Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
స్వెటర్లు, జాకెట్లు మురికిగా మారాయా? కొత్తదానిలా మెరవాలంటే ఉతికేటప్పుడు ఈ చిన్న పని చేయండి!
శీతాకాలంలో చలిని తట్టుకోడానికి మనం స్వెట్లర్లు,జాకెట్లు వాడుతుంటాం. అయితే ప్రతిరోజూ వీటిని వాష్ చేయకుండా వాడటం వల్ల దుమ్ము, ధూళి, చెమట,ఆహారపు మరకలతో త్వరగా మురికిగా మారుతాయి.
సాధారణంగా ఖరీదైన జాకెట్లు లేదా మందపాటి పఫర్ జాకెట్లు మురికిగా మారినప్పుడు వాటిని డ్రై క్లీనింగ్ కు ఇస్తుంటాం. అయితే ఇంట్లోనే సులభమైన పద్ధతులతో జాకెట్లను తళతళలాడేలా శుభ్రం చేసుకోవచ్చు.

చేతితో జాకెట్ ను ఉతికే సులభమైన విధానం
మీ జాకెట్ మరీ సున్నితమైనది అనుకుంటే చేతితో ఉతకడమే ఉత్తమ మార్గం. ముందుగా ఒక పెద్ద బకెట్ లో గోరువెచ్చని నీటిని తీసుకోండి. ఈ నీటిలో ఈజీ, జెంటిల్ వంటి ఉన్ని దుస్తుల కోసం వాడే లిక్విడ్ డిటర్జెంట్ ను కలపండి.
ఇప్పుడు మీ జాకెట్ ను ఆ నీటిలో పూర్తిగా మునిగేలా చేసి సుమారు అరగంట పాటు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల మురికి, ధూళి మెత్తబడి వదులుతుంది.
జాకెట్ కు ఎక్కువగా మురికి పట్టేది కాలర్, చేతి మణికట్టు దగ్గరే. కాబట్టి ఒక మెత్తని బ్రష్ తీసుకుని ఆ ప్రాంతాల్లో సున్నితంగా రుద్దండి. చివరగా శుభ్రమైన నీటితో రెండు, మూడు సార్లు జాకెట్ ను బాగా కడగాలి.
జాకెట్ ను పిండకుండా, నీరు ఆరిపోయేలా చేసి ఎండలో తలక్రిందులుగా ఆరబెట్టండి. ఇలా చేస్తే జాకెట్ కొత్తదానిలా మెరుస్తుంది.
వాషింగ్ మెషీన్ లో ఉతికే విధానం
మీరు పఫర్ జాకెట్లను వాషింగ్ మెషీన్ లో కూడా ఉతకవచ్చు. మెషీన్ లో ఉతికేటప్పుడు ఒకేసారి 2-3 జాకెట్లను వేయడం మంచిది. ఇది బ్యాలెన్స్ ను సరిచేస్తుంది.
ముఖ్యంగా జాకెట్ జిప్ లను పూర్తిగా మూసివేయాలి. మెషీన్ సెట్టింగ్స్ లో Delicate లేదా Wool మోడ్ ను సెలక్ట్ చేయండి. ఇది జాకెట్ చిరిగిపోకుండా, లోపలి దూది పాడవకుండా కాపాడుతుంది.
మెషీన్ వాష్ పూర్తయ్యాక డ్రైయర్ లో ఆరబెడితే జాకెట్ త్వరగా ఆరిపోవడమే కాకుండా దాని ఉబ్బిన ఆకారం తిరిగి వస్తుంది.
జాకెట్ ఉతకడానికి ముందు పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు
జేబులు చెక్ చేయండి
ఉతకడానికి వేసే ముందు జేబులను చెక్ చేయడం మర్చిపోవద్దు. నాణేలు, టిష్యూ పేపర్లు లేదా పెన్నులు వంటివి ఉంటే అవి మెషీన్ ను లేదా జాకెట్ ను పాడుచేసే ప్రమాదం ఉంది.
జిప్, బటన్స్
జాకెట్ జిప్స్, బటన్లు తెరిచి ఉంచితే అవి మెషీన్ లో ఇతర బట్టలకు తట్టుకుని చిరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎప్పుడూ మూసివేసే ఉతకాలి.
టోపీ
జాకెట్ కు వేరుచేయగలిగే టోపీ ఉంటే, వాటిని తీసి విడిగా చేతితో ఉతకడం మంచిది.
ప్రింటెడ్ జాకెట్లు
జాకెట్ పై ఏవైనా డిజైన్లు లేదా ప్రింట్లు ఉంటే దానిని తిరగేసి ఉతకాలి. దీనివల్ల ప్రింట్ రంగు వెలిసిపోకుండా ఉంటుంది.
మరకల నివారణ
జాకెట్ పై మొండి మరకలు ఉంటే మెషీన్ లో వేసే ముందే ఆ మరకపై కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి రుద్దండి. ఇలా చేస్తే ఉతికిన తర్వాత మరక పూర్తిగా మాయమవుతుంది.



Click it and Unblock the Notifications