Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
అంతరిక్షంలో పెరిగిపోతున్న ట్రాఫిక్..స్పేస్ లో అసలు ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయో తెలుసా..
స్పేస్ లేదా అంతరిక్షానికి సంబంధించిన ఏ సమాచరమైనా తెలుసుకోడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. మన తలపై ఉన్న నిర్మలమైన ఆకాశం వెనుక మానవ మేధస్సు సృష్టించిన ఒక అదృశ్య ప్రపంచం ఉంది. ఈ డిజిటల్ ప్రపంచంలో ఎక్కువగా వినబడే పేరు శాటిలైట్. దీని ఆధారణంగా ప్రస్తుతం మనకు అనేక పనులు సులువుగా జరిగిపోతున్నాయి. సమాచారం వ్యవస్థ నుంచి వ్యవసాయం వరకు, వాతావరణ అంచనాల నుంచి విపత్తు నిర్వహణ దాకా అనేక రంగాల్లో శాటిలైట్ ద్వారా మనం సేవలు పొందుతుంటాయి. భారత్,అమెరికా,రష్యా సహా చాలాదేశాలు తమ శాటిలైట్లను తరుచూ స్పేస్ లోకి పంపుతుండటం మనం చూస్తుంటాం. అయితే అసలు స్పేస్ లో ఇప్పటివరకు ఎన్ని శాటిలైట్లు ఉన్నాయో మీకు తెలుసా?
శాటిలైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ 'ఆర్బిటింగ్ నౌ' ప్రకారం.. ప్రస్తుతం భూమి చుట్టూ దాదాపు 12952 క్రియాశీల వస్తువులు కక్ష్యలో ఉన్నాయి. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది..2025 ప్రారంభంలోనే 145 కొత్త శాటిలైట్స్ ఈ లిస్ట్ లో చేరాయి. ఈ ఉపగ్రహాలు అంతరిక్షంలో వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తాయి. కొన్ని భూమికి దగ్గరగా ఉండే లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లో పరిభ్రమిస్తే, మరికొన్ని వేల కిలోమీటర్ల దూరంలోని మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO) లేదా జియోస్టేషనరీ ఆర్బిట్ (GEO)లో స్థిరంగా ఉంటాయి. చిన్న ఉపగ్రహాలు ఎక్కువగా LEOలో సంచరిస్తుంటే.. కమ్యూనికేషన్స్, వాతావరణ అంచనా వంటి కీలక సేవలు అందించే భారీ ఉపగ్రహాలు GEO, MEO కక్ష్యలలో తిరుగుతుంటాయి. ఈ అంతరిక్ష సామ్రాజ్యాన్ని 105 దేశాలు, మల్టీనేషనల్ కంపెనీలు పంచుకుంటున్నాయి.

