Latest Updates
-
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్!
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ!
తిండి పోటీలు అంటే మనలో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే తీరా పాల్గొనాల్సి వస్తే మాత్రం నిమిషాల్లోనే మా వళ్ల కాదురా బాబోయ్ అని పక్కకు తప్పుకుంటారు. మరికొందరికి అయితే అవకాశం రాక ఆ పోటీ పెట్టినవాళ్లు బతికిపోతుంటారు. ఎంత పెట్టినా తినే కుంభకర్ణులు కూడా చాలామందే ఉంటారు. తాజాగా ఒక అమ్మాయి ఈ తరహా పోటీలో పాల్గొని 10 వేల రూపాయలు గెల్చుకుంది. దీనికి సంంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటది. ఈ సమయంలో అటుగా వచ్చిన ఒక కంటెంట్ క్రియేటర్ ఆ అమ్మాయిని ఆపి 5 వేల రూపాయలు ఇస్తాను, ఎన్ని గులాబ్ జాములు తినగలరు అని అడగ్గా..67 అని ఆ అమ్మాయి సమాధానమిస్తుంది. దీంతో ఆ కంటెంట్ క్రియేటర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే తేరుకొని ఆ అమ్మాయిని తనతో పాటు దగ్గర్లోని ఒక బేకరీకి తీసుకెళ్లాడు.

బేకరీకి వెళ్లి తనకు 67 గులాబ్ జాములు కావాలని అందులోని వ్యక్తిని అడగ్గా..షాపులోని వ్యక్తి కూడా కొంచెం అవాక్కవుతాడు. అయితే మనదేం పోయింది డబ్బులిస్తే ఎన్నైనా ఇస్తా అన్నట్లుగా ఒకే సార్ అని చెప్పి ముందు ఒక గులాబ్ జామ్ బాక్స్ ని ఇచ్చాడు. బేకరీలోనే కూర్చొని ఆ యువతి జస్ట్ 7 నిమిషాల్లోనే ఆ బాక్స్ లోని గులాబ్ జాములన్నింటినీ తినేసింది. తర్వాత షాపు అతను ఇస్తూ ఉన్నాడు..ఆ అమ్మాయి తింటూనే ఉంది. మొదటి బాక్స్ తర్వాత మరో నాలుగు బాక్స్ లను ఫటా ఫట్ మని లాగించేసింది. ముందు బ్యాచ్ గులాబ్ తాములు తినేలోగా మరో బాక్స్ లో వాటిని పెట్టించేలా షాపు అతను అదే పనిలో ఉన్నాడు.

అలా ఎనిమిదో బాక్స్ వచ్చేసరికి అప్పటికి ఆ అమ్మాయి తాన షుగర్ ఎక్కువ తిన్నాను అని ఫీల్ అయ్యింది. అయినా కూడా పోరాటం ఆపలేదు. బాక్స్ మీద బాక్స్ ఫాపు వ్యక్తి ఇస్తున్నాడు..ఆ అమ్మాయి తింటూనే ఉంది. అలా 34 నిమిషాల్లో 67 గులాబ్ జాములు తినేసింది. మొత్తానికి గులాబ్ జాము మారథాన్ గా ఇది కొనసాగింది. దీంతొ ఆ అమ్మాయి 5 వేల రూపాయలు గెల్చుకోగా..సోషల్ మీడియాలో తనను ఫాలో అయితే మరో 5 వేలు అదనంగా ఇస్తా అనడంలో ఆ యువతి అంగీకరించింది. దీంతో మొత్తంగా రూ. 10 వేల రూపాయలు గెల్చుకుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఆ అమ్మాయి మాములుది కాదు రా బాబాయో అంటూ, లేడీ కుంభకర్ణుడు అంటూ, ఒలింపిక్స్ లో తిండి పోటీలు పెట్టి భారత్ తరపున ఈ అమ్మాయిని పంపితే గోల్డ్ గ్యారెంటీ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
