Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
సైలెంట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. ఈరోజు(డిసెంబర్ 12న) అతి తక్కువ మంది పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో గోవాలో ఆమె అంగరంగ వైభవంగా తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్ళిలో కీర్తి సురేష్ అద్భుతంగా వెలిగిపోతున్నారు. దంపతులిద్దరూ నవ్వుతూ, ఎంతో సంతోషంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ప్రేమించిన వ్యక్తినే..
కీర్తి సురేష్ తాను ప్రేమించిన వ్యక్తిని పరిణాయామాడారు. తన కాలేజ్ రోజుల నుంచే ఆంటోనీ తట్టిల్‌తో ఆమె ప్రేమలో ఉన్నారు. కాలేజ్ రోజుల్లోనే లవ్ స్టోరీస్ నడిపించిన కీర్తి సురేష్.. సినిమాల్లో వచ్చి పెద్ద స్టార్ అయినా కూడా తన ప్రేమ గురించి ఎక్కడా పొక్కనివ్వలేదు. ఇటీవలే దీపావళి సందర్భంగా తాను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించారు. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌తో 15 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానని పేర్కొన్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు.

అలా కొద్దీ రోజులకే తమ పెళ్లి తేదీని కూడా వెల్లడించారు. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోనున్నట్లు ప్రకటించారు. అలా ఈరోజు పదిహేను సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఆమె ఈరోజు పెళ్లితో మరో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.
డెస్టినేషన్ వెడ్డింగ్..
గోవాలో కీర్తి సురేష్, ఆంటోనీ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. ఈ పెళ్లి తతంగం అంతా కీర్తి, అంటోనీ కుటుంబ సభ్యులే చూసుకున్నారు. ఈ పెళ్ళికి అతి తక్కువ మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో ఈ పెళ్లి జరిగింది. ఈరోజు ఉదయం హిందూ సంప్రదాయం ప్రకారంగా జరిగిన ఈ పెళ్లి.. ఈరోజు సాయంతం క్రిస్టియన్ సంప్రదాయంలో జరగనుంది.
స్పెషల్ గిఫ్టులు
కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్‌ల పెళ్ళికి హాజరైన వ్యక్తులకు ప్రత్యేకమైన బహుమతులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. KA పేరుతో హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారని తెలుస్తోంది. వాటిని ధరించిన వారు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు అర్హులని టాక్ నడుస్తోంది. అలాగే పెళ్లి వేడుకకు హాజరయ్యే అతిథులకు ఏమాత్రం బోర్ కొట్టకుండా విందు కూడా ఏర్పాట్లు చేస్తినట్లు తెలుస్తోంది. అలాగే గానా కచేరి కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
సినిమాల్లో నటిస్తారా?
సౌత్ సినిమాల్లో కీర్తి సురేష్ చాలా బిజీ నటి. తెలుగు, తమిళ్‌తో పాటు ఇతర భాషల్లో కూడా కీర్తి సురేష్ నటిస్తూ కెరీర్‌లో పీక్ స్టేజిలో ఉన్నారు. ఇటీవలే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆమె మళ్ళీ సినిమాల్లో నటిస్తారా లేదా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. కీర్తి నటనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. వారంతా కీర్తి అప్డేట్ కోసం వెయిట్ చేస్తుంటారు. మరి దీనిపై మహానటి మౌనం వీడేంత వరకు క్లారిటీ రాదు.



Click it and Unblock the Notifications