ఈ ఉపగ్రహాల పోటీ కేవలం సంఖ్యలకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఒక దేశం సాంకేతిక పరాక్రమానికి, వ్యూహాత్మక శక్తికి, మరియు ఆర్థిక ప్రగతికి నిదర్శనం. కమ్యూనికేషన్ నుండి రక్షణ వరకు, నావిగేషన్ నుండి వాతావరణ మార్పుల అధ్యయనం వరకు, మన జీవితంలోని ప్రతి అంశాన్ని ఈ ఆకాశంలోని కళ్ళు ప్రభావితం చేస్తున్నాయి. ఈ పోటీ తీవ్రమవుతున్న కొద్దీ అంతరిక్షంలో ట్రాఫిక్ నిర్వహణ, వ్యర్థాల సమస్య వంటి కొత్త సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి
అంతరిక్షంలో అత్యధిక శాటిలైట్స్ ఉన్న టాప్ 10 దేశాలు
యునైటెడ్ స్టేట్స్
స్పేస్ లో అమెరికా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇటీవలి గణాంకాల ప్రకారం కక్ష్యలో ఏకంగా 8,530 శాటిలైట్స్ తో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఈ భారీ సంఖ్య వెనుక నాసా (NASA), రక్షణ శాఖ (DoD) వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు, ప్రైవేట్ కంపెనీల పాత్ర కీలకం. ముఖ్యంగా ఎలాన్ మస్క్ కి చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX)కంపెనీ తన 'స్టార్‌లింక్' ప్రాజెక్ట్ ద్వారానే 7400కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించడంలో సంచలనం సృష్టిస్తోంది.
రష్యా
ఒకప్పటి సోవియట్ యూనియన్ అంతరిక్ష చరిత్రకు వారసురాలైన రష్యా..తన స్థానాన్ని తిరిగి పటిష్టం చేసుకుంటోంది. ప్రస్తుతం n2yo.com ప్రకారం 1559 ఉపగ్రహాలతో రెండో స్థానంలో ఉన్న రష్యా..2036 నాటికి ఈ సంఖ్యను 2600కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోస్కోస్మోస్ స్టేట్ స్పేస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కమ్యూనికేషన్స్, భూ పరిశీలన రంగాలలో తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూస్తోంది.
చైనా
అంతరిక్ష రంగంలో చైనా ఒక బలమైన శక్తిగా ఎదుగుతోంది. ప్రభుత్వ, సైనిక, వాణిజ్య అవసరాల కోసం సుమారు 906 ఉపగ్రహాలను నిర్వహిస్తోంది. లాంగ్ మార్చ్ వంటి శక్తివంతమైన రాకెట్ల ద్వారా నిరంతరం ఉపగ్రహాలను ప్రయోగిస్తూ అమెరికా ఆధిపత్యానికి సవాలు విసురుతోంది. సొంత స్పేస్ స్టేషన్, నావిగేషన్ సిస్టమ్ (బైడూ)లతో చైనా తన అంతరిక్ష ప్రణాళికలను వేగంగా అమలు చేస్తోంది.
యూకే
బ్రిటన్ సుమారు 763 ఉపగ్రహాలతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇవి ప్రధానంగా సైనిక నిఘా, కమ్యూనికేషన్స్, శాస్త్రీయ పరిశోధనల కోసం ఉపయోగించబడుతున్నాయి. వాణిజ్య అంతరిక్ష రంగంలో కూడా పెట్టుబడులు పెడుతూ యూరోపియన్ స్పేస్ సెక్టార్ లో తనదైన ముద్ర వేస్తోంది.
జపాన్
ఖచ్చితత్వానికి, సాంకేతిక ఆవిష్కరణలకు మారుపేరైన జపాన్, కక్ష్యలో 203 ఉపగ్రహాలను కలిగి ఉంది. ముఖ్యంగా, వారి క్వాసీ-జెనిత్ శాటిలైట్ సిస్టమ్ (QZSS) అత్యంత కచ్చితమైన నావిగేషన్ సేవలను అందిస్తుంది. ప్రభుత్వ, సైనిక, శాస్త్రీయ రంగాలలో జపాన్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
ఫ్రాన్స్
ఫ్రాన్స్ 100కు పైగా ఉపగ్రహాలతో యూరోప్ లో కీలక పాత్ర పోషిస్తోంది. అధిక రిజల్యూషన్ చిత్రాలను అందించే భూ పరిశీలన ఉపగ్రహాలు, సైనిక నిఘా, స్పేస్ డిఫెన్స్ టెక్నాలజీలపై ఫ్రాన్స్ దృష్టి సారించింది. యూరోపియన్ ఉపగ్రహ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ఇది ముందుంది.
ఇండియా
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తక్కువ ఖర్చుతో అత్యద్భుతమైన విజయాలు సాధిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సుమారు 136 క్రియాశీల ఉపగ్రహాలతో భారతదేశం ఈ జాబితాలో సగర్వంగా నిలిచింది. చంద్రయాన్-2 ఆర్బిటర్, ఆదిత్య-L1 వంటి డీప్ స్పేస్ మిషన్లతో పాటు నావిగేషన్ (NavIC), కమ్యూనికేషన్, భూ పరిశీలన రంగాలలో మన ఉపగ్రహాలు కీలక సేవలు అందిస్తున్నాయి. రాబోయే మూడేళ్లలో మరో 100-150 ఉపగ్రహాలను ప్రయోగించి జాతీయ భద్రతను, సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

జర్మనీ
జర్మనీ సుమారు 82 ఉపగ్రహాలతో అంతరిక్షంలో తన ఉనికిని చాటుతోంది. అయితే భవిష్యత్తులో తన సైనిక అంతరిక్ష సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవడానికి సిద్ధమవుతోంది. 2029 నాటికి సొంత ఉపగ్రహ కూటమిని నిర్మించాలనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో జర్మనీ ఒక చారిత్రాత్మక ముందడుగు వేస్తోంది.
కెనడా
కెనడా దాదాపు 64 ఉపగ్రహాలతో భూ పరిశీలన, కమ్యూనికేషన్స్, శాస్త్రీయ పరిశోధనలపై దృష్టి పెట్టింది. అంతర్జాతీయ సహకారంలో కెనడా ముందుంటుంది. MDA వంటి సంస్థల ద్వారా డీప్ స్పేస్ మిషన్లు, మానవసహిత అంతరిక్ష యాత్రలలో భాగస్వామిగా ఉంటూ తన ప్రాముఖ్యతను నిలుపుకుంటోంది.
ఇటలీ
సుమారు 66 ఉపగ్రహాలతో ఇటలీ ఈ జాబితాలో పదో స్థానంలో ఉంది. పరిశీలన, కమ్యూనికేషన్స్ రంగాలపై దృష్టి సారించిన ఇటలీ భవిష్యత్తు కోసం భారీ ప్రణాళికలు రచిస్తోంది. IRIDE (34 ఉపగ్రహాలు), ప్రతిపాదిత నేషనల్ కాన్స్టెలేషన్ (100 ఉపగ్రహాలు) ప్రాజెక్టులతో 2030 నాటికి తన అంతరిక్ష ఉనికిని విస్తరించనుంది.



Click it and Unblock the Notifications
