Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Weirdest Traditions: పక్కోడి పెళ్లాన్ని ఎత్తుకుపోవడమే అక్కడి సాంప్రదాయం.. ఇదెక్కడి పద్ధతిరా నాయనా?
వివాహం అనేది అద్వితీయమైన బంధం. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఇరు కుటుంబాలు ఒక్కటై జీవితాంతం కలిసి మెలిసి ఉండే సాంప్రదాయం. వివాహానికి సంబంధించి ఒక్కో చోట ఒక్కో రకమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఎన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నా.. వివాహ బంధం లక్ష్యం మాత్రం ఒకటే. భార్యాభర్తలు ఇద్దరూ జీవితాంతం, కడవరకు కలిసి మెలిసి ఉండటమే.
అయితే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని ఆచారాల ప్రకారం పెళ్లి అనే బంధం విచిత్రం అనిపిస్తుంది. కొన్ని తెగల్లో పాటించే సాంప్రదాయాలు భిన్నంగా కనిపిస్తాయి. ఓ తెగ పాటించే వివాహ సాంప్రదాయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

ఓ దేశంలోని తెగ వారు ఇతరుల భార్యలను ఎత్తుకుపోయే సాంప్రదాయం ఉంది. పెళ్లి చేసుకోవాలంటే ఇతరుల పెళ్లాలను దొంగలించుకుపోయి ఆ తర్వాత వివాహం చేసుకోవడమే అక్కడి ఆచారం. దీనిని వారు ఏమాత్రం తప్పుగా భావించరు. ఈ వింత ఆచారాన్ని ఏ దేశంలో పాటిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంతమందినైనా పెళ్లాడవచ్చు:
ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో నివసించే ఫులానీ ప్రజల సంచార తెగ అయిన వోడాబే ప్రజలు ఈ వింతైన పెళ్లి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ తెగ వారు ధరించి దుస్తులు, వారి అందమైన పూసల కళ, అలాగే వారి ప్రత్యేకమైన వివాహ ఆచారాలకు ప్రసిద్ధి చెందారు.
వోడాబే(Wodaabe) సంస్కృతిలో, వివాహాన్ని జీవితాంతం కట్టుబడి ఉండే ఆచారంగా పరిగణించరు. పెళ్లి బంధాన్ని కేవలం కుటుంబాన్ని సృష్టించడానికి, పిల్లలను పెంచడానికి ఓ మార్గంగా మాత్రమే చూస్తారు. ఈ తెగ పురుషులు ఎంత మంది మహిళలనైనా పెళ్లాడవచ్చు. అలాగే స్త్రీలు తమ భర్తలతో సంతోషంగా లేకపోతే వారిని విడిచిపెట్టి వేరే వారితో కలిసి ఉండొచ్చు.
విశిష్టమైన గెరెవోల్ సంస్కృతి:
వోడాబే సంస్కృతిలో అత్యంత విశిష్టమైన అంశాల్లో ఒకటి గెరెవోల్(Gerewol). ఇది ప్రతి ఏటా వేసవి కాలంలో నిర్వహిస్తారు. గెరెవోల్ సమయంలో, యువకులు విచిత్రమైన దుస్తులు ధరించి మహిళలు ఆకర్షించేలా డ్యాన్స్ చేస్తుంటారు. ఈ గెరెవోల్ లో మహిళలకు ఎవరైనా పురుషుడు ఆకర్షణీయంగా కనిపిస్తే వారిని ఎంచుకుంటారు.
వ్యభిచారం కాదు.. ఇదో ఆచారం:
వోడాబే తెగ ప్రజలు వ్యభిచారం చేస్తారని అనుకోవడం తప్పు. వారు తరాల నుంచి వస్తున్న ఆచారాన్ని నిబద్ధతతో పాటిస్తున్నారు. కుటుంబాన్ని, వారి తెగను పెంచుకోవడానికి సాంప్రదాయాన్ని అవలంభిస్తున్నారు. వారికి భార్యాభర్తల సంబంధం కంటే కూడా కుటుంబం బంధాలపై ఎక్కువ మక్కువ చూపిస్తారు.
ఆ తెగ లో ఉండే ప్రజలు అందరికీ ఒకరితో ఒకరికి రక్త సంబంధం ఉంటుంది. అందుకే ఎప్పుడూ కలిసి మెలిసి ఓ కుటుంబంలా ఉంటారు. పెద్ద వాళ్లను తల్లిదండ్రుల్లా చూస్తారు. ఇతర పురుషులను సోదరుల్లా భావిస్తారు.
వోడాబే తెగ ప్రజల సంస్కృతి కొద్దిగా వింతగా అనిపించవచ్చు. కానీ అవి వారి విలువలకు, వారి జీవన విధానానికి ప్రతిబంబంగా చూడాలి.
వోడాబే వివాహ ఆచారం:
- పురుషులు ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ భార్యలందరినీ సమానంగా చూడాలి.
- స్త్రీలు తమ భర్తలతో సంతోషంగా లేకపోతే వారిని వదిలేసి వేరే పురుషుని వద్దకు వెళ్లవచ్చు.
- విడాకులు సర్వసాధారణం. కానీ స్నేహపూర్వకంగా ఉంటుంది.
- పిల్లలను వారి తల్లులు పెంచుతారు. కానీ వారు తమ తండ్రులను కూడా గౌరవిస్తారు.
- వోడాబే వివాహాన్ని కుటుంబాలను అభివృద్ధి చేసే బంధంగా చూస్తారు.



Click it and Unblock the Notifications