Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పుష్యా నక్షత్రంలోకి సూర్య సంచారం, ఈ రాశుల వారికి అదృష్టం, ధనలాభం.. మీ రాశి ఉందా చెక్ చేసుకోండి?
వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని నవగ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. సూర్యుడు సాధారణంగా ప్రతి నెల రాశులను మారుతూ ఉంటాడు. అలాగే ఎప్పటికప్పుడు నక్షత్రాలను కూడా మారుస్తుంటాడు. జులై 16, 2023 తేదీన సూర్యుడు చంద్రుడు పాలించే కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. కర్కాటకరాశిలో ప్రవేశించిన కొన్ని రోజులకే నక్షత్ర పరివర్తన కూడా జరుగుతుంది. జులై 20వ తేదీన సూర్యుడు పుష్యా నక్షత్రంలోకి ప్రవేశించాడు.
సూర్యుడు పుష్యా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈ సూర్య సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అపారమైన ప్రయోజనాలు అందుకోనున్నారు. సూర్యుడు పుష్యా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ప్రయోజనం పొందే రాశులు ఏవో, వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు చూద్దాం.

మేషరాశి:
సూర్యుడు పుష్యా నక్షత్రంలోకి ప్రవేశించడం మేష రాశి వారికి అనేక ప్రయోజనాలను కలిగించనుంది. అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, సాన్నిహిత్యం మెరుగుపడుతుంది. మేషరాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధలు సమసిపోతాయి. ఆదాయం స్థిరంగా వస్తుంది.
మిథునరాశి:
సూర్యుడి నక్షత్ర సంచారం వల్ల మిథున రాశి వారికి అదృష్టం కలగనుంది. మిథున రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఈ సమయంలో వారు ఆర్థికంగా మెరుగుపడతారు. కొన్ని రోజుల పాటు ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. అలాగే కుటుంబసభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. దంపతుల మధ్య సాన్నిహిత్యం మెరుగుపడుతుంది.
వృశ్చికరాశి:
సూర్యుడు పుష్యా నక్షత్రంలోకి ప్రవేశించిన సమయంలో వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో రాశుల వారు అన్ని రకాల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో బంధం మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి పుష్యా నక్షత్రంలోకి సూర్యుడి సంచార కాలం కలిసి రానుంది. ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండనుంది. అప్పుల బాధలు పూర్తిగా తొలగిపోతాయి. అనవసర ఖర్చులు తగ్గి ఆర్థికంగా మెరుగుపడతారు. స్థిరమైన ఆదాయం వల్ల ఫైనాన్షియల్ గా మంచి స్థితిలోకి వస్తారు. సూర్యుని అనుగ్రహం ఉండటం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి. సరిగ్గా ఆలోచించి చేపట్టే పనులు చక్కని ఫలితాలను అందిస్తాయి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దంపతులు, ప్రేమికుల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం మెరుగు పడుతుంది.
మీనరాశి:
పుష్యా నక్షత్రంలోకి సూర్యుడి సంచారం వల్ల మీన రాశి వారు అదృష్టాన్ని పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉండనుంది. మంచి లాభాలు అందుకుంటారు. కెరీర్ లో పురోగతి లభిస్తుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆర్థికంగా, మానసికంగా బలంగా తయారవుతారు. అప్పుల బాధలు తొలగిపోతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
