Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఈ 4 రాశుల వారు వచ్చే ఏడాదిలోపు ధనవంతులు అవుతారు, మీ రాశి ఉందేమో చూసుకోండి
ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఆల్రెడీ ఉన్న వారు మరింతగా సంపాదించాలని కోరుకుంటారు. లేని వారు ఎక్కువగా సంపాదించి ధనవంతులు కావాలనుకుంటారు. ఆర్థిక సమస్యలు, అప్పులు లేకుండా జీవితం సాఫీగా, ఆనందంగా, హాయిగా సాగాలి అందరికీ కోరికగా ఉంటుంది. అయితే జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక, సంచారం, కలయిక మనుషుల జీవితాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి.
రాశిచక్రాలు, గ్రహాల సంచారం, ఉదయం, అస్తమయం లాంటి చర్యలు కూడా పెను ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి వల్ల కొన్ని రాశుల వారు ప్రతికూలతలు, మరికొన్ని రాశుల వారు అనుకూలతలు ఎదుర్కొంటారు. అలాగే గ్రహాలు ఎప్పుడూ ఒకే దగ్గర ఉండిపోవు. నిత్యం సంచరిస్తూ ఉంటాయి. అలా కొన్ని సార్లు కొన్ని రాశుల వారికి కాలం కలిసి వస్తే, మరికొన్ని సమయంలో ఇతర రాశుల వారికి సమయం అనుకూలిస్తుంది.

అయితే వచ్చే ఏడాది కాలం పాటు రాశి చక్రాలు, గ్రహాల కదలిక, సంచారం, కలయిక, అస్తమయం, ఉదయం, రాజయోగాలు అన్నీ పరిగణనలోకి తీసుకుంటే కొన్ని రాశుల వారికి సంవత్సర కాలం చాలా అనుకూలంగా ఉండనుంది. 4 రాశుల వారికి ఈ సంవత్సరకాలం విశేషంగా కలిసిరానుంది. తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అద్భుతమైన గ్రహాల అనుకూలత వల్ల ఐశ్వర్యం సిద్ధించనుంది. ఆర్థిక పరిస్థితి ఎంతో బాగా మెరుగుపడుతుంది. అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగాల్లో ఉన్న వారు ఎక్కువ ఆదాయం వచ్చే వేరే ఉద్యోగాల్లోకి మారడమో లేదా ప్రమోషన్ లభించడమో జరుగుతుంది. వ్యాపారంలో ఉన్న వారు పెట్టే పెట్టుబడి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాన్ని తీసుకురానుంది. మరి ఆ 4 రాశులు ఏవి.. అందులో మీ రాశి ఉందో.. లేదో.. తెలుసుకోండి.
మేషరాశి:
మేషరాశి వారు సాధారణంగానే చాలా చురుకుగా ఉంటారు. వారు చేసే పనిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కృషి చేస్తారు. కష్టపడటంలో ముందుంటారు. అదే స్థాయిలో ఫలితాలను కూడా అందుకుంటారు. శ్రమించే వ్యక్తులకు ఎప్పుడూ అదృష్టం వెంటే ఉంటుంది అనడానికి మేష రాశి వారు ఆదర్శంగా నిలుస్తారు. రాబోయే సంవత్సర కాలం మేష రాశి వారికి అద్భుతంగా ఉంటుంది.
ఇప్పుడు పడే కష్టానికి కచ్చితమైన అనుకూలమైన ఫలితాన్ని అందుకుంటారు. గ్రహాల గమనం ప్రభావం వల్ల కొన్ని పనులు సక్రమంగా జరిగి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆయాయ పనుల నుంచి లాభాలు పొందుతారు. మేష రాశి వారి సహజ నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వారి పనిలో నమ్మకంగా ఉంటారు. ఇది వారికి మెరుగైన ఫలితాలను ఇస్తుంది. మేష రాశి వారి స్వభావం, గ్రహాల అనుగ్రహం కారణంగా సంపదను సృష్టిస్తారు. త్వరలోనే ధనవంతులు అవుతారు.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి జిజ్ఞాస ఎక్కువ. కొత్త విషయాలను తెలుసుకోవడం, నేర్చుకోవడం, వాటిని పాటించడంలో ముందుంటారు. ఇదే వారి జీవితంలో ఉన్న స్థానాలకు తీసుకెళ్లనుంది. వచ్చే సంవత్సర కాలం వృషభ రాశి వారికి విశేషంగా కలిసిరానుంది. వారు చేసే కొత్త తరహా పనులు గొప్ప ఫలితాలు రానున్నాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన దానికటే ఎక్కువ లాభం పొందుతారు. తెలివిగా చేసే పనులు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. ఆర్థిక లాభం, సంపద, గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.
కన్యరాశి:
కన్యరాశి వారు ఎప్పుడూ విశ్లేషణాత్మకంగా వ్యవహరిస్తారు. ఏ పనినైనా మనస్సు పెట్టి చేస్తారు. ఇలా శ్రద్ధగా పనులు నిర్వర్తించడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సకాలంలో పనులు కూడా పూర్తి చేసి మంచి అభిప్రాయాలను అందుకుంటారు. ఈ కచ్చితత్వం, సమయపాలన వల్ల మంచి పేరు, కృషికి తగ్గ ఫలితం వస్తుంది.
కన్యరాశి వారు తెలివిగా చేసే పనులు మంచి ఫలితాలను అందిస్తాయి. పెట్టుబడి నుంచి లాభాలు, పొదుపు నుంచి మంచి ఆదాయం వస్తుంది. వచ్చే సంవత్సరం పాటు కన్య రాశి వారికి గ్రహాల కదలికలు, సంచారం అనుకూలించి త్వరలోనే వీరు ధనవంతులు అవుతారు.
మకర రాశి:
మకర రాశి వారు క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు. ఏ పని చేసినా క్రమశిక్షణగా చేస్తారు. ఈ క్రమశిక్షణ వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. మకర రాశి వారిపై ఇతరులకు మంచి అభిప్రాయం ఉండటానికి కారణం కూడా ఇదే. రాబోయే సంవత్సరం మకర రాశి వారికి అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉండనున్నాయి. గ్రహాల కదలిక, సంచారం, కలయిక కలిసి రానుంది. రాజయోగాలు మకర రాశి వారిని ధనవంతులను చేయనున్నాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications