Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
శాంతి కావాలంటే ఈ దేశాలకు వెళ్లాల్సిందే.. అత్యంత శాంతియుతమైన దేశాలు ఇవే..!
ఈ భూమిపైనున్న ఏ మనిషికైనా ముందు శాంతి, ప్రశాంతత కావాలి. శాంతి లేకపోతే ఆ స్థలం నరకప్రాయంగా మారుతుంది. శాంతి వుంటేనే ప్రజలు సుఖంగా జీవించగలుగుతారు. తాజాగా విడుదలైన గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో 10 దేశాలు శాంతియుతమైనవిగా తేలింది. ఈ దేశాల్లో ఆర్థిక ప్రగతితో పాటు సాంస్కృతికంగా కూడా అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు.
మొత్తం 163 దేశాలను ఈ లిస్టులో తీసుకున్నారు. అందులో భారత్ గతంలో కంటే కొంత మెరుగైందని గ్లోబల్ పీస్ ఇండెక్స్ లెక్కలు చెబుతున్నాయ్. గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో 163 దేశాల్లో భారత్ 126వ స్థానాన్ని సంపాదించుకుంది.
గోబల్ పీస్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఇచ్చే ముందు మూడు విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒక సామాజిక భద్రత, రెండు ఆ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్నా జాతీయ అంతర్జాతీయ ఘర్షణలు, మూడవది మిలిటరీ సైన్యం. 2023వ సంవత్సరంలో ఈ కింద వున్న పది దేశాలు అత్యంత శాంతియుతమైన దేశాలుగా గుర్తించారు.

లిస్టులో ఐస్‌ల్యాండ్ మొదటి స్థానంలో వుంది, డెన్మార్క్ రెండవ స్థానంలో, ఐర్‌ల్యాండ్ మూడవ స్థానంలో, న్యూజీల్యాండ్ నాల్గవ స్థానంలో, ఆస్ట్రియా ఐదవ స్థానంలో, సింగపూర్ ఆరవ స్థానంలో, పోర్చుగల్ ఏడవ స్థానంలో, స్లొవేనియా ఏడవ స్థానంలో జపాన్ తొమ్మిదవ స్థానంలో, స్విట్జర్లాండ్ 10వ స్థానంలో వుంది.
ఐస్‌ల్యాండ్
చాలా ఏళ్ల నుంచి ఐస్‌ల్యాండ్ అత్యంత శాంతియుత దేశంగా తన స్థానాన్ని నిలుపుకుంది. ఇప్పటికి 17 సార్లు అత్యంత శాంతియుత దేశంగా తన స్థానాన్ని అలాగే నిలపెట్టుకుంది. ఈ దేశంలో వున్న విద్యా వ్యవస్థ కూడ దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.
డెన్మార్క్
అత్యంత శాంతియుతమైన దేశాల జాబితాలో డెన్మార్క్ రెండవ స్థానంలో వుంది. డెన్మార్క్ సైన్యం పై వెచ్చించ్చేది కూడా చాలా తక్కువ. జీడీపీలో కేవలం 4 శాతం మాత్రమే సైన్యంపై ఖర్చు పెడుతుంది.
న్యూజీల్యాండ్
నాల్గవ స్థానాన్ని న్యూజీల్యాండ్ కైవసం చేసుకుంది. గతంలో కొంత హింస జరిగినా ఆ విషయంలో న్యూజాల్యాండ్ లో చాలా మార్పు వచ్చింది. కానీ టాప్ పది శాంతియుత దేశాలు యుద్దంపై ఖర్చు పెట్టే దానికంటే న్యూజీల్యాండ్ ఎక్కువగా ఖర్చు పెడుతోంది.
ఆస్ట్రియా
అత్యంత శాంతియుత దేశంగా ఐదవ స్థానాన్ని ఆస్ట్రియా కైవసం చేసుకుంది. ఆస్ట్రియాలో వుండే విద్యా విధానం శాంతియుత దేశంగా కావడానికి కారణంగా చెప్పుకోవచ్చు.
సింగపూర్
ఆసియాలో సింగపూర్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ సింగపూర్ మిలిటరీపై అధికమొత్తంలో ఖర్చు చేయడం ఆందోళన కలిగించే విషయం. విద్యావ్యవస్థలో మార్పులు తేవడం, క్రైం రేటు తగ్గించడం వల్ల సింగపూర్ శాంతియుత దేశంగా మారింది.
పోర్చుగల్
పోర్చుగల్ అత్యంత శాంతియుతమైన దేశాల్లో ఒకటిగా తన స్థానాన్ని అలాగే నిలుపుకుంది. యూరప్‌లో నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది. విద్యావ్యవస్థే పోర్చుగల్ శాంతియుత దేశంగా నిలవడానికి కారణంగా చెప్పుకోవచ్చు.
స్లొవేనియా
సెంట్రల్ యూరప్‌లో టాప్ టెన్ శాంతియుత దేశాల్లో ఒకటిగా స్లోవేనియా నిలిచింది. శాంతియుత దేశాల్లో 8వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
జపాన్
శాంతియుత దేశాల్లో జపాన్ గతంలో కంటే కంచెం మెరుగైందని చెప్పుకోవచ్చు. ఆసియాలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ కలెక్టివ్ సెల్ఫ్ డిఫెన్స్‌పై చైనా, నార్త్ కొరియా కన్న జపాన్ ఎక్కువగా ఖర్చుపెడుతుంది.
స్విట్జర్లాండ్
ప్రపంచ దేశాల్లో ఆయుధాలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశంగా నిలిచినా శాంతియుత దేశంగా స్థానం సంపాదించుకోవడం విశేషం.



Click it and Unblock the Notifications