Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Viral ideo : అత్యంత పొట్టి మహిళను ఒంటి చేత్తో ఎత్తిన ఖలీ.. వీడియో వైరల్..!
నైన్టీస్ కిడ్స్‌కి ద గ్రేట్ ఖలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ తో ఛాంపియన్ అన్న విషయం తెలిసిందే. అతనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వుంటాయ్. తాజాగా మరో వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఖలీ భారీ ఆకారం గురించి మనకు తెలిసిందే. అంత ఎత్తైన భారీ ఆకారం గల మనిషి ప్రపంచంలో అత్యంత పొట్టైన జ్యోతి ఆమ్గేను కలుసుకుంటే ఎలా వుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ద గ్రట్ ఖలీ పేరుతో సోషల్ మీడియాలో ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను కలిగి వున్నారు. భారీ ఫాలోయింగ్ వున్న ఖలీ, తన వీడియోలతో ఫాలోవర్లను అలరిస్తూ వుంటారు. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రపంచంలో అత్యంత పొట్టైన వ్యక్తిగా జ్యోతి ఆమ్గే గిన్నిస్ రికార్డును సాధించారు. ప్రస్తుతం ఆమె ద గ్రేట్ ఖలీని కలుసుకున్నారు. ఇద్దరూ కలుసుకున్న తరువాత జ్యోతి ఆమ్గేను ఖలీ తన కుడిచేతితో ఆమెను ఎత్తి వీడియోలో ఫాలోవర్లకు చూపించాడు. ఈ వీడియో మంచి ఎంటర్టైనింగ్‌గా వుండడంతో అప్‌లోడ్ చేసిన కొన్ని నిమిషాల్లో వీడియో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఖలీ పోస్ట్ చేసిన ఈ వీడియో 105 మిలియన్ల వ్యూస్‌ను దాటింది. ఖలీ, జ్యోతి ఆమ్గే వీడియో చూసి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఖలీ చేసిన పనిని తప్పు బట్టారు. ఒక మహిళను అలా ఒక చేత్తో ఎత్తడం సాంప్రదాయం అనిపించుకోదు అని కామెంట్ చేశారు.
ద గ్రేట్ ఖలీ ఇన్స్‌టాగ్రామ్‌లో 10.2 మిలియన్ల ఫాలోవర్లను కలిగి వున్నారు. ఆయన కేవలం 247 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు 6 వేలకు పైగా వీడియోలు పోస్ట్ చేసిన ఖలీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటారు.

ద గ్రేట్ ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రానా. 2000 సంవత్సరంలో రెస్లింగ్‌లో అడుగుపెట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్‌పుత్ కుటుంబంలో ఖలీ 1972 ఆగస్టు 27వ తేదీన .జన్మించారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఖలీ పంజాబ్ పోలీస్‌లో ఉద్యోగం సాధించి పనిచేశారురు తరువాత అమెరికా వెళ్తి డబ్ల్యూడబ్ల్యూఈలో చేరారు. తరువాత పాపులారిటీని సంపాదించి ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపును సాధించుకున్నారు. పలు హాలీవుడ్ సినిమాల్లో కూడా ఖలీ నటించారు. ప్రస్తుతం బీజేపీ పార్టి నేతగా కూడా కొనసాగుతున్నారు.
మహారాష్ట్రకు చెందిన జ్యోతి ఆమ్గే 1993 డిసెంబర్ 16న జన్మించారు. 2011లో అత్యంత పొట్టి మహిళగా ఆమె గిన్నిస్ రికార్డును సాధించారు. ఆమె ఎత్తు 62.8 సెంటిమీటర్లే. 2012 బిగ్‌బాస్ 6 సీజన్‌లో పార్టిసిపెంట్‌గా కూడా వ్యవహరించారు. జన్యుపరంగా వచ్చిన వ్యాధి కారణంగా జ్యోతి ఎత్తు అంత వరకే ఆగిపోయిందని వైద్యులు చెబుతున్నారు. ఇటు గిన్నిస్ రికార్డు సాధించడమే కాకుండా సినిమాల్లో కూడా ఆమె నటించారు.
ద గ్రేట్ ఖలీ, జ్యోతి ఆమ్గే ఇద్దరూ జన్యుపరమైన సమస్య వల్ల వారి శరీరం అలా తయారైందని పరిశోధకులు తేల్చారు. ఇద్దరు సోషల్ మీడియా స్టార్ట్ నెటిజన్లను అలరిస్తూనే వున్నారు.



Click it and Unblock the Notifications