Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం? బాబా రాందేవ్ చెప్పిన ఈ చిట్కా పాటిస్తే జుట్టు నల్లగా మెరిసిపోతుంది!
ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే చాలామందికి జుట్టు తెల్లబడటం లేదా బూడి రంగులోకి మారిపోతుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం,ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి వంటివి దీనికి ప్రధాన కారణాలుగా చెబుతుంటారు నిపుణులు. అయితే కొందరు లివర్ సంబంధిత సమస్యల వల్ల కూడా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటుంటారు. ఏది ఏమైనా ఒక్కసారి జుట్టు రంగు మారిన తర్వాత మళ్లీ నల్లగా మారాలంటే కష్టమని డాక్టర్లు చెబుతున్నప్నటికీ ఆయుర్వేదం మాత్రం కొన్ని సహజ చిట్కాలతో తెల్లబడిన జుట్టును మళ్లీ నల్లగా మార్చడం సాధ్యమేనని చెబుతోంది.
బాబా రాందేవ్ చెప్పిన అద్భుతమైన చిట్కా ఇదే
ప్రముఖ యోగా గురువుగా పేరుపొందిన బాబా రాందేవ్ ఓ టీవీ ఛాన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..బూడిద రంగులోకి మారిన జుట్టు లేదా తెల్ల వెంట్రుకలు తిరిగి నల్లబడటానికి బాబా రాందేవ్ ఓ చిట్కా చెప్పారు. బాబా రాందేవ్ చెప్పిన ఆ రహస్యం ఏంటంటే..ఉసిరికాయ రసం, కలబంద రసం, గుడిచి అనే మెక్క నుంచి తీసిన గులాంచ రసం క్రమం తప్పకుండా తీసుకోవడమే. ఈ మూడింటి కలయిక ఒక శక్తివంతమైన టానిక్ లా పనిచేస్తుందని బాబా రాందేవ్ చెప్పారు, వీటిలో మీ జుట్టుకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయని..ఇది కేవలం తెల్ల జుట్టు సమస్యను తగ్గించడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుందని చెప్పారు. మీ జుట్టు సహజంగా నల్లగా,ఒత్తుగా,ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే బాబా రాందేవ్ చెప్పిన ఈ చిట్కాను తప్పకుండా ప్రయత్నించండి. ప్రకృతి ప్రసాదించిన ఈ రసం మీ జుట్టుకు ఓ వరంలా మార్చొచ్చు.

ఎలా తీసుకోవాలి
జుట్టు నెరిసినవాళ్లు ఉదయం పూట కలబంద,ఉసిరి కలిపిన రసాన్ని తాగాలని బాబా రాందేవ్ తెలిపారు. ఈ మూలికల్లో ఎన్నో పోషకాలు ఉండి జుట్టు నెరిసే సమస్యను తగ్గిస్తాయి. ఉసిరి జుట్టును నల్లగా చేస్తుంది,కలబంద జుట్టును బలంగా మెరిసేలా చేస్తుంది. అదేవిధంగా,నైట్ డిన్నర్ తర్వాత ఓ గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా చ్యవనప్రాష్ కలిపి తాగాలని..ఈ సింపుల్ చిట్కా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని,జుట్టును సహజంగా నల్లబరుస్తుందని చెప్పారు.
యోగాతో మీ జుట్టుకు జీవం
తెల్ల రంగులో మారిన జుట్టు మళ్లీ నల్లగా మారాలంటే యోగా కూడా ముఖ్యమేనని..క్రమం తప్పకుండా శీర్షాసనం,సర్వాంగాసనం వంటి యోగాసనాలను చేయాలని బాబా రాందేవ్ సూచించారు. ఈ ఆసనాలు నెత్తికి రక్త ప్రసరణను పెంచుతుంది..తద్వారా అకాలంగా జుట్టు నెరవడం తగ్గిపోతుంది.
ఇది గుర్తుంచుకోండి
మీ ఆహారంలో పచ్చి కూరగాయలు ఎక్కువగా తినాలి, రోజూ 2 నిమిషాలు గోళ్లను ఒకదానితో మరొకటి రుద్దకం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని బాబా రాందేవ్ చెప్పారు.
Disclaimer: ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు లేదా ఇప్పటికే ఏదైనా మెడిసిన్ వాడుతున్నవాళ్లు సంబంధిత నిపుణులను సంప్రదించిన తర్వాతే దీనిని పాటించాలి.



Click it and Unblock the Notifications