Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. మీకు ఎలాంటి రోగాలు రావు! ఎక్కడ దొరుకుతాయంటే?
చలికాలం వచ్చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికాలంతో పాటు వాయు కాలుష్యం కూడా ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమైంది. విషపూరితమైన గాలి కారణంగా అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో అత్యంత దారుణమైన గాలి నాణ్యత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు సైతం ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి.
ఇలాంటి సందర్భంలో కొన్ని చెట్లను ఇంట్లో పెంచుకునే గాలి నాణ్యత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ ప్యూరిఫైయర్ మాదిరిగా కాకున్నా.. గాలి నాణ్యత పెరిగే అవకాశం ఉంటుందని, ఆ మొక్కలను ఇంట్లో సైతం పెంచుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఎలాంటి చెట్లను ఇంట్లో పెంచుకోవాలి?, వాటి పేర్లు ఏంటి? ఏ విధంగా వాటిని పెంచుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్పైడర్ ప్లాంట్
ఈ చెట్టును రిబ్బన్ ప్లాంట్ లేదా ఎయిర్ ప్లాంట్ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఒక ఇండో ప్లాంట్. ఈ మొక్క గాలిలోని టాక్సిన్స్‌ను గ్రహించేస్తుంది. అలాగే ఇంట్లో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు చాలా వరకు ఉపయోగపడుతుంది. దీనిని ఇంట్లోనే చాలా సులభంగా పెంచుకోవచ్చు. వీలైతే పడక గదిలో కూడా ఈ చెట్టును పెంచుకోవచ్చు.
స్నేక్ ప్లాంట్
ఈ స్నేక్ ప్లాంట్ గాలి నాణ్యతను పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది గాలిలోని హానికరమైన కణాలను ఫిల్టర్ చేస్తుంది. అలాగే గాలిని మొత్తాన్ని శుభ్రంగా పీల్చుకోగలిగే విధంగా మార్చేస్తుంది. అలాగే ఇందులో కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించే సత్తా ఉంటుంది. ఇది ఇంట్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ పెంపొందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
కలబంద మొక్క
కలబంద గురించి మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే చర్మ సౌదర్యానికి ఇది ఒక దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఎంతో ఔషధ గుణాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందొచ్చు. వాటిలో గాలిని ఫిల్టర్ చేయడం కూడా ఒకటి. గాలిలో ఉండే బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి సూక్ష్మ కణాలను ఇది ఫిల్టర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే గాలి నాణ్యతను పెంచి.. స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.
వెదురు తాటి లేదా బాంబ్ ప్లాంట్
ఈ చెట్టు కొంచెం పొడుగ్గా ఎదిగినా మంచి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ చెట్టు గాలిలో ఉండే బెంజీన్, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరోథైలీన్, జిలీన్, టోలున్ వంటి ప్రమాదకరమైన కణాలను ఫిల్టర్ చేసి, స్వచ్ఛమైన గాలి పీల్చుకునే విధంగా సహాయపడుతుంది. దీనిని ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు డెకరేషన్ గా ఇది సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మేము ఇవి కచ్చితమైనవని నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు లేదా అమలు చేసే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎటువంటి పరిహారానికి కూడా బోల్డ్ స్కై తెలుగు బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications