Latest Updates
-
ఇతరుల ప్రేమను చూసి మొదలైన పోలికలు.. చివరకు బంధాలను ఎలా కూల్చేస్తున్నాయి -
గోంగూర రొయ్యల కూరను ఇంట్లోనే అచ్చం హోటల్ రుచితో ఇలా చేసుకోండి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! -
పెళ్లై ఏళ్లు గడిచినా పాత ప్రేమ మర్చిపోలేకపోతున్నారా? ఇందులో తప్పేం లేదు కానీ జాగ్రత్త -
పిజ్జా, బర్గర్లు దీని ముందు పరార్.. నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఆలూతో ఎగ్ బజ్జీ.! -
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? మీ జీవితంలో జరిగేదంతా దీనివల్లేనని శాస్త్రాలు చెబుతున్నాయా? -
వెజ్ లవర్స్ కోసం సోయాతో టిక్కా మసాలా.. వీటిని యాడ్ చేస్తే వేరే లెవెల్ టేస్ట్.! -
ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీతో పనీర్ పరాఠా ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు! -
జూన్ 2, 2026: ఈ రాశుల వారికి ధన యోగం.. అదృష్టం తలుపు తడుతోంది, సిద్ధంగా ఉండండి! -
అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, కెరీర్లో ఊహించని సక్సెస్ మీదే! -
గణపతి అష్టోత్తర శతనామావళి మహిమ తెలుసా? ఈ 108 పేర్లు జపిస్తే విఘ్నాలు తొలిగిపోతాయి
మీ ఇంట్లో డబ్బు నిలవాలా..? ఐతే ఈ చిట్కా పాటించండి..!!
డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటూ ఉంటారు. కానీ కాదు డబ్బు ఇద్దరి వారి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. కొందరికి జీవితంలో డబ్బు కావాలి. కొందరికి డబ్బు జీవితం కావాలి. ఇక్కడ చెప్పే చిట్కాలను పాటించండి. అప్పుడు మీ దగ్గర డబ్బు ఎలా నిలవదు. మనం కూడా చూద్దాము. మీ చేతిలో డబ్బు ఉండాలి అనుకుంటే మీరు పాటించే వాటిలో మీరు ఉండే ఇంటిలోని వాస్తు మాత్రం పక్కాగా ఉండాలి. ఎందుకంటే ఏ ఇంట్లోనైనా ఆరోగ్యం, సంతోషం, ప్రేమ పిల్లలు ఇవన్నీ ఉండాలి అంటే మనం నివసించే గృహం వాస్తు అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో వాస్తు శాస్త్రానికి కూడా ఉన్న ప్రాముఖ్యత చాలా ఉంది.

ఎంతటి కోటీశ్వరుడైనా ఒక వాస్తు లేని ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఒకేసారి కూలడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా కష్టం. అయితే కొంతమందికి మాత్రం ఎంత డబ్బులు వచ్చినా కూడా చేతిలో నిలువవు. అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉంటూ ఉంటారు. వాళ్ల జీవితంలో ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అనుకోని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆర్థికంగా ఎప్పుడూ కుంగిపోతూ ఉంటారు. ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో డబ్బు నిలవకుండా ఉంటుంది.
వాళ్ల ఇంట్లో ఏ రూపకంగా డబ్బు ఖర్చు అయిపోతుందో తెలీకుండానే డబ్బు అనేది ఖర్చయిపోతూ ఉంటుంది. వాస్తు శాస్త్ర ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కుంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం వారికి గ్రహబలం అనేది అనుకూలంగా లేకపోవడం లాంటి కారణాలు కూడా ఉంటాయి. డబ్బు, ఆరోగ్యం ఆనందంపై వాస్తు ప్రభావం ఎప్పుడూ చూపిస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడూ ఆరోగ్యంతో, సంపదతో. ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు ఈ వాస్తు చిట్కాలను కచ్చితంగా పాటించండి.
మనకి ఇంటికి ఉత్తరం వైపు లక్ష్మి స్థానం అని అందరికీ తెలుసు. ఆలక్ష్మి స్థానంలో మనం ఎప్పుడు కూడా చెత్తా చెదారం వేయకూడదు. అలాగే ఇల్లు ఊడ్చేటప్పుడు ఈశాన్యం మూల వైపుకి మనం చెత్త పోగు చేయకూడదు. ఈశాన్య ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అటు వైపు ఎటువంటి బరువులు కూడా మనం పెట్టుకోకూడదు. ఆ ప్లేస్ ని మనం ఎంత ఖాళీగా ఉంచి ఎంత దైవత్వంతో పాజిటివ్ ఎనర్జీతో నింపితే ఆ లక్ష్మీదేవి మనింట్లో పేదరికాన్ని నిర్మూలించడానికి దోహదం చేస్తుందన్నమాట. ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద బలపడుతుంది. మనకి ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఈశాన్య దిశలో పూజగది ఉంటే కూడా చాలా మంచిది. ఈశాన్య గదిలో మీ దగ్గర పూజ గది లేనట్లయితే ఈశాన్యగది వైపు లేదా ఈశాన్య మూలకి మీకు కచ్చితంగా ఒక లక్ష్మీదేవి పట్టం, లేదంటే మీ కులదైవం పటాన్ని ఆ మూల పెట్టుకోండి.
బెడ్‌రూమ్ దగ్గర ఇనుప వస్తువు కాని ఇనుపకడ్డీని కాని ఉంచడం వల్ల కూడా మంచి లాభం జరుగుతుంది.దీని వల్ల నెగెటివ్ ఎనర్జీని ఇంట్లోకి రానివ్వకుండా ఆపే శక్తి ఉంది. అందుకనే మనం డబ్బు ఉంచే దగ్గర లేదంటే మన బెడ్‌రూమ్ దగ్గర ఒక ఇనుప కడ్డీని ఉంచుకోవడం చాలా శ్రేయస్కరం. మీరు కనుక కడ్డీని మొత్తంగా ఉంచుకోకపోయినా మీరు డబ్బు దాచుకునే బీరువా కింద అయినా పెట్టుకోవాలి. మీ ఇంట్లో వచ్చిన ధనం నిలుపుకోవాలి అనుకుంటే మాత్రం మీ ఇంట్లో కచ్చితంగా లక్ష్మిదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి.
ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. మీకు వీలైతే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలో పెట్టుకోండి. ఈశాన్య దిశలో తగిలించుకొని దానికి గంధం కుంకమ బొట్టు పెట్టి రోజు కొంచెం ధూపం వేయండి.



Click it and Unblock the Notifications