Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ నాలుగు రాశుల వాళ్లకు ఆత్మవిశ్వాసం తక్కువ.. దీని వల్లే సమస్యలన్నీ!
మనకు ఏవైనా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కొన్ని సార్లు మనకు తోడుగా నిలబడేందుకు ఎవరూ ముందుకు రారు. అలాంటప్పుడు మనకోసం మనమే నిలబడాలి. మనకోసం మనమే వాదించుకోవాలి. ఇలా మనకు మనం అండగా నిలబడాలనుకుంటే ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఇది ఉంటే ఎలాంటి పరిస్థితిని అయినా గెలవగలం.
కానీ మనం ఎదుర్కునే బాధలు, అవమానాలు మనల్ని అడుగు ముందుకు వేయనివ్వవు. మన తరఫున మనం వాదించుకోవడానికి వీళ్లేకుండా పోతుంది. తమ కోసం తాము మాట్లాడుకోలేక ఓడిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వాళ్లకు ఆత్మవిశ్వాసం చాలా తక్కువ. దాని వల్ల అనేక సార్లు సమస్యలు ఎదుర్కొని ఉంటారు.

1. కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్లు భావోద్వేగం ఎక్కువ కల వాళ్లు. వీరు ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఈ వ్యక్తులు ఎప్పుడూ తమ కోసం మాట్లడరు. తమను తాము విస్మరించి ఇతరుల సంతోషం కోసం పని చేస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం చాలా తక్కువ. క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ కోసం తాము వాదించుకోరు. ఇలావీరు అనేక సార్లు తమ జీవితంలో వైఫల్యాలు ఎదుర్కుంటారు. వీరిని ప్రోత్సహించడానికి అండగా ఎవరైనా ఉంటే చాలా మంచిది.
2. తులా రాశి
తులారాశి వారు తమ జీవితంలో చాలా దుఃఖాలు పడి ఉంటారు. పదే పదే వారు తిరస్కరణకు గురవుతూ ఉంటారు. ఈ రాశివారు సమతుల్య జీవితాన్ని ఇష్ట పడతారు. కానీ వారు తమ జీవితాల్లో సమతుల్యం కోల్పోవడంతో, వారు దుర్భలంగా మిగిలిపోతారు. ఇది అతని ప్రధాన బలహీనత. జీవితంలో ఒక్కసారే ఈ రాశులు తమ గురించి మాట్లాడుకుంటారు. ఏదైనా కావాలన్నా అడగడానికి కూడా వెళ్లరు. తద్వారా వారు పొందవలసిన అవకాశాలను కోల్పోతారు.
3. మిథున రాశి
మిథున రాశి వాళ్లు చాలా వరకు బావిలో కప్పల్లాంటివారు. వారు బయటకు రావాలని కూడా అనుకోరు. వారి పనులు, వారి జీవితం అంతే. గొడవలు పెట్టడం, సందడి చేయడం వీరికి అస్సలే ఇష్టం ఉండదు. కాబట్టి వారు తమ స్నేహితులు కోరుకున్నట్లుగా తమ జీవితాన్ని గడుపుతారు. ఎందుకంటే వారిలో ఆత్మవిశ్వాసం లేదు. అలాంటప్పుడు అనుకున్నట్లుగా జీవితాన్ని గడపడం వారికి సాధ్యం కాదు. వారి మౌనమే వారిని ఏడిపిస్తుంది.
4. వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి బలహీనత వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. వారు ఎప్పుడూ తమ గురించి ప్రతికూలంగా ఆందోళన చెందుతారు. వారు తమ గురించి సానుకూలంగా ఆలోచించరు. ఈ రాశుల వారిద్దరే ప్రేమలో పడితే.. వారు తమ భాగస్వామితో చిన్న రహస్యాన్ని కూడా పంచుకుంటారు. అయితే దీనివల్ల ఏదో ఒకరోజు బాధ పడతారు. ఎందుకంటే నమ్మిన వాళ్లు వెన్నుపోటు పొడుస్తుంటారు కాబట్టి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఈ ఆలోచనలు ఈ నాలుగు రాశుల వాళ్లందరికీ వర్తిస్యాతని చెప్పలేము. కానీ ఈ ఆలోచనలు చాలా మందికి వర్తిస్తాయి. మీకు ఈ లక్షణాలు ఉంటే వాటిని మెరుగు పరచుకోండి. మీ జీవితాన్ని హాయిగా మార్చుకొని సంతోషంగా జీవించండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications