Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ధనత్రయోదశి రోజు జుట్టు, గోళ్లు కత్తిరించవచ్చా?
సిరిసంపదలు,సౌభాగ్యానికి ప్రతీకగా భావించే దన్ తేరాస్(ధనత్రయోదశి) పండుగ ఈ ఏడాది అక్టోబర్ 18 శనివారం నాడు జరుపుకుంటున్నారు. దీపావళి పండుగ సెలబ్రేషన్స్ ధనత్రయోదశి నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ ఏడాది దీపావళికి రెండు రోజుల ముందు ధనత్రయోదశి వచ్చింది. ఈ రోజు నుంచే 5 రోజుల దీపావళి సంబరాలు వైభవంగా ప్రారంభమవుతాయి. ప్రతి ఇల్లూ దీపాల వెలుగులతో కళకళలాడుతుంది. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరిని పూజిస్తారు. ఈ పవిత్ర రోజున బంగారం, వెండి వంటి లోహాలతో పాటు ఏదైనా స్థిర,చరాస్తులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా మంచిది కాదని భావిస్తారు.
ధనత్రయోదశి రోజు ఏది కొన్నా అది పదమూడు రెట్లు వృద్ధి చెందుతుందని భక్తుల నమ్మకం. అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదని మన పెద్దలు చెబుతారు. వాటిలో ముఖ్యమైనది జుట్టు లేదా గోళ్లు కత్తిరించడం. ఇది లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతుందని నమ్ముతారు. ఇంతకీ ఈ నియమం వెనుక ఉన్న మతపరమైన, శాస్త్రీయ కారణాలు ఏంటో ఇక్కడ చూడండి.

మతపరమైన కారణం
పురాణాల ప్రకారం ధన్ తేరాస్ రోజునే క్షీరసాగర మథనం సమయంలో ఆరోగ్యానికి అధిపతి అయిన ధన్వంతరి అమృత కలశంతో ఉద్భవించాడు. అందుకే ఈ రోజును ఆరోగ్యం, సంపద, దీర్ఘాయువు ప్రసాదించే దినంగా భావిస్తారు. మన శరీరం దైవ ప్రసాదం. అలాంటి శరీరంలోని ఏ భాగాన్ని అయినా ఈ రోజున కత్తిరించడం లేదా తొలగించడం అశుభ సూచకంగా పరిగణిస్తారు. జుట్టు లేదా గోళ్లను కత్తిరించడం అంటే మన శరీరంలోని ఒక భాగాన్ని మనమే వేరు చేసినట్లు అవుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రవహించే పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోయి, నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని నమ్మకం. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తగ్గుతుందని, అందుకే ధన్ తేరాస్, నరక చతుర్దశి, దీపావళి రోజుల్లో ఈ పనులు చేయరాదని పండితులు చెబుతున్నారు.

శాస్త్రీయ దృక్కోణం
కేవలం నమ్మకమే కాకుండా ఈ సంప్రదాయం వెనుక ఒక ఆచరణాత్మకమైన శాస్త్రీయ కారణం కూడా ఉంది. గతంలో కటింగ్ షాపుల్లో ఇప్పుడున్నంత ఆధునిక పరికరాలు ఉండేవి కావు. జుట్టు, గడ్డం గీయడానికి పదునైన స్టీల్ బ్లేడ్స్ ఉపయోగించేవారు. వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉండేది. పండుగకు ముందు ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలనే ముందుజాగ్రత్తతో ఈ రోజుల్లో క్షౌరం చేయించుకోవద్దనే నియమాన్ని పెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం.



Click it and Unblock the Notifications