Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Surya Grahan 2023: సూర్యగ్రహణం చుట్టూ ఎన్నో నమ్మకాలు, విశ్వాసాలు.. సైన్స్ ఏమంటుందంటే?
2023 లో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడనుంది. దీనినే హైబ్రిడ్ సూర్యగ్రహణం అని కూడా పిలుస్తున్నారు. హిందూ మత విశ్వాసాలు, ఆచారాల ప్రకారం సూర్యగ్రహణాన్ని అశుభంగా, అమంగళంగా పరిగణిస్తారు. గ్రహణ సమయంలో ఏదీ తినకూడదని, తాగకూడదని, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటుంటారు. దేవాలయాల తలుపులు మూసేస్తారు.
కులమత ఆచారాల ప్రకారం సూర్యగ్రహణం చుట్టూ అనేక నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా దీని గురించి ప్రస్తావన కనిపిస్తుంది. అసలు సూర్యగ్రహణం వేళ ఏయే పనులు చేయాలి, చేయకూడనివి ఏంటో పెద్దలు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాహువు మింగడం వల్లే గ్రహణాలు?
క్షీరసాగర మథనం సమయంలో అమృతాన్ని చేజిక్కించుకున్న ఓ రాక్షసుడు ఆ అమృతాన్ని పట్టుకుని సూర్యచంద్రుల మధ్యలో కూర్చొని తాగడానికి సిద్ధమవుతాడు. అది గమనించి సూర్యచంద్రులు విష్ణువుకు ఈ విషయాన్ని తెలియజేస్తారు. విష్ణువు వచ్చే లోపే ఆ రాక్షసుడు అమృతాన్ని తాగుతాడు. ఆ అమృతం శరీరంలోకి వెళ్లకుండా విష్ణువు ఆ రాక్షసుడి తలను వేరు చేస్తాడు.
అమృతం తాగడం వల్ల ఆ రాక్షసుడి తల మాత్రమే సజీవంగా ఉంటుంది. విష్ణువు తన తలను నరకడానికి కారణమైన సూర్యచంద్రులపై కోపంతో రాహువు అనే ఆ రాక్షసుడు సూర్యుడిని, చంద్రుడిని మిగేస్తాడు. ఎలాంటి శరీరం లేకపోవడం వల్ల వెంటనే బయటకు వచ్చేస్తారు సూర్యచంద్రులు. అలా సూర్యచంద్ర గ్రహణాలు సంభవిస్తూ తిరిగి యథాస్థానానికి వస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
2. రక్షించడం, శుద్ధి చేయడం:
రాహుకాలాన్ని పురాణ ఇతిహాసాల ప్రకారం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఏ పని తలపెట్టకూడదని, ప్రారంభించకూడదని అంటారు పెద్దలు. ఈ సమయంలో ఆహారం తినడం కూడా నిషేధం. గర్భిణీలు ఇంటిపట్టునే ఉండాలని, కఠిన ఆహార నియమాలు పాటించాలని చెబుతారు.
3. వియత్నాంలో అలా..:
ఒక పెద్ద కప్ప సూర్యుడిని, చంద్రుడిని మింగినప్పుడు గ్రహణాలు సంభవిస్తాయని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. సూర్యచంద్రులను మింగిన ఆ కప్పను వాటిని వదిలేయాలని దాని యజమాని చెప్పడంతో ఆ కప్ప వాటిని ఉమ్మివేసిందని అంటారు.
4. డ్రాగన్ తినడంతో గ్రహణం:
చైనీస్ పురాణాల ప్రకారం సూర్యుడిని భోజనంగా భావించిన డ్రాగన్ సూర్యుడిని మింగడంతో గ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై డ్రాగన్ నుండి సూర్యుడిని రక్షిస్తాడని అంటారు.

సూర్యగ్రహణం వేళ ఈ పనులు చేయకూడదు:
1. సూర్యగ్రహణ సూతక్ కాలంలో ఆహారా పదార్థాలు వండటం, తినడం లాంటివి చేయకూడదు. గ్రహణం తర్వాత వంటిల్లును శుభ్రం చేసుకుని ఆహారాన్ని వండుకుని తినాలి. ముందుగా వండిన ఆహారాన్ని తినకూడదు.
2. సూర్య గ్రహణం సమయంలో ఆలయాలు, ఇంట్లో పూజాగది తలుపులు మూసేస్తారు. గ్రహణం పూర్తయిన తర్వాత తలుపులు తెరిచి గంగాజలంలో శుభ్రం చేసిన తర్వాత పూజాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
3. సూర్యగ్రహణం సమయంలో మంచి పనులు తలపెట్టకూడదు. అలాగే గ్రహణం సమయంలో మంత్ర పఠనం, దైవారాధన చేస్తే ప్రతికూల ప్రభావం పడదు.
4. ఒకవేళ సూర్యగ్రహణానికి ముందు ఆహారం వండినట్లయితే ఆ పాత్రలపై తులసి ఆకులు, గరిక ఉంచితే సూర్యగ్రహణ ప్రతికూల ప్రభావం వాటిపై పడదు.
5. సూర్యగ్రహణం వేళ గర్భిణీలు చేయకూడని పనులు:
* గర్భిణీలు సూర్య గ్రహణం సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు.
* గర్భిణీలు సూర్య గ్రహణం సమయంలో పదునైన వస్తువులు అంటే కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు వంటివి ఉపయోగించకూడదు.
* అప్పటికే వండి ఉంచిన ఆహారాన్ని తినకూడదు.
* గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఆహారం వండుకుని తినాలి.
* సూర్యగ్రహణం వేళ దానిని చూడటానికి ప్రయత్నించవద్దు.
* ఈ సమయంలో నాన్ వెజ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. దీని వల్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications