Latest Updates
-
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు!
రహస్య కెమెరాల భయమా? ఈ జాగ్రత్తలతో మీ గోప్యతను కాపాడుకోండి!
టూర్ లో భాగంగా లేదా ఏదైనా వర్క్ పనిమీద కొత్త ప్లేస్ కి వెళ్లినప్పుడు అక్కడ ఉండేందుకు హోటల్ రూమ్ బుక్ చేసుకోవడం సాధారణ విషయం. అయితే ఇటీవల కాలంలో హోటల్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆ రూమ్ లో వాళ్లు చేసే అన్నింటిని రికార్డ్ చేస్తున్నారు. హోటల్ బాత్రూమ్స్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టి ఆడవాళ్లు స్నానం చేస్తున్న వీడీయోలను కూడా రికార్డ్ చేసి ఆన్ లైన్ లో పెట్టడం,అలాంటోళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొత్త బట్టలు కొనేందుకు షాపింగ్ మాల్ ట్రయల్ రూమ్ లోకి వెళ్లినా..మనలో చాలామందికి ఒక తెలియని భయం వెంటాడుతోంది
గోడల చాటున, అద్దాల వెనుక, లేదా ఏదో ఒక వస్తువులో దాగి ఉన్న రహస్య కెమెరాలు మనల్ని బంధిస్తున్నాయేమోనన్న అనుమానం మన ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఎందుకుంటే షాపింగ్ మాస్ డ్రెసింగ్ రూమ్స్ లో,పబ్లిక్ టాయిలెట్స్ లో కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆడవాళ్లు బట్టలు మార్చేకోవడం వంటివి రికార్డ్ చేసిన అనేకమందిని కూడా గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వార్తల్లో తరచూ వినిపించే ఇలాంటి సంఘటనలు మన ఆందోళనను మరింత పెంచుతాయి. అయితే కాస్త అవగాహన, కొన్ని సులభమైన జాగ్రత్తలతో ఈ కెమెరాల ఉచ్చు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.

క్షుణ్ణంగా పరిశీలించండి
ఏ టెక్నాలజీని వాడే ముందూ.. మన కళ్లను, పరిశీలనా జ్ఞానాన్ని నమ్మాలి. హోటల్ గది, ట్రయల్ రూమ్ లేదా పబ్లిక్ టాయిలెట్‌లోకి ప్రవేశించగానే తొందరపడకుండా పరిసరాలను నిశితంగా గమనించండి. నేరస్థులు కెమెరాలను ఎవరూ ఊహించని, తేలికగా అనుమానించని ప్రదేశాలలో అమరుస్తారు.
ఈ ప్రదేశాలలో రహస్య కెమెరాలు ఉండే ప్రమాదం ఎక్కువ
పబ్లిక్ ఏరియాలు: హోటల్ గదులు, షాపింగ్ మాల్స్ ట్రయల్ రూమ్‌లు, పబ్లిక్ టాయిలెట్లు, బస్సులు లేదా రైళ్లలోని టాయిలెట్లు వంటి ప్రదేశాలు నేరస్థులకు సులభమైన లక్ష్యాలు.
గదిలోని వస్తువులు: గదిలోకి వచ్చాక అనుమానాస్పదంగా ఉన్న ప్రతి వస్తువునూ చెక్ చేయండి.
ఎలక్ట్రానిక్ పరికరాలు: టీవీ, సెట్ టాప్ బాక్స్, ఏసీ, డిజిటల్ క్లాక్, స్మోక్ డిటెక్టర్, రిమోట్ లలో చిన్న కెమెరాలు దాచే అవకాశం ఉంది. వాటిపై అసాధారణంగా ఉన్న రంధ్రాలు లేదా లైట్ల కోసం చూడండి.
అలంకరణ వస్తువులు: గోడ గడియారాలు, ఫోటో ఫ్రేమ్ లు, ఫ్లవర్ వాజ్ లు, టేబుల్ ల్యాంప్ లు, పవర్ సాకెట్లు, స్క్రూ హెడ్లు, గోడలకు తగిలించిన పెయింటింగ్స్ వెనుక కెమెరాలు ఉండవచ్చు.
ఫర్నిచర్, ఇతరాలు: మంచం, సోఫా అంచులు, కర్టెన్ రాడ్స్, బట్టలు తగిలించే హుక్స్, గోడ మూలలు, తలుపు వెనుక, బాత్రూమ్ షవర్ హెడ్, అద్దం, టిష్యూ బాక్స్ వంటి ప్రదేశాలను జాగ్రత్తగా పరిశీలించండి.
స్మార్ట్ ఫోన్ సాయంతో ఇలా గుర్తించండి
మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ సహాయంతో మరింత లోతైన తనిఖీ చేయవచ్చు. దీనికి రెండు సులభమైన పద్ధతులు ఉన్నాయి.
ఫోన్ కెమెరాతో
చాలా రహస్య కెమెరాలు రాత్రిపూట కూడా స్పష్టంగా రికార్డ్ చేయడానికి ఇన్ ఫ్రారెడ్ (IR) లైట్లను ఉపయోగిస్తాయి. ఈ కాంతి మన కంటికి కనిపించదు కానీ స్మార్ట్‌ఫోన్ కెమెరా దానిని సులభంగా పసిగడుతుంది. గదిలోని లైట్లన్నీ ఆపివేసి, కర్టెన్లు మూసి చీకటి చేయండి. ఇప్పుడు మీ ఫోన్ కెమెరాను వీడియో మోడ్ లో ఆన్ చేసి అనుమానం ఉన్న ప్రదేశాల వైపు నెమ్మదిగా తిప్పండి. ఫోన్ స్క్రీన్ పై ఎక్కడైనా ఎరుపు లేదా తెలుపు రంగులో మిణుకుమిణుకుమనే కాంతి చుక్క కనిపిస్తే అక్కడ ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
ఫ్లాష్ లైట్ తో ఇలా గుర్తించండి
కెమెరా లెన్స్ గాజుతో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి దానిపై కాంతి పడినప్పుడు అది ప్రతిఫలిస్తుంది. ఈ సూత్రాన్ని ఉపయోగించి కూడా కెమెరాను గుర్తించవచ్చు. గదిలో లైట్లు ఆపివేసి మీ ఫోన్ ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేయండి. ఇప్పుడు అనుమానాస్పద ప్రదేశాలపై ఫ్లాష్ లైట్ వేస్తూ జాగ్రత్తగా గమనించండి. ఎక్కడైనా చిన్న నీలిరంగు లేదా ఆకుపచ్చ రంగు ప్రతిబింబం కనబడిందంటే అది కెమెరా లెన్స్ కావచ్చు.
కెమెరా డిటెక్టర్ యాప్స్
ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో Hidden Camera Detector అని వెతికితే అనేక యాప్స్ కనబడతాయి. ఇవి మీ ఫోన్ యొక్క మాగ్నెటోమీటర్ సెన్సార్ ను ఉపయోగించి సమీపంలో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ లేదా అయస్కాంత క్షేత్రాలను గుర్తిస్తాయి. అయితే ఏదైనా యాప్ డౌన్ లోడ్ చేసే ముందు దాని రివ్యూలు, రేటింగ్స్ చెక్ చేసి నమ్మకమైన యాప్ ను మాత్రమే ఎంచుకోండి.

కెమెరా దొరికితే ఏం చేయాలి?
ఒకవేళ మీ తనిఖీలో కెమెరా దొరికితే కంగారుపడి దాన్ని తాకవద్దు లేదా నాశనం చేయకుండా ఇలా చేయండి.
ఆధారాలు సేకరించండి: కెమెరా ఉన్న ప్రదేశాన్ని, కెమెరాను స్పష్టంగా చూపిస్తూ మీ ఫోన్ లో వీడియో, ఫోటోలు తీయండి.
పోలీసులకు సమాచారం ఇవ్వండి: వెంటనే స్థానిక పోలీసులకు (డయల్ 100) ఫిర్యాదు చేయండి. వారు వచ్చి దర్యాప్తు చేసి నేరస్థులను పట్టుకోవడానికి ఇది సహాయపడుతుంది.
సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు: జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in) లో కూడా ఫిర్యాదు నమోదు చేయండి.
ఒకవేళ వీడియో లీక్ అయితే?
దురదృష్టవశాత్తు మీ ప్రైవేట్ వీడియో లీక్ అయితే ధైర్యం కోల్పోవద్దు. వెంటనే cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.. స్థానిక సైబర్ పోలీసులను సంప్రదించండి, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వీడియో ఉందో ఆ ప్లాట్ ఫామ్ కు రిపోర్ట్ చేయండి.
చట్టం ఏం చెబుతోంది?
భారతదేశంలో ఒకరి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ వీడియోలను తీయడం లేదా వాటిని వ్యాప్తి చేయడం తీవ్రమైన నేరం. కేసు తీవ్రతను బట్టి దోషులకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.



Click it and Unblock the Notifications











