Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
అమ్మ సలహాతో 'అమ్మచేతి వంట' మొదలుపెట్టింది, ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది
యూట్యూబ్ లో రెసిపీ వీడియోలు చూసే చాలా మందికి 'అమ్మ చేతి వంట' ఛానల్ గురించి తెలిసే ఉంటుంది. చక్కని వంట వీడియోలతో ఎంతో మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నారు భార్గవి. తను చేసే వంటకు, శ్రావ్యంగా చెప్పే విధానానికి చాలా మంది ఫిదా అయిపోయి ఫాలో అవడం మొదలు పెట్టేస్తుంటారు. అంతగా ఆకట్టుకుంటారు భార్గవి. తనదైన శైలిలో వంటల వీడియోలు పోస్టు చేస్తూ లక్షల మంది సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకుంటూ ఎంతో ముంది యువతీ యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
అమ్మ సలహా..
రాజమండ్రిలో పుట్టి పెరిగారు భార్గవి. బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత భార్గవికి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అలా భార్గవి.. రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి మారిపోయారు. పెళ్లయ్యాక వెనువెంటనే ఇద్దరు పిల్లలు పుట్టడంతో వాళ్లతో, ఇంటి పనులతో బిజీగా మారిపోయారు భార్గవి. 2017లో సంక్రాంతికి పుట్టింటికి వచ్చారు భార్గవి. అప్పుడే అమ్మతో కలిసి వంట పనుల్లో బిజీగా ఉన్నప్పుడు తల్లి గీతామహాలక్ష్మీ భార్గవికి ఓ సలహా ఇచ్చారు. చక్కగా వంట చేస్తావ్..

వాటిని యూట్యూబ్ లో పెట్టొచ్చుగా అని వాళ్ల అమ్మ సలహా ఇచ్చారు. కావాలంటే కొన్ని వంటలు నేనే చేస్తా వాటిని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టమని చెప్పారు. అప్పుడు సరేనన్న భార్గవి ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయారు. తరచూ భార్గవికి ఫోన్ చేస్తూ వాళ్ల అమ్మ యూట్యూబ్ గురించి గుర్తు చేస్తూ ఉండేవారు.
అలా మొదలైంది 'అమ్మ చేతి వంట':
అమ్మ సలహాతో, ఒకరకంగా చెప్పాలంటే పోరు భరించలేక తను చేసే వంటలను వీడియోలు తీయడం మొదలుపెట్టారు భార్గవి. ఆ తర్వాత 'అమ్మ చేతి వంట' పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. తను చేసిన వంటల వీడియోలు అందులో పోస్టు చేస్తూ వచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో వ్యూస్ రాకపోవడంతో కొంత నిరుత్సాహపడ్డారు. అయితే వెనకడుగు వేయకుండా వ్యూస్ ఎలా సాధించాలి, ట్యాగ్స్, టైటిల్స్, థంబ్ నెయిల్స్ ఎలా పెట్టాలి లాంటి చిట్కాలను వివిధ టెక్ ఛానల్స్ చూసి నేర్చుకున్నారు. అప్పటి నుంచి ప్రొఫెషనల్ గా వీడియోలు తీయడం మొదలు పెట్టారు. అలా మొదటి నెలలో 90 వీడియోలు పోస్టు చేశారు. భార్గవి వీడియోలకు క్రమంగా వ్యూస్ రావడం మొదలైంది.
నవరాత్రులతో దశ తిరిగింది:
దసరా నవరాత్రుల్లో దుర్గా దేవికి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి, వాటిని ఎలా తయారు చేయాలంటూ వీడియోలు చేశారు భార్గవి. వీటికి ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది భార్గవి చెప్పే విధానం నచ్చి సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మొదలుపెట్టారు. వంటకాలు చాలా బాగున్నాయని, చాలా బాగా వివరిస్తున్నారని పొగుడుతూ కామెంట్లు వచ్చేవి. ఇవి భార్గవికి ఉత్సాహాన్ని ఇచ్చాయి. తర్వాత క్రమంగా యాడ్స్ రావడం మొదలైంది. భార్గవి చేసిన ఆనియన్ సమోసా వీడియో బాగా క్లిక్ అయింది. కేవలం 2 వారాల్లోనే 10 లక్షల వ్యూస్ వచ్చాయి. టమోటా పచ్చడి, పానీపూరి వీడియోలతో సబ్‌స్క్రైబర్లు అమాంతం పెరిగారు.
స్నాక్స్ వీడియోలు, లాక్‌డౌన్ లో ఓవెన్ లేకుండా కేక్ తయారీ వంటకాల వీడియోలతో మంచి ఆదరణ వచ్చింది. యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లోకి భార్గవి చేసిన కేక్ వీడియోలు వచ్చేవి. అన్ని రకాల వంటకాలు ప్రయత్నించే వారు భార్గవి. అలా తన ఫాలోవర్స్ కు మంచి కంటెంట్ ఇస్తుండటంతో వ్యూస్ బాగా వచ్చేవి.
ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో కొత్త రెసిపీ వీడియోలు చేస్తుంటారు భార్గవి. ఇప్పటి వరకు 1,214 వీడియోలు అప్‌లోడ్ చేయగా.. అన్నింటికి కలిపి ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం భార్గవి అమ్మ చేతి వంట ఛానల్ కు 2.91 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.



Click it and Unblock the Notifications
