Latest Updates
-
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా..
హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఫస్ట్ నైట్, సోషల్ మీడియాలో వీడియో పెట్టిన వరుడు
గత కొన్ని సంవత్సరాలుగా వ్లాగ్‌లు, రీల్స్ చేసేవారి సంఖ్య బాగా పెరిగిపోయాయి. నిలబడినా, కుర్చున్నా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నేటి యువత లైక్స్, కామెంట్స్ కోసం గోప్యత పాటించడం లేదు. ఎప్పుడు కొత్తగా ఏదైనా చేద్దామా అని ఆలోచిస్తూ అన్ బాక్సింగ్ పేరుతో వీడియోలు కూడా తీస్తున్నారు. వ్లాగ్ క్రేజ్ పెరిగితే ఏం జరుగుతుందో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఓ యువకుడు తన ఫస్ట్ నైట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం కలకలం రేపుతోంది.
వైరల్ వీడియోలో ఏముంది?
ఓ యువకుడు తన భార్యకు ఫోన్ ఇచ్చి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమని అన్నాడు. అప్పుడు ఆమె హాయ్ చెప్పింది. ఈ రోజు మా ఫస్ట్ నైట్ అంటూ ఆ యువకుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. మా ఫస్ట్ నైట్ ఎలా ఉందని ఆ యువకుడు ఆ వీడియోలో సిగ్గులేకుండా అడిగాడు. అతని భార్య ఫస్ట్ నైట్ ఇంకా ఎక్కడ జరిగింది అంటూ నవ్వింది. అప్పుడు ఆ యువకుడు కెమెరాను గది చుట్టూ తిప్పుతూ మా ఫస్ట్ నైట్ జరిగే గది ఇదే అని చూపించాడు.

మంచాన్ని గులాబీలు, పూలతో బాగా అలంకరించిన విషయాన్ని ఆ వీడియోలో చూపించాడు. ఈ అలంకారం కంటే నా భార్య జాహ్నవి చాలా బాగుంటుంది అంటూ ఆ యువకుడు ఆమె బుగ్గపై ముద్దులు పెట్టాడు. భార్యకు ముద్దు పెట్టినప్పుడు వీడియో బ్లర్ చేశారు. భార్య జాహ్మవి ఫస్ట్ నైట్ కి రెడీ అయింది. అప్పుడు భర్త నీకు అంత పెద్ద ముక్కుపుడక ఎందుకు అని అడిగాడు. ఇంట్లో మా వదిన ముక్కుపుడక పెట్టుకోమని చెప్పారు కాబట్టి తాను పెట్టుకున్నానని పెళ్లికూతురు జాహ్నవి చెప్పింది.
ఇప్పుడు భార్య అతన్ని మంచం మీద కూర్చోమని అడిగింది. దానికి సమాధానంగా భర్త దుపట్టా వేసుకున్న భార్యను నువ్వకూడా కూర్చో అంటాడు. ఈ 31 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
డైరీ మిల్క్ అనే X ఖాతాలో ఇటీవల ఈ వీడియో అప్‌లోడ్ చేశారు. దీనికి ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా పంచుకుంటున్నారు.

కొంతమంది అబ్బాయిలు తదుపరి వీడియో కోసం ఎదురు చూస్తున్నామని, వీలైనంత త్వరగా అప్ లోడ్ చెయ్యండి, మేము ఇక్కడ వేచి చూస్తున్నాము అని కామెంట్ చేశారు. కొంతమంది పరిణితి చెందిన వారు కూడా వీడియోను చూసి మొగుడికి సీరియస్‌గా క్లాస్ తీసుకున్నారు. ఫస్ట్ నైట్ రోజు బెడ్ రూమ్ లో వీడియోలు తీసి అప్ లోడ్ చేసే మహానుభావులు కూడా ఉన్నారా అని కొందరు కామెంట్ చేశారు.
రీల్స్ చెయ్యడానికి ఓ హద్దు ఉంటుందని, ఏకాంతంగా జరగవలసిన ఫస్ట్ నైట్ ను వీవ్స్ కోసం, లైక్స్ కోసం ఇలా ప్రైవేట్ విషయాలను, వ్యక్తిగత విషయాలను, బెడ్ రూమ్ లో భార్యకు సంబంధించిన విషయాలను పబ్లిక్ గా చెయ్యడం వీడి మూర్ఖత్వాన్ని ఎత్తి చూపిస్తోందని క్లాస్ పీకారు. ప్రైవేట్ క్షణాలు, ప్రైవేట్ విషయాలు రహస్యంగా ఉంచాలని, ఇలా సిగ్గులేకుండా బహిరంగంగా చర్చించకూడదని, నేటి యువతకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారని కొందరు నెటిజన్లు ఆ దంపతుల మీద మండిపడుతున్నారు.



Click it and Unblock the Notifications
