Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఈ రాశులవారితో జాగ్రత్త! ప్రేమలో, దాంపత్యంలో మోసం చేస్తారు
కొందరు అంతే.. వారికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఎంత ప్రేమించినా వారికి అనవసరం, వారికోసం ప్రాణాలు కూడా ఇచ్చే ప్రేమికులు, జీవిత భాగస్వామి ఉన్నా వారిని మోసం చేస్తుంటారు. ఎన్ని ఉన్నా.. ఏదో ఒక దానికోసం ఇతరుల వెంట పడుతుంటారు. ప్రేమ బంధాన్ని, దాంపత్య సంబంధాన్ని అపహాస్యం చేసి వేరొకరితో ఎఫైర్ పెట్టుకుంటారు. ఇలాంటి మోసపూరిత వ్యక్తులను గుర్తించడం చాలా చాలా కష్టం. ఎందుకంటే వాళ్లు నిజమైన ప్రేమికుల కంటే కూడా ఎక్కువ ప్రేమ ఒలకబోస్తారు. తేనె పూసిన కత్తిలా.. అవసరం, అనుకూలమైన సమయం వచ్చినప్పుడు మాత్రమే వారిలో నిజస్వరూపం బయటకు వస్తుంది.

అయితే, వేదజ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశుల వారు ప్రేమ బంధంలో, దాంపత్యం బంధంలో భాగస్వాములను మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రాశుల వారు ఎవరో, ఎలా మోసం చేస్తారో ఇప్పుడూ చూద్దాం.
మిథునరాశి
మిథునరాశి వారిని బుధుడు పాలిస్తాడు. ఈ రాశి వారికి రెండు స్వభావాలు ఉంటాయి. ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులను ఇట్టే ఆకట్టుకోగలరు. కొత్తదనం కావాలనుకుంటారు. ఒకే వ్యక్తితో కూడా ఎక్కువరోజులు ఉండలేరు. ఒకరితో ఉంటూనే మరొకరిని ఊహించుకుంటారు. వీరు మోసం చేసే అవకాశాలు ఎక్కువ. ఇతరులతో అఫైర్ పెట్టుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత మరొకరిని ఇష్టపడి వారితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వీరికి చాలా సులభం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిని బృహస్పతి పాలిస్తుంది. ధనుస్సు రాశి వారు కొత్త వ్యక్తుల సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తారు. కొత్త అనుభవాలు కోరుకుంటారు. అలాగే స్వేచ్ఛను ఇష్టపడతారు. బంధంలో ఇమడలేరు. హద్దుల్లేని జీవితాన్ని కోరుకుంటారు. వారి కోరికల కోసం సంబంధంలో మోసం చేయడానికి వెనకాడరు. శృంగార కోరికలు అయినా, ఆర్థిక కోరికల కోసం అయినా భాగస్వాములను మోసం చేస్తుంటారు.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారిని కుజుడు పాలిస్తాడు. వీరు జీవిత భాగస్వాముల పట్ల ఇష్టం, ప్రేమతో ఉంటారు. కానీ వృశ్చిక రాశి వారికి కోరికలు ఎక్కువ. సంబంధం విషయానికి వచ్చేసరికి కోరికలు డామినేట్ చేసి మరొకరిని కోరుకునేలా చేస్తాయి. కోరికలను అదుపు చేసుకోలని వ్యక్తిత్వం వల్ల భాగస్వాములను మోసం చేస్తారు.
మేషరాశి
మేషరాశి వారిని కుజుడు పాలిస్తాడు. మేషరాశి వారు సంబంధాలకు విలువ ఇస్తారు, ఆశలు, ఆశయాలు, కోరికల వల్ల సంబంధాలను త్యజిండానికి వెనకాడరు. కొన్నిసార్లు అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటారు. మేషరాశి వారు కొన్నిసార్లు భాగస్వాములను మోసం చేసి మరొకరితో సంబంధం పెట్టుకుంటారు. వివాహేతర సంబంధానికి కూడా ఆకర్షితులు అవుతుంటారు. ఇతరులతో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇతరులను ప్రేమించడం అంటూ ఉండదు. కానీ శారీరక అవసరాల కోసం మాత్రం వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications