Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
2025కు ముందే తప్పక చేయాల్సిన 6 పనులు.. చేయకపోతే చాలా కోల్పోతారు!
2024 సంవత్సరం చివరి దశకు వచ్చేసింది. ఇంకో నెల రోజుల్లో 2025వ సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సాధారణంగానే ముగించకుండా 2025వ సంవత్సరం ప్రారంభమయ్యే ముందు ఈ ఆరు పనులు చేయాలి. ఇవి వచ్చే సంవత్సరం మీ ఆదాయం పెంచడంతో పాటు సమాజంలో మీ స్థాయిని పెంచుతుంది. అలాగే దీర్ఘ కాలంలో మీకు ఈ పనులు ఉపయోగపడనున్నాయి. ఇంతకీ ఈ సంవత్సరం ముగియకముందు ఎలాంటి పనులు చేయాలి? ఆ పనులు ఏ విధంగా ఉపయోగపడనున్నాయి అనేది ఈ స్టోరీలో తెలిపాము.
మీ లక్ష్యాలను నిర్ధారించుకోండి
ఏ పనినైనా లక్ష్యంగా పెట్టుకొని చేస్తే సాధ్యం కాకుండాపోదు. అది ఎంతటి కష్టమైనది అయినా? ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. లక్ష్యంతో ఆ పనిని పూర్తి చేయాలనుకుంటే కచ్చితంగా అది పూర్తవుతుంది. అందుకే 2025వ సంత్సరంలో ఏం సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యాలను నిర్ధారించుకోండి. ఆ లక్ష్యాలను చిన్న చిన్న భాగాల్లో డివైడ్ చేసి, ఒక్కొక్కటిగా సాధించేందుకు ప్రయత్నించండి. అలాగే ఆ లక్ష్యాలను సాధించే క్రమంలో మీ పురోగతిని కూడా పరిశీలించుకోండి.

మెడిటేషన్, వ్యాయామం
ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగినంత సమయం కూడా దొరకడం లేదు. అందుకే కొత్త ఏడాదిలోనైనా మీ ఆరోగ్యంపై ద్రుష్టి పెట్టండి. మీ రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మెడిటేషన్ లేదా వ్యాయామాన్ని జత చేసుకోండి. ప్రతిరోజూ మెడిటేషన్, వ్యాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగవడంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుటుంది. పనిపై శ్రద్ధ పెరుగుతుంది. ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతారు.
సరైనా డైలీ రొటీన్
ఏ పనిలో విజయం సాధించాలన్నా క్రమశిక్షణ, కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. ఏ పనినైనా క్రమశిక్షణతో పాటు కన్సిస్టెంట్‌గా చేస్తే కచ్చితంగా విజయవంతమవుతాము. అందుకే 2025లో సరైనా క్రమశిక్షణ కలిగిన డైలీ రొటీన్‌ను రూపొందించుకోండి. ఇలాంటి డైలీ రొటీన్ మీ ఎంచుకున్న లక్ష్యాలను సాధించడంలో సహాయపడడంతో పాటు మీకు మంచి హ్యాబిట్స్ అలవాటు పడే విధంగా తోడ్పడతాయి.
కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి..
కాలం చాలా వేగంగా మారుతోంది. కాలానికి అనుగుణంగా మనిషి కూడా మారకపోతే అందరికంటే వెనకబడిపోతారు. అందుకే కాలంతో పాటు మనం కూడా అప్డేట్ అవడంతో పాటు కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఎలాంటి నైపుణ్యాలు నేర్చుకోకపోయినా, మీకు కొన్ని నైపుణ్యాలు ఉన్నా.. 2025లో కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. ఇలా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఒక రంగంలో కాకపోతే ఇంకో రంగంలో రాణించేందుకు ఉపయోగపడతాయి.
బంధాలను బలపరుచుకోండి..
ఉరుకులు పరుగుల జీవితం, డబ్బులు సంపాదించుకోవడం కోసం ఆరాటం ఈ క్రమంలో బంధాలను పట్టించుకోవడమే మానేశారు. భార్య, పిల్లలకు సమయం కేటాయించడం లేదు. తల్లిదండ్రులతో కనీసం మాట్లాడడం లేదు కూడా. అందుకే 2025లో మీ కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించండి. మీ స్నేహితులతో విలువైన కాలాన్ని గడపండి. తల్లిదండ్రులతో మాట్లాడి వారి యోగక్షేమాలను పర్యవేక్షిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీ బంధం బలవంతమవడంతో పాటు, సంబంధాలు కూడా చాలా బాగుంటాయి.
హాలిడేలకు వెళ్ళండి..
చేస్తున్న పని ఏదైనా కొంత విశ్రాంతి అవసరం. ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు పనిలో పురోగతి కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు మీ వేళ్ళని ప్రదేశాలకు 2025లో ట్రిప్‌కు వెళ్ళండి. వీలైతే ఒంటరిగా లేకపోతే ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. ఇది మీ పనిలో పురోగతితో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. 2025 ప్రారంభమవక ముందే ఈ పనులు చేయండి. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగండి.



Click it and Unblock the Notifications