Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఈ 5 రాశుల వారు పుట్టకతోనే యోధులు, పోరాటం వారి నెత్తురులోనే ఉంటుంది
కొందరు ఎలాంటి కష్టాన్ని, సవాలును అయినా ఎదుర్కొంటారు. వారిలో పోరాట శక్తిని చూస్తే ముచ్చటేస్తుంది. వారి పోరాటం ఇతరులకు స్ఫూర్తిగా కూడా నిలుస్తుంది. సవాళ్లు ఎదురైతే వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగే గుణం వారిలో పుట్టుకతోనే వచ్చేస్తుంది. సవాలు మీద సవాలు ఎదురయ్యే కొద్దీ వారు రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తుంటారు.
జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కూడా చాలా సులభంగా ఎదురొడ్డి నిలబడతారు. ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోరు. పోరాడితే పోయేదేముంది అన్నట్లుగా ఉంటుంది వారి మనస్తత్వం. అడ్డంకులను అధిగమించే సామర్థ్యం కారణంగా, వారు బార్న్ ఫైటర్స్ గా పరిగణించబడతారు. అలాంటి గుణాలు ఉన్న 5 రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
మేషరాశి వారు పుట్టుకతోనే యోధులు. వారి స్వభావం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎదైనా కష్టం వచ్చినా, సవాలు ఎదురైనా వారిలో ఎలాంటి బేరుకు ఉండదు. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారి అభిరుచి, సంకల్పం, పోటీ స్వభావం, కష్టాలను ఎదుర్కొనేలా ప్రేరేపిస్తాయి. మేషరాశి వారిలో నాయకత్వం లక్షణాలు కూడా సహజంహా అభివృద్ధి చెందుతాయి. ఈ లక్షణాల వల్లే వారు జీవితంలో సవాళ్లను ఎదురొడ్డి నిలబడతారు.
వృషభం:
వృషభ రాశి వారి స్వభావం నిలకడగా ఉంటుంది. ప్రశాంతాంగా కనిపిస్తారు. కానీ సవాళ్లు ఎదురైనప్పుడే వారిలో అసలు సిసలు వ్యక్తిత్వం బయటకు వస్తుంది. కష్టాలు ఎదురైతే పారిపోయే రకం కాదు వృషభ రాశి వారు. సవాళ్లను తన వృద్ధికి మెట్లుగానే భావిస్తారు. అలాగే ఏదైనా పనిని పూర్తి చేయాలని కోరుకుంటే అది అయ్యేంత వరకు విశ్రమించకుండా శ్రమిస్తారు. కష్టాలు, సవాళ్లు ఎదుర్కొంటూ జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు.
సింహరాశి:
సింహరాశి వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఏదైనా సందర్భం ఎదురైనప్పుడు వారిలోని విశ్వాసం బయటకు వస్తుంది. సవాళ్లు వచ్చినప్పుడు, ఏదైనా పనిని పూర్తి చేయాలని అనుకున్నప్పుడు సింహరాశి వారిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. సింహ రాశి వారు పుట్టుకతోనే పోరాట యోధులుగా ఉంటారు. వారి కలలను, కోరికలను, ఆశలను, ఆశయాలను ఏ కారణం వల్ల కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. కష్టమైనా సరే చేయడానికే ఇష్టపడతారు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కష్టాలను ఎదుర్కొని అధిగించే అసాధారణ సామర్థ్యం ఉంటుంది. ఏ సమస్యవచ్చినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. సవాలును కూడా చిరునవ్వుతో స్వీకరిస్తారు. వృశ్చిక రాశి వారిలోని నిజాయితీ వారిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఎదురుదెబ్బలను కూడా తట్టుకుని నిలబడతారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు ధైర్యంగా ఉంటారు. ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. విపరీతమైన ఒత్తిడిని కూడా తట్టుకోగలిగే సామర్థ్యం వీరిలో ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాలపై కర్కాటక రాశి వారు ఎప్పుడూ దృష్టి పెడతారు. కర్కాటక రాశి వారు చేసే పనిలో ఎప్పుడూ అశ్రద్ధ కనబరచరు. పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పనులు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎలాంటి కష్టం ఎదురైనా, సవాలు వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటారు. వారిలో పోరాట పటిమ వల్లే వారు విజయాలు అందుకుంటారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications