Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రిలేషన్ షిప్స్ మీద కొత్త కోర్సు..లవ్,బ్రేకప్ ల మీద విద్యార్థులకు పాఠాలు!
నేటి తరం యువత సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్లపై ఎక్కువగా ఆధారపడుతున్న తరుణంలో ముఖాముఖి సంబంధాలను అర్థం చేసుకోవడం, నిర్వహించడం చాలా అవసరం. సోషల్ మీడియా పరిచయాలు, డేటింగ్ యాప్‌ల మోజులో మొదలైన ఎన్నో ప్రేమకథలు పెళ్లి పీటల వరకు వెళ్తున్నాయి. కానీ కొన్ని కథలు మాత్రం ష్రద్ధా వాకర్, సోనమ్ రఘువంశీ కేసుల్లా మారి సమాజాన్ని భయపెడుతున్నాయి. ప్రేమ పేరుతో జరిగే మోసాలు, రిజెక్షన్ ను తట్టుకోలేక చేసే దాడులు, బ్రేకప్‌ను జీర్ణించుకోలేక ప్రాణాలు తీసే నేరాలు పెరిగిపోతున్నాయి.
హృదయాలను కలిపే బంధాలు.. ప్రాణాలు తీసే పాశాలుగా ఎందుకు మారుతున్నాయి? తిరస్కరణను ఎలా ఎదుర్కోవాలి? బంధంలో మన హద్దులు ఏమిటి? అనే విషయాలను మనకు ఎవరూ నేర్పరు. ఈ కీలకమైన నైపుణ్యాలను నేర్చుకుంటే ఎన్నో విషాదాలను ఆపవచ్చు. ఈ భయానక పరిస్థితులకు చెక్ పెట్టేందుకు, యువతకు సరైన మార్గం చూపించేందుకే ఢిల్లీ యూనివర్శిటీ ఒక సాహసోపేతమైన ముందడుగు వేసింది. ప్రేమ, విడిపోవడం, టాక్సిక్ రిలేషన్ షిప్స్ పై అవగాహన కల్పించేందుకు ఏకంగా ఒక సైకాలజీ కోర్సునే ప్రారంభిస్తోంది.

స్నేహం, ప్రేమ, కుటుంబ బంధాలు.. ఏ బంధంలోనైనా ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఢిల్లీ యూనివర్శిటీ 'నోగోషియేటింగ్ ఇంటిమేట్ రిలేషన్ షిప్స్(Negotiating Intimate Relationships)' పేరుతో కొత్త కోర్సుని తీసుకొచ్చింది. 2025-26 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమయ్యే ఈ కోర్సు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులందరికీ ఓపెన్ ఎలక్టివ్‌గా అందుబాటులో ఉంటుంది. ప్రేమ, స్నేహం ముసుగులో జరిగే నేరాలను అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కోర్సు యువతకు తమ వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, వృత్తి జీవితంలోనూ ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్మించుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఏం నేర్పిస్తారు? ఈ కోర్సు ఎందుకు ప్రత్యేకం?
ఇది కేవలం పుస్తకాల్లో పాఠాలు చెప్పే కోర్సు కాదు. నిజ జీవితానికి అద్దం పట్టేలా రూపొందించబడింది. వారానికి మూడు లెక్చర్లు, ఒక ట్యుటోరియల్ తో సాగే ఈ కోర్సులో యువతకు అవసరమైన ఎన్నో విషయాలు నేర్పిస్తారు.
లవ్ సైన్స్: స్నేహం ఎలా మొదలవుతుంది? అది ప్రేమగా ఎలా మారుతుంది? అనే విషయాలను సైంటిఫిక్ థియరీలతో వివరిస్తారు.
రెడ్ ఫ్లాగ్స్ గుర్తింపు: ఒక బంధంలో ప్రమాద ఘంటికలు ఎలా గుర్తించాలి? అసూయ, అనుమానం, ఎమోషనల్ మానిపులేషన్, ఆన్ లైన్ స్టాకింగ్, భాగస్వామిపై హింస వంటి ప్రమాదకర సంకేతాలపై పూర్తి అవగాహన కల్పిస్తారు.
ఆరోగ్యకరమైన బంధం: నిజమైన ప్రేమ అంటే ఏమిటి? ఒకరికొకరు ఎమోషనల్ గా సపోర్ట్‌గా ఎలా ఉండాలి? కమ్యూనికేషన్ గ్యాప్స్ రాకుండా ఎలా చూసుకోవాలి? బ్రేకప్ అయినా కుంగిపోకుండా మానసికంగా బలంగా ఎలా ఉండాలో నేర్పిస్తారు.
సినిమా చూసినట్టే
ఈ కోర్సు బోధనా పద్ధతులు చాలా వినూత్నంగా ఉంటాయి.
సోషల్ మీడియా డీకోడింగ్: వాట్సాప్ చాట్స్, ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల వెనుక ఉన్న సంబంధాల డైనమిక్స్‌ను విశ్లేషించడం.
సినిమా పాఠాలు: కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి సినిమా)లో ప్రేమ ఉందా? లేక టాక్సిక్ ప్యాట్రన్ ఉందా? టైటానిక్ మూవీలో జాక్ ప్రేమ నిజమైనదేనా? ఇలాంటి సినిమాలను చూపిస్తూ లోతైన చర్చలు జరుపుతారు.
రియల్ లైఫ్ వర్క్‌షాప్‌లు: బ్రేకప్ అయితే ఎలా డీల్ చేయాలి? మన బౌండరీలను ఎదుటివారికి గౌరవంగా ఎలా చెప్పాలి? క్షమించడం ఎలాగో నేర్పే ప్రాక్టికల్ ఎక్సర్‌సైజ్‌లు ఉంటాయి.
డేటింగ్ యాప్స్ పై డిబేట్లు: టిండర్ వంటి ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల వల్ల కలిగే లాభనష్టాలపై వాడివేడి చర్చలు నిర్వహిస్తారు.

కోర్సు లక్ష్యాలు
ప్రేమ, ఒత్తిడి, సంఘర్షణల వెనుక ఉన్న సైకాలజీని యువత అర్థం చేసుకోవాలి. ప్రమాదకరమైన బంధాలను ముందుగానే గుర్తించి, తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన, అర్థవంతమైన బంధాలను నిర్మించుకోవడం నేర్చుకోవాలి.



Click it and Unblock the Notifications