Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
Cancer In Car : కారులోని గాలి పీలిస్తే క్యాన్సర్... నివేదికలో భయంకరమైన వాస్తవాలు..!
కారులో కూర్చొని ప్రయాణం చేస్తే హాయిగా అనిపిస్తుంది. బిజీ ట్రాఫిక్‌లో కూడా ఏదైనా సినిమా చూడ్డం లేదా మ్యూజిక్ వింటే టైం గడిపేయవచ్చు. చిన్నపాటి లంచ్, డిన్నర్‌లు కూడా కారులోనే కానీయొచ్చు. కారు మనకు ఓ మొబైల్ ఇంటి లాంటి. అలాంటి కారులోని గాలి ప్రాణాంతకమని తాజాగా జరిపిన పరిశోధనలు చెబుతున్నాయ్. కారు వల్ల ఇప్పుడు బయటే కాదు లోపల కూడా కాలుష్యమే వెదజల్లుతోందని అనుకోవచ్చు. కారులోని గాలి ఎలా ప్రాణాంతకం, అసలు నివేదికలు ఏమి చెబుతున్నాయో ఓసారి లుక్కేద్దాం.
కారులో విషపదార్ధాలు
ఎండాకాలంలో కారులోంచి ఎక్కువగా విషపదార్దాలు విడుదలౌతున్నాయని నివేదిక చెబుతోంది. కారు భాగాల్లోంచే ఈ విషగాలి వ్యాపిస్తోంది. ఎండాకాలంలో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఎండలో వెళ్లలేక ఎక్కువ మంది కారులో వెళ్లడానికి ప్రాధాన్యతనిస్తారు. కారు లోపల ఏసీని ఆన్ చేయడం, బయట తీవ్రమైన ఉష్ణోగ్రతలు కారు భాగాలు కాలిపోయేలా చేస్తాయ్. దీంతో కారు లోపల ఓ రకమైన కార్బన్ విడుదలకు ఆస్కారం ఉందని అనుకోవచ్చు.

అన్ని రకాల కార్లపై సర్వే
2015 నుంచి 2022 మధ్యలో వచ్చి కారు మోడల్స్‌పై సర్వే చేశారు. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, గ్యాస్, ఈ నాలుగు రకాల కార్లను తీసుకొని వాటిపై పరిశోధనలు చేశాక ఆశ్చర్యానికి గురిచేసే విషయం బయటపడింది. 99 శాతం కార్లల్లో టీసీఐపీపీ అనే కార్సినోజిన్ విడుదలౌతున్నట్లు రిపోర్ట్ బయటపడింది. అమెరికన్ నేషనల్ టాక్సికాలజీ ప్రొగ్రామ్ దీనికి సంబంధించిన పరీక్షలను చేపడుతోంది. క్యాన్సర్‌కు కార్సినోజెన్లే ప్రధాన కారణం. కారులో వెలువడే ఈ కార్సినోజెన్ల వల్ల క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయ్.
కారు గాలిలో కార్సినోజెన్
కారులో వ్యాపించే ఈ కార్సినోజెన్లను కారులోని డ్రైవర్ ఎక్కువగా పీల్చే అవకాశం ఉంది. ప్రతీ రోజు డ్రైవర్ కనీసం ఒక గంట కారులోపల గుడుపుతాడు. బిజీగా నడిపితే ఇంకా చాలా సమయం వరకు కారులోనే ఉంటాడు. కారులో ప్రయాణించే పిల్లలపైన కూడా ఈ ప్రభావం ఉంటుంది. అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణించేవారికి ఇద్దరికీ ఇది ప్రాణాంతకమే అంటున్నారు.
ఎండాకాలంలో కారులో కార్సినోజెన్లు మరింత ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. కారులోని సీట్లలో వాడే ఫోమ్, దూదిలో రసాయనాలు ఉపయోగించడం వల్ల విష పదార్ధాలు విడుదలౌతాయని నివేదికలో వెల్లడౌతోంది. కారుసీట్ల తయారీ సమయంలో కెమికెల్స్ ఉపయోగించేప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. భవిష్యత్తులో వాటి నుంచి ఏదైనా ప్రమాదం పొంచి ఉందానని పరిశీలన జరగాల్సిన అవసరముందని పరిశోధకులు చెబుతున్నారు.
కారు సీట్లలో క్యాన్సర్ కారకాలు
మంటలను తట్టుకోవడం కోసమే సీట్లతయారీలో కెమికల్స్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇది లాభం కన్నా చేస్తున్న నష్టమే ఎక్కువుందని పరిశోధకులు అంటున్నారు. ఈ కెమికల్స్ కాకుండా ప్రత్యామ్నాయంగా వేరే పదార్థాలను కలిపి సీట్ల తయారీలో ఉపయోగించాలని సూచిస్తున్నారు.
కారులో ప్రయాణించేప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలి. కారులోపల పిల్లలను వదిలి కారుకు ఎప్పుడూ లాక్ వేయవద్దు. కారు కాలిపోతున్నట్లు అనిపిస్తే వెంటనే కిందకు దిగేయాలి. కారును హైస్పీడ్‌లో నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యం తాగి కారు నడపవద్దు. ట్రాఫిక్ నిబంధనలను ఖచ్ఛితంగా పాటించాలి.



Click it and Unblock the Notifications