Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తల ఎత్తుకుని గర్వంగా కూతురికి సెల్యూట్ చేసిన ఐపీసీ ఆఫీసర్, తండ్రి కోరిక నేరవేర్చిన యువతి
ఏఐఎస్ చదివిన యువతికి సెల్యూట్ చేస్తున్న పోలీసు అధికారి మరెవరో కాదు, ఆ ఐఏఎస్ అధికారిణికి ఆయన తండ్రి. అంటే ఆ తండ్రికి ఎంత గర్వకారణమో ఆయన ముఖంలో సంతోషంలో కనిపిస్తోంది, ఈ అనందమైన క్షణానికి తెలంగాణ పోలీస్ అకాడమీ సాక్షిగా నిలిచింది. తెలంగాణలోని రాజ్ బహదూర్ వెంకట రంగారెడ్డి పోలీస్ అకాడమీకి వచ్చిన ఐఏఎస్ కుమార్తెకు తండ్రి పుష్పగుచ్ఛం అందించి సెల్యూట్ చేశారు.
ఐఏఎస్ అధికారిణి అయిన ఆ యువతి పేరు ఉమాహారతి, ఆమె తండ్రి పేరు వెంకటేశ్వర్లు. తెలంగాణ పోలీస్ అకాడమీలోకి ఏఐఎస్ అధికారిణి హోదాలో వచ్చిన కూతురు ఉమాహారతిని చూసిన ఆమె తండ్రి, ఐపీఎస్ అధికారి వెంకటేశ్వర్లు సంతోషానికి అవదులులేకుండాపోయాయి. ఈ ఐఏఎస్ అధికారిణి ఉమాహారతి ట్రైనీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫాదర్స్ డే సందర్భంగా యువతి వీడియో వైరల్ అవుతోంది. తమ పిల్లలు ఎంతో ఎత్తుకు ఎదగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, తమ కూతురు లేదా కొడుకు వారికంటే ఉన్నతమైన పదవిని పొందినప్పుడు తల్లిదండ్రుల ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. ఇక్కడ కూడా తండ్రి వెంకటేశ్వర్లు ఐపీఎస్ అధికారి. అయితే తన కూతురు ఉమాహారతి తనకంటే చాలా పెద్ద ఆఫీసర్ అని తండ్రి సంతోషిస్తున్నాడు.
తెలంగాణలోని సూర్యాపేటలోని సీతారాంనగర్, హజూర్ నగర్‌కు చెందిన ఉమాహారతి, హైదరాబాద్ ఐఐటీలో ఇంజనీరింగ్ చేసింది. ఉమాహారతికి 28 ఏళ్ల వయస్సు. యూపీఎస్ సీ 2022లో ఉమాహారతి ఆల్ ఇండియా ర్యాంక్ 3వ స్థానంలో నిలిచారు. ఐఏఎస్ అధికారి అయిన ఉమాహారతికి ఆమె తండ్రి వెంకటేశ్వర్లు చాలా గర్వంగా ఫీలై సెల్యూట్ చేస్తున్నారు. ఉమాహారతి తల్లి గృహిణి, తండ్రి వెంకటేశ్వర్లు పోలీసు అధికారి. ఆమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.
తన కూతురిని ఐఏఎస్ అధికారిని చేయాలనే కల ఆ తండ్రికి ఉంది, ఈ విషయాన్ని కూతురు ఉమాహారతికి చెప్పగా తన తండ్రి కోరికను నెరవేర్చడానికి కూతురు చాలా కష్టపడింది. నాలుగుసార్లు ప్రయత్నించినా ఉమాహారతి ప్రిలిమ్స్ పాస్ కాకపోవడంతో చాలా బాధపడినా తండ్రి మాత్రం చదువుపైనే దృష్టి సారించిన కూతురుని ప్రోత్సహించారు. ఇప్పుడు ఉమాహారతి అనుకున్నట్లు ఐఏఎస్ అధికారి అయ్యారు.



Click it and Unblock the Notifications