Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
తెల్లవారుజామున ఆ కల వస్తే..ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది,కోటీశ్వరులైపోతారు
హిందూ మతంలో బ్రహ్మ ముహూర్తం చాలా ముఖ్యమైనది. ఒక రోజులో మొత్తం 24 గంటలు ఉంటాయి. రోజులో మొత్తం 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక్కో ముహూర్తం 48 నిమిషాలు. అన్నీ ముహూర్తాలలో బ్రహ్మ ముహర్తం అద్భతుమని మన పురాణాలే కాడు మోడ్రన్ సైన్స్ కూడా చెబుతుంది. బ్రహ్మ ముహూర్తానికి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుందని..ఆ సమయంలో ఏ పని చేపట్టినా విజయే లభిస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. సాక్ష్యత్తు బ్రహ్మదేవుడే శ్రీ మన్నా నారాయణను కొలిచిన కాలాన్నే బ్రహ్మ కాలం అంటారు. బ్రహ్మ ముహూర్త సమయం ఉదయం 4 గంటల నుండి 5.30 గంటల వరకు ఉంటుంది.
బ్రహ్మముహూర్త సమయంలో చూసే కలలు చాలా శుభప్రదమైనవిగా చెబుతారు. ఈ సమయంలో చూసిన కలలు తప్పకుండా నెరవేరుతాయని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ఈ సమయంలో కలలో కొన్ని విషయాలు కనిపిస్తే మంచి జరుగుతుందని చెబుతారు. అంతేకాకుండా ఇది డబ్బు, వ్యాపారంలో మంచి పురోగతిని కూడా తీసుకురాగలదు. ఉదయాన్నే ఏ కలలు వస్తే డబ్బు వస్తుందో ఇప్పుడు చూద్దాం.

ధాన్యం కుప్ప
కలలో ధాన్యం కుప్పలు కనిపిస్తే అది శుభప్రదంగా భావిస్తారు. అలాంటి కల రాబోయే నగదు ప్రవాహాన్ని సూచిస్తుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో కలలో ఇలాంటి ధాన్యాల కుప్ప కనిపిస్తే త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. పెట్టుబడుల నుండి ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.
నీటి కూజా
స్వప్న శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త సమయంలో కలలో నీరు నిండిన కూజా లేదా కలశం కనిపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అలాంటి కల డబ్బు ప్రవాహాన్ని సూచిస్తుంది. ఈ రకమైన కలని చూసిన వ్యక్తి అనేక వనరుల నుండి డబ్బును అందుకుంటారు, ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుంది. అలాగే ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తవుతుంది, అనేక శుభవార్తలు అందుకోవచ్చు.
ఒక ఇంటర్వ్యూలో ఉండటం
స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూలో ఉన్నట్లు కలలు కనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రకమైన కల మంచి ఆర్థిక ప్రయోజనాలను సూచిస్తుంది. ఉద్యోగస్తులకు ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. మీరు ఉద్యోగం కోసం వేచి ఉంటే మీరు మంచి ఉద్యోగం పొందవచ్చు. మీరు ఇప్పటికే ఇంటర్వ్యూకి వెళ్లి ప్రతిస్పందన కోసం వేచి ఉంటే మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
నదిలో స్నానం
స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో నదిలో స్నానం చేయడం చాలా శ్రేయస్కరం. ఈ రకమైన కల రాబోయే ఆర్థిక లాభాలను సూచిస్తుంది. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త సమయంలో మీకు అలాంటి కల వస్తే డబ్బు మీ చేతికి వస్తుంది, మీకు వ్యాపారంలో కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications