Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి.. లేనిపోని సమస్యలను తీసుకొస్తాయి
ఇంట్లో మొక్కలు పెంచుకుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. పచ్చని మొక్కలతో మనసుకు ప్రశాంతంగా, చూడటానికి కూడా అందంగా ఉంటుంది. ఇంటి పరిసరాల్లో, ఇంటి లోపల కూడా కొన్ని రకాల మొక్కలను అందంగా పెంచుకుంటే ఆ ఇల్లు చూడటానికి నందనవనంలా కనిపిస్తుంది. మొక్కలు పాజిటివ్ వైబ్ ను అందిస్తాయి. పచ్చని రంగు వల్ల మెదడు ఆహ్లాదానికి గురై ఆనందాన్ని ఇచ్చే హార్మోన్లను విడుదల చేస్తాయి.
చాలా మంది ఎంతో ఇష్టంగా ఇంట్లో మొక్కలు పెంచుకుంటారు. ఇంటి పరిసరాల్లో ఇంట్లోనూ రకరకాల మొక్కలు పెంచుకుంటారు. పూల మొక్కలు, మనీ ప్లాంట్ లాంటి డెకరేటివ్ ప్లాంట్లు పెంచుకుంటారు. ఇందులో తులసి లాంటి ఆధ్యాత్మిక మొక్కలు కూడా ఉంటాయి.

అయితే ఇంటి పరిసరాల్లో, ఇంటి లోపల పెంచుకునే మొక్కల వల్ల వాస్తు ప్రకారం అనుకూల, ప్రతికూల ప్రభావం చూపిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల మొక్కల పెంపకం వల్ల శుభ ఫలితాలు వస్తే, మరికొన్ని రకాల మొక్కల వల్ల అశుభ ఫలితాలు ఏర్పడి సమస్యలు వస్తాయని అంటున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో, ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి, ఎలాంటి మొక్కల వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి, ఎలాంటి మొక్కలను ఇంట్లో పెంచుకోవద్దో ఇప్పుడు తెలుసుకుందాం.
కాక్టస్
ఈ ఏడారి మొక్కలు నీళ్లు లేకుండా కూడా పెరుగుతుంటాయి. గొప్ప ఔషధ గుణాలు ఉన్న ఈ కాక్టస్ మొక్కలను చూడటానికి కూడా వెరైటీగా అందంగా ఉంటాయి. ఈ చిన్న చిన్న కాక్టస్ ప్లాంట్లను ఇంట్లో పెంచుకుంటే చాలా అందంగా కూడా ఉంటాయి. అయితే ఈ ముళ్లు ఉండే ఏడారి మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ముళ్లు ఉండే ఈ చెట్లు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి. నెగెటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో తలపెట్టే పనుల్లో అపజయం ఎదురవుతుంది. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలను ఇంట్లో పెంచకూడదని చెబుతారు.
బోన్సాయ్
బోన్సాయ్ మొక్కలు చూడటానికి చాలా చాలా అందంగా ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు, భారీ వృక్షాలు కూడా చిన్నగా కనిపిస్తూ భలే ఆకట్టుకుంటాయి. ఇలాంటి బోన్సాయ్ మొక్కలను ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా, మధ్యలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందని చాలా మంది పెంచుకుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల సమస్యలు వస్తాయి. ఈ బోన్సాయ్ మొక్కలు ఎదుగుదలను ఆపేస్తాయని అంటారు. ప్రకృతి విరుద్ధంగా ఈ మొక్కలను పెంచడం వల్ల ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయని వాటి వల్ల తలపెట్టని పనిలో విజయం సాధించలేరని అంటారు.
లక్కీ బాంబూ
చిన్న చిన్న బాంబూ ప్లాంట్లు చాలా ఆకట్టుకునేలా ఉంటాయి. బాంబూ ప్లాంట్లను లక్కీ బాంబూ ప్లాంట్లు అని కూడా పిలుస్తుంటారు. ఇంట్లో, ఆఫీస్ డెస్క్ లపై, దుకాణాల్లో కౌంటర్లపై లక్కీ బాంబూ ప్లాంట్లను పెంచుకుంటారు చాలా మంది. ఈ చిన్న వెదురు మొక్కల వల్ల అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. అయితే వెదురు చెట్లను ఇంట్లో, కార్యాలయాల్లో పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది. కానీ పెద్ద వెదురు చెట్లనో ఇంటి వెనక మాత్రం పెంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు జరుగుతాయి. వ్యక్తిగత వృద్ధి కూడా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
పత్తి చెట్లు
ఇంట్లో, ఇంటి పరిసరాల్లో ఎట్టిపరిస్థితుల్లో పత్తి చెట్లు పెంచుకోవద్దని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. పత్తి చెట్లు నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. దీని వల్ల సమస్యలు పెరుగుతాయి.
అలాగే ఏ చెట్లు అయినా, మొక్కలనైనా పడక గదిలో ఎట్టిపరిస్థితుల్లోనూ పెంచకూడదని హెచ్చరిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. బెడ్రూములో మొక్కలు ఉంచడం వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం తగ్గిపోతుంది, సమస్లు వస్తాయని చెబుతున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications