Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
లైంగిక సంక్రమణ వ్యాధితో నెహ్రూ మరణించారా? బట్టలతో ఆయనను ఎందుకు దహనం చేశారు?
భారతదేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారత నిర్మాతగా పేరుగాంచిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు నవంబర్ 14ని ప్రతి ఏటా బాలల దినోత్సవంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో బాలల దినోత్సవం యూనివర్శల్ చిల్డ్రన్స్ డే గా నవంబర్ 20న జరుపుకునేటోళ్లు.
కానీ నెహ్రూ మరణం తర్వాత పిల్లల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ,ఆప్యాయత గుర్తుచేసుకుంటూ ఆయన జన్మించిన నవంబర్ 14 బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. పండిట్ నెహ్రూ జీవితం ఎంత బహిరంగంగా ఉండేదో, ఆయన మరణంపై అనేక వివాదాలు, వదంతులు ప్రచారంలో ఉన్నాయి.

అధికారిక కారణం ఏమిటి?
మెడికల్ రికార్డుల ప్రకారం జవహర్ లాల్ నెహ్రూ మరణానికి ప్రధాన కారణం గుండెపోటు (Aortic Rupture). మరణానికి కొన్నేళ్ల ముందు నుంచే ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశం ఓటమి పాలుకావడం ఆయనను మానసికంగా, శారీరకంగా కుంగదీసిందని చెబుతారు.
1964 జనవరిలో భువనేశ్వర్ లో ఆయనకు తీవ్రమైన స్ట్రోక్ వచ్చింది. దాని నుండి కొంత కోలుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. 1964 మే 23 నుంచి మే 26 వరకు ఆయన విశ్రాంతి కోసం డెహ్రాడూన్ వెళ్లారు. 26న తిరిగి న్యూ ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ లోని తన అధికారిక నివాసినికి తిరిగి వచ్చారు.
అయితే మరుసటి రోజు అంటే మే 27, 1964న తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన సృహ కోల్పోయారు..మధ్యాహ్నాం 1:44 గంటల సమయంలో ఆయన మరణించినట్లు కన్ఫర్మ్ చేశారు డాక్టర్లు. ఇది డాక్టర్స్ చే ధృవీకరించబడిన, చారిత్రాత్మకంగా అంగీకరించబడిన వాస్తవం.
లైంగిక సంక్రమణ వ్యాధి (STD) వదంతి నిజమేనా?
నెహ్రూ మరణంపై వ్యాపించిన అత్యంత వివాదాస్పదమైన వదంతులలో ఒకటి.. ఆయన సిఫిలిస్ వంటి లైంగిక సంక్రమణ వ్యాధి (STD) కారణంగా మరణించారనేది. అయితే ఈ ఆరోపణకు ఎలాంటి చారిత్రక లేదా వైద్యపరమైన ఆధారాలు లేవు. ప్రముఖ చరిత్రకారులు, ఆయనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ల రికార్డులు ఈ వాదనను పూర్తిగా నిరాధారమైనదిగా కొట్టిపారేస్తున్నారు.
నెహ్రూ వ్యక్తిగత జీవితం, ఆయన మోడ్రన్ లైఫ్ స్టైయిల్, ముఖ్యంగా ఎడ్వినా మౌంట్ బాటన్(భారతదేశానికి చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ భార్య)తో ఆయనకున్న స్నేహం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఆయన రాజకీయ ప్రత్యర్థులు, కొన్ని వర్గాలు ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశంతో ఇలాంటి పుకార్లను సృష్టించాయని విశ్లేషకులు భావిస్తారు. దీనికి విశ్వసనీయమైన ఆధారం ఒక్కటి కూడా అందుబాటులో లేదు.

బట్టలతో ఎందుకు దహనం చేశారు?
ఆయన భౌతిక కాయాన్ని బట్టలతో సహా దహనం చేయడం కూడా అనేక ఊహాగానాలకు దారితీసింది. ఆయన శరీరంపై ఉన్న వ్యాధి లక్షణాలను దాచడానికే అలా చేశారని కొందరు వాదిస్తారు. కానీ దీనికి అత్యంత ఆమోదయోగ్యమైన వివరణ వేరే ఉంది.
నెహ్రూ తనదైన శైలికి, ముఖ్యంగా ఆయన ధరించే షేర్వానీ, కోటుకు తగిలించుకునే గులాబీ పువ్వుతో దేశ ప్రజలకు సుపరిచితులు. ఒక దేశ నాయకుడిగా, ప్రజల మనస్సులో నిలిచిపోయిన ఆయన రూపాన్ని గౌరవిస్తూ, ఆయన్ను చివరిసారిగా అదే గౌరవప్రదమైన వస్త్రధారణతో పంపాలనే ఉద్దేశంతో అలా చేసి ఉండవచ్చు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇది ఒక ప్రభుత్వ లాంఛనం, గౌరవ సూచకంగా భావించాలే తప్ప, ఇందులో ఎలాంటి రహస్యం లేదని అంటున్నారు.



Click it and Unblock the Notifications











