Latest Updates
-
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా?
ఇంట్లో ఈ మొక్క పెంచితే.. అప్పుల బాధలు తొలగిపోతాయి, డబ్బే డబ్బు..
ఇంట్లోని వస్తువులు ఒక చోట మరో చోట ఉంచినా అది వాస్తుపై ప్రభావం చూపిస్తుంది. హిందూ మతం ప్రకారం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రాన్ని సరిగ్గా అనుసరించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి స్థిరమైన ఆదాయం లభిస్తుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణం నుంచి ఇంటి అలంకరణ వరకు వాస్తు శాస్త్రం కీలకమైన పాత్ర పోషిస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం చిన్న చిన్న పనులు కూడా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ఆఫీసులో, ఇంట్లో ఉంచడానికి కొన్ని రకాల మొక్కలు మంచివని శాస్త్రం చెబుతోంది. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది. సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి, అనుకూల శక్తులు ప్రవేశిస్తాయి.

ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోతాయి:
వాస్తు శాస్త్రం ప్రకారం క్రాసులో మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో క్రాసులా మొక్కను పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అలాగే క్రాసుల మొక్క వెదజల్లే పాజిటివ్ శక్తి వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి. ఆదాయం స్థిరంగా రావడంతో పాటు ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు శాంతి లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆర్థిక సమస్యలను, అప్పుల బాధలను తొలగించి చేతినండా డబ్బు సంపాదిస్తారు.
క్రాసులా మొక్కను ఇంట్లో ఎక్కడ ఉంచాలి?
క్రాసులా మొక్క ప్రతికూల శక్తిని తొలగించి, అనుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఈ చిన్న మొక్కను ఇంట్లో పెంచుకుంటే పెద్ద ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రాసులా మొక్క ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని అంటున్నారు. అయితే ఈ మొక్కను ఇంట్లో ఎక్కడ ఉంచాలి అనే డౌట్ రావొచ్చు. అయితే ఈ క్రాసులా మొక్కను ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఉంచడం వల్ల దానిని దాటుకు ప్రతికూల శక్తి ఇంట్లోకి రాలేదు. అలాగే అనుకూల శక్తిని ఇది ఆకర్షిస్తుంది. దీని వల్ల ఇంట్లో శాంతి సామరస్యాలు నెలకొంటాయి. దంపతుల మధ్య సాన్నిహిత్యం కూడా మెరుగుపడుతుంది.
ఈ మొక్కను ఏ దిశలో ఉంచాలంటే..
వాస్తు శాస్త్రం అంటేనే దిశలు. 8 దిశలకు తమ తమ ప్రాధాన్యతలు ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రవేశ ప్రధాన ద్వారా తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఉండాలి. అలా ఉన్న ప్రవేశ ద్వారం పక్కన క్రాసులా మొక్కను ఉంచడం మంచిది. ద్వారాని ఏ వైపున ఉంచాలి? ప్రధాన ద్వారానికి కుడి వైపున ఈ క్రాసుల మొక్కను ఉంచడం మంచిది. దీంతో లక్ష్మీ దేవి చాలా సంతోషిస్తుంది. క్రాసులా మొక్కను ఇలాం ఉంచడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంట్లోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
