Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇది యాపారం: శిల్పా శెట్టి బిజినెస్ ఇదే..ఆ ఒక్క పని చేసి కోట్లు కొల్లగొట్టిందిగా..ఆస్తుల విలువ ఎంతో తెలుసా..
ఒకప్పుడు తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్నబాలీవుడ్ అందాల తార శిల్పాశెట్టి.. వెండితెరపైన మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేసింది. స్టైలిష్, ఫిట్‌నెస్ ఐకాన్ గా కూడా మారిన శిల్పా శెట్టి లగ్జరీ లైఫ్ స్టైయిల్ తరచుగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అసలు శిల్పా శెట్టికి ఏమేం ఆస్తులు ఉన్నాయి..ఆమె చేసే వ్యాపారాలు ఏంటీ? సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ఎలా ఎదిగింది? ఆమె లగ్జరీ లైఫ్ స్టైయిల్ కి సంబంధించిన అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు చూద్దాం.
తక్కువ పెట్టుబడితో భారీగా
శిల్పాశెట్టి ఒక సక్సెస్ ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కూడా. 8 ఏళ్ల క్రితం ఓ చిన్న బేబీ ప్రొడక్ట్ కంపెనీలో శిల్పా శెట్టి పెట్టుబడి పెట్టింది. అప్పుడు ఆ కంపెనీ విలువ కేవలం రూ.35 కోట్లు మాత్రమే. అయితే ఇప్పుడు అదే కంపెనీ ఏకంగా 'యూనికార్న్' క్లబ్ లో చేరిపోయింది. ఆ కంపెనీ ప్రస్తుత విలువ అక్షరాలా 1 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.7,500 కోట్లకు పైమాటే. శిల్పాశెట్టి తన తెలివైన వ్యాపార నిర్ణయాలతో ఈ అద్భుతం సృష్టించింది.

శిల్పా పెట్టుబడి మంత్రం ఏంటో తెలుసా?
ఒక ఇంటర్వ్యూలో శిల్పా శెట్టి తన పెట్టుబడి రహస్యం గురించి తెలిపింది. 8 సంవత్సరాల క్రితం ఆ బేబీ ప్రొడక్ట్ కంపెనీ వ్యవస్థాపకులు వరుణ్,గజల్ అలాగ్ లను కలిశానని..వారి కంపెనీ తయారుచేసే బేబీ ప్రొడక్ట్స్, ముఖ్యంగా తన పిల్లల కోసం తయారుచేసిన ఉత్పత్తులు తనను బాగా ఆకట్టుకున్నాయని శిల్పా శెట్టి చెప్పింది. పిల్లల చర్మం సున్నితమైనది కాబట్టి.. వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తాను నమ్మానని.. ఆ సమయంలో కంపెనీ దగ్గర బ్రాండ్ అంబాసిడర్ కు ఇచ్చేంత డబ్బు లేకపోవడంతో శిల్పా ఒక తెలివైన ప్రతిపాదన చేసిందట. నాకు ఎలాంటి రెమ్యునరేషన్ అక్కర్లేదు..కానీ కంపెనీలో వాటా ఇవ్వండి అని అడిగారట. అలా ఆమె ఆ కంపెనీలో పెట్టుబడిదారుగా మారిపోయారు.
పెట్టుబడి పెట్టింది కొంచెం..లాభం మాత్రం కోట్లలో
2018లో శిల్పా శెట్టి కేవలం రూ.6.7 కోట్లు పెట్టుబడి పెట్టి..కంపెనీలో 16 లక్షల షేర్లను పొందారు. 2023లో ఆ కంపెనీ IPOకి వచ్చిన తర్వాత శిల్పా శెట్టి.. పెట్టుబడి అమాంతం రూ.39 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా 2024లో ఆమె తన 13.93 లక్షల షేర్లను రూ.45.13 కోట్లకు అమ్మేశారు. ఇప్పుడు శిల్పా శెట్టి దగ్గర ఉన్న షేర్ల విలువ దాదాపు రూ.5.42 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
శిల్పా శెట్టి ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఓ రిపోర్ట్ ప్రకారం శిల్పా శెట్టి నికర విలువ దాదాపు రూ.134 కోట్లు. ముంబైలోని జుహులో కినారా అనే ఒక బంగ్లాలో శిల్పా తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. బాలీవుడ్‌లో సొంత ప్రైవేట్ జెట్ ఉన్న స్టార్స్ చాలా తక్కువ.. వారిలో శిల్పా,రాజ్ కుంద్రా ఒకరు.
రాజ్ కుంద్రా ఆస్తుల విలువ ఎంతంటే
రాజ్ కుంద్రా నికర ఆస్తుల విలువ దాదాపు రూ.2,800 కోట్లు. లండన్‌లో ఒక విలాసవంతమైన విల్లా, చాలా డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ లు కూడా ఉన్నాయి.
యోగా రహస్యం
శిల్పా శెట్టి యోగాను ఎంతగా ప్రోత్సహిస్తారో మనందరికీ తెలిసిందే. ఆమె ఫిట్‌గా ఉండటానికి.. ప్రతిరోజూ యోగా చేయడం ఒక ముఖ్య కారణం.



Click it and Unblock the Notifications