Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
శని దేవుడికి ఇష్టమైన రాశులు.. ధనం, కీర్తి ప్రతిష్టలు పొందగలిగే రాశులు ఏవంటే?
గ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహం శనిగ్రహం. శని గ్రహ ప్రభావం అందరిపై ఉంటుంది. జాతకంలో శని అనుకూలంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అదే శని దేవుడు ఆగ్రహంగా ఉంటే తీవ్రమైన సమస్యలు వేధిస్తాయి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడిని కర్మ ప్రదాతగా పరిగణిస్తారు. శనిదేవుని అనుగ్రహం లభిస్తే రాజును చేస్తాడు.. లేదంటే సమస్యల వలయంలో పడేస్తాడని నమ్ముతారు.
శనిదేవుడు మనం చేసిన కర్మ ఆధారంగా అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తాడని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. మంచి కర్మలు చేసే శని దేవుడు సంతోషించి అనుగ్రహిస్తాడని, చెడు కర్మల వల్ల శని దేవుడు ఆగ్రహించి ప్రతికూలతలు సృష్టిస్తాడని అంటారు. అయితే శని దేవునికి కొన్ని రాశుల వారు అంటే అమితమైన ఇష్టం ఉంటుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఆయా రాశుల వారిపై శని దేవుని అనుగ్రహం ఉంటుందని చెబుతారు. ఆయా రాశుల వారిపై శని ప్రభావం తక్కువగా ఉండటమే కాకుండా.. వాళ్లు చేసే కర్మల వల్ల మరింత శని అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.

శనిదేవుడు ఇష్టపడితే ధనవంతులను చేస్తాడు, సమస్యలేవీ లేకుండా జీవితం ఆనందమయం చేస్తాడు, ఆనందం, సంతోషంతో జీవితం చాలా హాయిగా ఉండేలా అనుగ్రహిస్తాడట. ఒకవేళ శనిదేవుడు అసహ్యించుకోవడం మొదలు పెడితే.. సమస్యలు సతమతం చేయడం ప్రారంభిస్తాయని, ఏ పని తలపెట్టినా అందులో అపజయం ఎదురవుతుందని నమ్ముతారు.
కుంభ రాశి
కుంభ రాశి అంటే శని దేవుడిని అత్యంత ప్రీతికరమైన రాశి. ఈ రాశి వారిపై శని ప్రభావం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశి వారిపై శనిగ్రహ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. దీంతో పాటు.. కుంభ రాశి వ్యక్తులు ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీలైనంత వరకు కుంభ రాశి వారు సంతోషంగా ఉంటారు. శని దేవుని ఆశీస్సుల వల్ల కుంభ రాశి వారు జీవితంలో సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు.
మకర రాశి
శని దేవునికి ప్రీతికరమైన మరో రాశి మకర రాశి. శని గ్రహానికి ఇష్టమైన రాశి చక్రాలలో మకరం కూడా ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మకర రాశి వారిపై శనిగ్రహం ఎలాంటి దుష్ప్రభావం చూపించదు. ఈ రాశి వారికి శని గ్రహమే అధిపతి అయినందు వల్ల కూడా మకర రాశి వారిపై శని సానుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారి జాతకంలో శని ఎప్పుడూ ఉత్తమమైన ఉచ్ఛ స్థితిలో ఉంటాడు. మకర రాశి వారు తలపెట్టే పనుల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువే.
తుల రాశి
శనిగ్రహానికి ఇష్టమైన రాశిగా తులా రాశి వారిని పరిగణిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులా రాశిని శని యొక్క ఔన్నత్యానికి ప్రతీకగా చూస్తారు. తులా రాశి వారిపై శని ప్రభావం ఎక్కువ. అనుకూలతను సృష్టించి.. అన్ని పనుల్లో విజయం సాధించేలా తులా రాశి వారిని శని దేవుడు ఎప్పుడూ అనుగ్రహిస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే తులా రాశి వారికి కష్టాలు, సమస్యలు, సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఏవీ ఎక్కువ కాలం ఉండవు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications