Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
అరెస్ట్ తరువాత అల్లు అర్జున్ చేసిన పనికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.. అందరూ తప్పక నేర్చుకోవాలి!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు బెయిల్ లభించడంతో ఆయన నిన్న విడుదలయ్యారు కూడా. అయితే జైలు నుంచి విడుదలైన తరువాత అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు, ఆయన మాట్లాడిన విధానానికి ఎవరైనా హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఆయన మాట్లాడిన విధానం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎంతో మంది యువత, ఎంతోమంది అల్లు అర్జున్ నుంచి ఇవి కచ్చితంగా నేర్చుకోవాలి. ఆ విషయాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చట్టాన్ని గౌరవించడం
అల్లు అర్జున్ సూపర్ స్టార్. పుష్ప 2 మూవీతో దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించారు. ఎవరికీ అందని రికార్డులను తన ఖాతాలో వేసుకోనున్నారు. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు కొల్లగొట్టాడు. దేశమంతా తెలిసిన సూపర్ స్టార్ అయినా.. అల్లు అర్జున్ ఒక సాధారణ వ్యక్తిగా చట్టాన్ని గౌరవించారు. పోలీసులకు సహకరించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కోర్టు శిక్ష విధించడంతో జైలుకు కూడా వెళ్లారు. ఇది రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల ఆయనకున్న గౌరవాన్ని సూచిస్తుంది. చట్టాన్ని గౌరవించాలనేది నేర్పుతుంది.

సమయస్ఫూర్తి
కష్టమైన సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు నిజంగా ప్రశంసనీయం. సమయస్ఫూర్తితో ఒక్క మాట కూడా తడబడకుండా, ఎవరినీ కించబరచడకుండా, ఎవరి మనసు నొప్పించకుండా వ్యవహరించారు. బయట ఎన్నో వార్తలు హల్‌చల్ చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా చట్టాన్ని గౌరవిస్తున్నానని, చట్టానికి సహకరించానని తెలిపారు. ఎవరిపై కూడా ఒక్క మాట కూడా అనలేదు. సమయానికి అనుగుణంగా వ్యవహరించి సమయస్ఫూర్తితో మాట్లాడిన తీరు నిజంగా అభినందనీయం.
ఓపిక
ఓ వైపు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. మరోవైపు ఆయన అరెస్ట్‌పై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేశాయి. ఆ వ్యక్తి వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని, అతనే అరెస్ట్ చేయించారని, కుట్ర పూరితంగానే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. అందులో నిజం ఏమేర ఉందో తెలియనప్పటికీ, అల్లు అర్జున్ ఓపికతో వాటిని డీల్ చేసిన విధానం నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఒక్క మాట కూడా తుళ్లకుండా ఓపికతో సమాధానాలు చెప్పారు. దీన్నిబట్టి కొన్ని సమస్యాత్మక వ్యవహారాల్లో ఓపికతో ఉండాలని సూచిస్తుంది.
కుటుంబం ఉందని..
ఈ ప్రపంచంలో కష్ట సమయంలో ఎవరు రాకపోయినా కుటుంబం మాత్రం వెన్నంటే వస్తుంది. మనం కష్టపడితే కుటుంబం కంట్లో నుంచి కన్నీళ్లు వస్తుంటాయి. అలానే అల్లు అర్జున్ కుటుంబంలో కూడా జరిగింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారో వెంటనే తన ఫ్యామిలీ దగ్గరకు వెళ్లారు. తనకు ఏమీ జరగలేదని, తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. తన కుటుంబం అన్నిటికంటే ముఖ్యమైనదని చాటారు.
ఇవి ముఖ్యమైన విషయాలు. అల్లు అర్జున్ తరువాత వ్యవహరించిన ఈ విషయాలను ప్రతి మనిషి నేర్చుకోవాలి. ఈ విషయాలను నేర్చుకున్న వ్యక్తులు ఎటువంటి సమయాల్లోనైనా రాణించగలరు. ఎలాంటి విషయాన్ని కూడా డీల్ చేయగలరు.



Click it and Unblock the Notifications