Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Space Flower: రోదసిలో పెంచిన పువ్వు, అద్భుతమైన పిక్స్ షేర్ చేసిన నాసా
అంతరిక్షంలో శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. రోదసిలో పెంచిన పువ్వులు ఫోటోలను తాజాగా నాసా సోషల్ మీడియాలో షేర్ చేసింది. జిన్నియా అనే పువ్వు చిత్రాలను ఇన్ స్టాగ్రామ్‌లోని అఫీషియల్ నాసా పేజీలో పోస్టు చేశారు. 1970 నాటి నుంచి శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మొక్కలపై అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయోగాన్ని 2015లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో నాసా ఆస్ట్రోనాట్ కెజెల్ లిండ్‌గ్రెన్ ప్రారంభించారు. అని ఈ పువ్వుల పిక్స్ పోస్టు చేసిన నాసా దాని కింద క్యాప్షన్ రాసుకొచ్చింది.
అంతరిక్షంలో ఉద్యానవనం ప్రదర్శన కోసం మాత్రమే కాదని.. కక్ష్యలో మొక్కలు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసుకోవడం గురించి అని నాసా తెలిపింది. భూమిపై పెరిగే మొక్కలు, పంటలు అంతరిక్షంలో ఎలా పెరుగుతున్నాయని తెలుసుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని నాసా పేర్కొంది.

అంతరిక్షంలో పంటలు పండించడంపై నాసా చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తోంది. ఇప్పటికే రోదసిలో పాలకూర, టొమాటోలు, చిలీ పెప్పర్ లాంటి ఆకుకూరలు, పలు రకాల కూరగాయలు కూడా పండించింది నాసా. వీటితో పాటు మరిన్ని రకాల కూరగాయలు, మొక్కలను కూడా రాబోయే రోజుల్లో పండించబోతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
నాసా షేర్ చేసిన పిక్‌లో జిన్నియా అనే పువ్వును క్లోజప్ షాట్ లో పిక్ తీశారు. అందులో కొన్ని ఆకులతో కూడిన జిన్నియా ఫ్లవర్ కనిపిస్తోంది. లైట్ ఆరెంజ్ కలర్ లో పువ్వు రేకులు అందంగా కనిపిస్తున్నాయి. బ్కాగ్రౌండ్ లో బ్లర్ గా కనిపిస్తున్న భూమిని చూడవచ్చు. కొన్ని గంటల క్రితం నాసా ఈ ఫ్లవర్ పిక్ పోస్టు చేసింది. అంతలోనే సుమారు ఐదున్నర లక్షల లైకులు వచ్చాయి.
ఈ పోస్టు కింద చాలా మంది తమకు తోచినట్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు పువ్వు పెరగడానికి ఎంత కాలం పట్టిందని ప్రశ్నించగా మరికొందరు ఈ ఫ్లవర్ చాలా అద్భుతంగా ఉందని, ఇన్‌క్రిడిబుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ పువ్వును ఎలా పెంచారని, నీటిలో, భూమిపై నుంచి తీసుకెళ్లిన మట్టిలో, లేదా ఇంకేదైనా పదార్థంలో పెంచారా అని మరొకరు ప్రశ్నించారు. నమ్మశక్యంగా లేదని, అద్భుతంగా ఉందని మరొకరు కామెంట్ పెట్టారు.



Click it and Unblock the Notifications