటుకునే విధంగా చేసుకోవాలి.
ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అలాగే మెడకు కూడా రాసుకోవాలి. ఒక పావుగంట ఆగిన తరువాత చల్లని నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటే మొఖం మిలమిలా మెరిసిపోతుంది.
విటమిన్ ఈ క్యాప్స్యూల్..
ఈ సతతహరిత పూలతో మరో పద్దతిలో కూడా పేస్ ప్యాక్ వేసుకోవచ్చు. విటమిన్ ఇ ట్యాబ్లేట్‌తో ఫేస్ ప్యాక్ చేసుకుంటే ముఖం చాలా కాంతివంతంగా తయారవుతుంది. అయితే దీనిని చేసుకోవడానికి ముందుగా కొన్ని పూలను తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, విటమిన్ ఇ ట్యాబ్లేట్, రెండు చెంచాల రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకొని.. ముఖానికి రాసుకోవాలి. ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు ముఖంపై ఉంచుకొని ఆ ఫేస్ ప్యాక్‌ను కడుక్కుంటే సరిపోతుంది. ముఖం అందంగా, మృదువుగా తయారవుతుంది.
ఈ సతతహరిత పూలు, తేనె కలిపి కూడా మనం ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది చర్మానికి అందంతో పాటు యవ్వనాన్ని కూడా అందిస్తుంది. తేనెలోని ఔషధ గుణాలు, పూలలోని ఔషధ గుణాలు కలిసి చర్మానికి కావాల్సిన మృదుత్వాన్ని జోడిస్తుంది.
ఎన్నో ఔషధ గుణాలు..
ఈ బిళ్ళ గన్నేరు చెట్లు, పూలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ పూలను ఆయుర్వేదంలో కూడా విరివిగా వినియోగిస్తారు. ఈ పూలు, చెట్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ మైక్రోబయల్ గుణాలు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి చర్మంపై మొటిమలు వచ్చినప్పుడు ఈ పూలను కాండంను పేస్ట్‌లా చేసుకొని చర్మానికి రాసుకుంటే మొటిమలు అణిగిపోవడంతో పాటు చర్మంపై చిన్న చిన్న గాయాలు కూడా మానిపోతాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications