Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
Sri Lanka Monkey Business: చైనాకు కోతులను అమ్ముతున్న శ్రీలంక! మరీ ఇంతగా దిగజారిపోయిందా?
శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు పాకిస్థాన్ ఆర్థికంగా దివాళా తీయగా.. శ్రీలంక దివాళా అంచున నిల్చుంది. తీవ్రంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో లంకేయులు తినడానికి తిండి కూడా లేక నానా అవస్థలు పడుతున్నారు.
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ఏకంగా తన దేశపు జంతువులకు కూడా అమ్మడానికి సిద్ధపడిందన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీలంకలో మాత్రమే కనిపించో టోక్ మకాక్ అనే జాతి కోతులను చైనాకు అమ్మడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తీవ్ర ఆర్థిక సమస్యలతో రోజు కూడా గడవని పరిస్థితిలో శ్రీలంక కొట్టుమాట్టాడుతోంది. శ్రీలంక దుస్థితిని ఆసరాగా చేసుకుని చైనా ఓ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. శ్రీలంకలో మాత్రమే కనిపించే టోక్ మకాక్ కోతులను చైనా దిగుమతి చేసుకోవాలని అనుకుంటోందట. ఓ లక్ష కోతుల్ని శ్రీలంక నుండి దిగుమతి చేసుకోవాలన్న ప్రతిపాదన చేసింది.
శ్రీలంకలో భారీగా టోక్ మకాక్ కోతులు!:
చైనా కోతులు అడగడంపై శ్రీలంక ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ కోతులను చైనాకు ఎగుమతి చేసే విషయంపై అధ్యయనం చేయాలని శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. శ్రీలంకలో టోక్ మకాక్ కోతుల సంఖ్య భారీగా ఉందని, వాటిని చైనాకు ఎగుమతి చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని మంత్రి మహింద వెల్లడించారు.
అంతరించిపోయే దశలో టోక్ మకాక్ కోతులు!:
శ్రీలంకలో మాత్రమే కనిపించే ఈ కోతులను చైనాకు ఎగుమతి చేయడం వల్ల ఏమైనా న్యాయపరమైన చిక్కులు వస్తాయా అనే విషయాలను అధ్యయనం చేయడానికి కేబినెట్ అనుమతితో ఓ కమిటీని నియమించాలని నిర్ణయించింది శ్రీలంక ప్రభుత్వం. శ్రీలంకలో టోక్ మకాక్ కోతులు 30 లక్షలకు పైగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఈ కోతులు పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ జాతి కోతుల సంతతిని నియంత్రించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదని, ఈ కోతులు వాటి సంతతిని భారీగా పెంచుకుంటూ పోతున్నాయని అధికారులు అంటున్నారు.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(IUCN) మాత్రం ఈ కోతులు అంతరించి పోయే దశలో ఉన్నట్లు చెబుతోంది. జీవవైవిధ్యం కోసం ఈ కోతులను సంరక్షించాల్సిన అవసరం ఉందని సూచిస్తోంది. ఈ జాతి కోతులు ఇప్పటికే అంతరించి పోయే దశలో ఉన్నాయని, రెడ్ లిస్టులో ఉన్నాయని చెబుతోంది.
కోతుల దిగుమతి ప్రయోగాల కోసమేనా?:
భారీ సంఖ్యలో శ్రీలంక నుండి కోతులు దిగుమతి చేసుకునేందుకు చైనా ప్రతిపాదించడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కోతులను ల్యాబ్ లో ప్రయోగాల కోసమే వాడుతుందని చైనాపై ఇతర దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
అయితే శ్రీలంక మంత్రి మహింద మాత్రం ఈ కోతులను చైనా తమ జూలలో ఉంచి సంరక్షిస్తుందని చెబుతున్నారు. జంతు ప్రదర్శనశాలలో ఉంచి ప్రదర్శన కోసం వాడుతుందని చెబుతున్నారు మహింద అమరవీర.
ఉచితంగా పంపిస్తారా? అమ్మకానికి పెడతారా?
మరి ఈ కోతులను ఉచితంగానే చైనాకు ఇస్తారా లేదంటే అమ్మకానికి పెడతారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న శ్రీలంక కోతులను చైనాకు పంపించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications