Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ రాశుల వారు.. పెరిగిన ఊరికి, తల్లి లాంటి దేశానికి సేవ చేయడంలో ముందుంటారు
77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశ సంసిద్ధం అవుతోంది. స్వాతంత్ర్యం దినోత్సవం కోసం ముమ్మరంగా సన్నాహాలు జరుగుుతన్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ దేశం అంటే ప్రేమ, భక్తి ఉంటుంది. దేశ భక్తి గీతాలు, దేశభక్తిని చూపే సినిమాల పట్ల చాలా మంది ఆకర్షితులవుతారు. అయితే కొంత మందిలో దేశం అన్నా.. పుట్టి పెరిగిన ఊరు అన్నా ఎనలేని ప్రేమ, ఇష్టం, అభిమానం ఉంటుంది. వారు నిత్యం దేశం కోసమే తపిస్తారు.
జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశుల వారికి దేశం అంటే ఎంతో గౌరవం, ఇష్టం, ప్రేమ, అభిమానం ఉంటుంది. వారు దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఆ రాశుల వారు ఎవరు, అందులో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు తెలుసుకోండి.

వృషభం
దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని వృషభ రాశి వారు ఎంతో గౌరవిస్తారు. వారుతమ దేశ సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర గురించి చాలా గర్వంగా ఉంటారు. దేశం కోసం ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు, వృషభ రాశి వారు ఎప్పుడూ ముందుకు వస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారి దేశం పట్ల చాలా ఎమోషనల్ గా ఉంటారు. స్వాతంత్ర్య సమరయోధుల గురించి తలచుకున్నప్పుడల్లా వారి గురించి చదివినప్పుడల్లా ఏదైనా దేశభక్తి సినిమా చూసినప్పుడల్లా వారి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.
తులారాశి
తులారాశి వారు తమ దేశం గురించి చెడుగా మాట్లాడితే ఏమాత్రం సహించరు. వారిలో దేశభక్తి, దేశం పట్ల ప్రేమ చాలా బలంగా ఉంటాయి. ప్రపంచ వేదికల్లో దేశం గురించి ఏదైనా గర్వించ దగిన చర్య జరిగితే దానిని తలచుకుని ఉప్పొంగిపోతారు.
మకరరాశి
మకరరాశి వారు దేశం నుంచి పొందిన వాటికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతారరు. దేశం తనకు ఏం ఇచ్చింది అనే దానికంటే.. తను దేశానికి ఏం ఇవ్వాలనే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. దేశం కోసం ఏదైనా చేయగలిగే ధైర్యాన్ని కలిగి ఉంటారు.
మీనరాశి
దేశం గురించి చదివినప్పుడు లేదా మాట్లాడినప్పుడు వారు చాలా భావోద్వేగానికి గురవుతారు. మీన రాశి వారు భారతీయ పౌరుడిగా గొప్ప గర్వం మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. వారు స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications