Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఈ 5 రాశుల వారు ఏడాదిలోగా ఇల్లు కొంటారు, మీ రాశి ఉందా చెక్ చేసుకోండి
సొంతిల్లు.. ఇది ఎంతో మంది కల. సొంతిల్లు కట్టుకోవడం చాలా మందికి జీవిత ఆశయంగా ఉంటుంది. సొంతిల్లు కట్టుకుని అందులో ఆనందంగా జీవించాలని చాలా మంది కోరుకుంటారు. కానీ అది అంత సులభమైనది కాదు. బాగా సంపాదించాలి, సంపాదిండానికి చెమటోడ్చి కష్టపడాలి. లక్షల్లో సంపాదించి అది కూడబెట్టి ఇల్లు కట్టుకునేలోపు వాటి ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి. అలా చాలా మంది ఇల్లు కట్టుకోవడాన్ని జీవిత ఆశయంగా పెట్టుకుంటారు. ఇల్లు కట్టుకోవడం అంత కష్టమైంది కాబట్టే.. 'ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు' అనే అంటుంటారు పెద్దలు.
వేద జ్యోతిష్యం ప్రకారం జాతక, కర్మ ఫలాలు అనుకూలిస్తే ఇల్లు కట్టడమైనా, పెళ్లి చేయడమైనా జరిగిపోతాయని చెబుతున్నారు జ్యోతిషశాస్త్ర నిపుణులు. అలాంటి జాతక, కర్మ ఫలాలు అనుకూలించడం వల్ల 2024 లో కొన్ని రాశుల వారు సొంతింటి కలను నిజం చేసుకోబోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ 5 రాశుల వారు ఏడాదిలోగా సొంతింటి గృహ ప్రవేశం చేస్తారని అంటున్నారు. మరి ఆ 5 రాశులు ఏవి, అందులో మీ రాశి ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మకరరాశి
మకర రాశి వారు తమ సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోసం దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకుంటారు. వారి కలలకు నిజరూపం ఇచ్చేందుకు చాలా కష్టపడి పని చేస్తారు. కష్టే ఫలి అన్నట్లుగా వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. దూరదృష్టితో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. మకర రాశి వారు వచ్చే ఏడాది కాలంలో సొంతింటి కలను నెరవేర్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
వృషభరాశి
వృషభ రాశి వారు ఆర్థిక స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. ఆచరణాత్మకంగా వ్యవహరించడం వల్ల సమస్యలు ఎదురైనా చాలా సులభంగా ఎదుర్కొని నిలబడతారు. సొంతిల్లు కట్టుకోవాలన్న ఆశతో ఆర్థిక వ్యవహారాలను నిర్వర్తిస్తారు. పొదుపు సామర్థ్యాలు, సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావారణాన్ని సృష్టించుకోవాలన్న సంకల్పంతో పని చేస్తారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేయడంలో వృషభ రాశి వారు దిట్ట. వచ్చే ఏడాది కాలంలో వృషభ రాశి వారు సొంతింట్లోకి అడుగుపెట్టేందుకు అనుకూలంగా ఉంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు జీవితం సాఫీగా, సంతోషంగా, హాయిగా సాగాలని కోరుకుంటారు. అందుకోసం కష్టపడటానికి సిద్ధంగా ఉంటారి. కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి తపిస్తారు. వారికి ఓ లోటూ రాకుండా చూసుకుంటారు. భవిష్యత్తు కోసం కఠినంగా కష్టపడతారు, కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. సొంతిల్లు అనేది కర్కాటక రాశి వారికి కలగా ఉంటుంది. దానిని ఈ ఏడాది కాలంలో నెరవేర్చుకుంటారు.
కన్యరాశి
కన్య రాశి వారు ఆచరణాత్మక ధోరణితో వ్యవహరిస్తారు. ప్రణాళికలు వేయడంలో వాటిని ఆచరించడంలో కన్యరాశి వారికి మరెవరు సాటిరారు. ఆర్థిక లక్ష్యాలు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు వాటిని అందుకునేందుకు కష్టపడతారు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం శ్రమిస్తారు. కన్యరాశి వారి దీర్ఘకాలిక లక్ష్యమైన సొంతింటి కలను వచ్చే ఏడాది కాలంలో నెరవేర్చుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఆచరణాత్మకంగా ఉండటం, అనవసర ఖర్చులు తక్కువగా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు పెద్దగా ఉండవు. ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకోవడంలో ముందుంటారు. తెలివిగా అడుగులు వేస్తారు. మెరుగైన జీవితం కోసం శ్రమిస్తారు. కలలను సాధించడానికి కష్టపడి పని చేస్తారు. వచ్చే ఏడాది కాలంలో వృశ్చిక రాశి వారు తమ సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కుంభరాశి
మంచి నిర్ణయాలు తీసుకోవడంలో కుంభ రాశి వారు చాకచక్యంగా వ్యవహరిస్తారు. భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ఇతరులపై ఆధారపడి ఉండటం వీరికి నచ్చదు. స్వతంత్ర్య భావాలు కలిగి ఉండటంలో కుంభరాశి వారు ముందుంటారు. సొంతిల్లు ఉండాలన్న కలను వచ్చే ఏడాది కాలంలో నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications