Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Swami Vivekananda Quotes : ‘అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి.. ఇవే విజయ సాధనకు మార్గాలు.'
భారత దేశ యువతనే కాదు మొత్తం ప్రపంచాన్ని తన సూక్తులతో స్వామి వివేకానందా ఇప్పటికీ స్ఫూర్తి రగిలిస్తూనే ఉన్నారు. చికాగో సర్వమత సమ్మేళనంలో హిందూ మత గొప్పతనాన్ని చాటి ప్రపంచంలోని మేధావులందరినీ మెప్పించారు. నిరాశకు లోనైనప్పుడు స్వామీజీ చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటే అనంతమైన శక్తి శరీరంలో ప్రవహించినట్టు అనిపిస్తుంది. రామకృష్ణ మఠాన్ని స్థాపించి ఎందరో పేదలకు సేవలు చేశారు. భారత స్వాతంత్ర్య సమరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి స్ఫూర్తిని ఇచ్చిన వారిలో స్వామీ వివేకానంద ప్రధముడు. స్వామి వివేకానందలో పాజిటివ్ మాత్రమే ఉంది నెగటివ్ అస్సలు లేదు అని రబింద్రనాథ్ ఠాగూర్ స్పష్టం చేశారు.
ప్రతీ రోజూ ఉత్సాహంగా పాజిటివ్ ఎనర్జీ తో ఉండాలంటే వివేకానంద సూక్తులను స్మరించుకోవాల్సింది. మీకోసం కొన్ని ప్రత్యేకమైన స్వామీ వివేకానంద సూక్తులను సేకరించి అందిస్తున్నాం.
స్పూర్తిని రగిలించే స్వామి వివేకానంద కోట్స్
1. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
2. దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.
3. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు.

4. నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.
5. పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.
6. 'రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్బుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.'
7. 'మీకు సాయం చేస్తున్న వారిని మరువకండి. మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి.
8. మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి.'
'ఎవరి కోసమో, దేనికోసమో ఎదురుచూడకండి. మీరు చేయగలిగింది చేయండి. ఎవరి మీద ఆశ పెట్టుకోకండి'.
9. 'మిమ్మల్ని శారీరకంగా మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే దేనిని అయినా విషంతో సమానంగా భావించి తిరస్కరించండి.'
10. 'ఒక ఆలోచనను స్వీకరించండి. దాని గురించే ఆలోచించండి, దాని గురించే కలగనండి. మీ నరనరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకుపోనీయండి మిగతా ఆలోచనలను పక్కకు పెట్టండి ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది.'
11. 'మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీన పరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి.'
12. 'జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు.. కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.'
'చావు బతుకులు ఎక్కడో లేవు.. ధైర్యంలోనే బతుకు ఉంది. భయంలోనే చావు ఉంది.'
13. 'పోరాటంలోనైనా మృత్యువులోనైనా మీ శక్తినే నమ్ముకోండి ప్రపంచంలో పాపం అనేది ఉంటే.. అది మీ బలహీనత మాత్రమే.'
14. 'అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి.. ఇవే విజయ సాధనకు మార్గాలు.'
15. 'కష్టాల్లో ఉన్నప్పుడే మనలోని శక్తియుక్తులు బయటపడుతాయి. అద్భుతాలు సాధించడానికి మూలం దృఢ నమ్మకం.'
16. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతావు. అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని కోల్పోతావు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. అబద్ధాలను మాట్లాడితే పేరును కోల్పోతావు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు.
17. మనిషి గొప్పవాడా, కాదా అన్నది అతడి విజయాల్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి.
18. సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించే వారు ధన్యులు.
19. మనం మాట్లాడే మాటల మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే సరిగా మాట్లాడడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు.



Click it and Unblock the Notifications