Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఈ రాశుల వారు వారి ప్రియమైన వారికి తెగ బహుమతులు ఇస్తుంటారు, అలాగే..
మీ ఫ్రెండ్స్‌లో, మీ ప్రియమైన వారిలో ఈ రాశుల వారు ఉంటే మీకు గిఫ్ట్స్ ఇస్తారు. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
గిఫ్ట్స్.. చాలా మంది వీటిని తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు. మనలో చాలా మంది ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తామంటే వద్దాంటారా.. ఎవరూ అనరు. ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం చాలా అరుదు. ప్రేమికులైతే ఒకరికొకరు తరచూ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. సందర్భం వెతుక్కుని మరీ బహుమతులు, సర్‌ప్రైజ్‌లు ఇచ్చుకుంటారు. మనలో చాలా మందికి బహుమతులు తీసుకోవడం ఇష్టం కాబట్టి ఇస్తే తీసేసుకుంటాం. అయితే కొన్ని రాశుల వారికి గిఫ్ట్స్ ఇవ్వడం కంటే తీసుకోవడమే చాలా నచ్చుతుంది.

మీ ఫ్రెండ్స్‌లో, మీ ప్రియమైన వారిలో ఈ రాశుల వారు ఉంటే మీకు గిఫ్ట్స్ ఇస్తారు. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు మిగతా విషయాల్లో ఎలా ఉన్నా.. ఖర్చు పెట్టడంలో మాత్రం చాలా ముందుంటారు. ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనకాడరు. చిన్ననాటి జ్ఞాపకాలను ప్రేరేపించే విషయాలు లేదా మీరు మీ చేతుల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్న వాటిని వారు మీకు అందజేస్తారు.
మీరు ఎవరైనప్పటికీ వారి బహుమతుల గురించి వారు చాలా ఆలోచిస్తారు. వారు మీ ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. మీకు ఆ ఖచ్చితమైన బహుమతిని పొందడానికి చాలా కష్టపడతారు.

కుంభరాశి:
కుంభ రాశి వారు సంబంధంలో కొంత క్రేజీగా ఉంటారు. వీరి తీరు కొన్ని సార్లు చికాకు తెప్పి్తుంది. కానీ బహుమతుల విషయంలో కుంభరాశి వారు ఏమాత్రం వెనకాడరు. మంచి ఖరీదైన వాటిని కొనేందుకు ప్రయత్నిస్తారు.
వారికి నచ్చే వారి కోసం ఎంత ఖరీదైనా బహుమతులు కొని ఇస్తుంటారు. స్నేహానికి కుంభరాశి వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

కన్య:
కన్య రాశి వారికి బహుమతులు ఇవ్వడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. గిఫ్ట్స్ ఇవ్వడంలో వీళ్లు పోటీ కనబరుస్తారు. అంటే మీరొక బహుమతి తీసుకుంటే, వారు మరొకటి అంతకంటే ఖరీదైనది, విలువైనది ఇవ్వాలని భావిస్తారు. అలాంటి గిఫ్ట్ కోసం చాలా శ్రమిస్తారు.
కన్య రాశి వారు మిగతా విషయాల్లో ఆచితూచి వ్యవహరించినా.. ప్రియమైన వారికి, వారు ప్రేమించే వారికి ఖర్చుకు వెనకాడకుండా ఖరీదైన వాటిని గిఫ్ట్‌గా ఇస్తారు.

తులారాశి:
తులారాశి వారు ప్రియమైన వారిని ఉబ్బితబ్బిబ్బు చేయాలని చూస్తుంటారు. సందర్భం దొరికితే వారి సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తారు. ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి, ఎలాంటిదైతే వారు ఎక్కువగా సంతోషిస్తారోనని తరచూ ఆలోచిస్తూనే ఉంటారు.
గిఫ్ట్ ఇస్తున్నప్పుడు తీసుకునే వారి ముఖంలో కనిపించే ఆనందాన్ని చూడటం వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది.
మేషం, వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, మకరం, మీనరాశుల వారు గిఫ్ట్స్ ఇవ్వడానికి అంతగా ఇష్టపడరు. కానీ మిగతా వాళ్లు బహుమతులు ఇస్తే చాలా సంతోషంగా తీసుకుంటారు.



Click it and Unblock the Notifications